ఇక్కడ ఏమీ లేదు.. సమంత పోస్ట్‌ వైరల్‌ | Samantha Latest Instagram Post Went Viral On Social Media From Abu Dhabi Tour | Sakshi
Sakshi News home page

Samanth: హడావిడి లేదు.. సమంత పోస్ట్‌ వైరల్‌

Jun 6 2025 9:11 AM | Updated on Jun 6 2025 11:02 AM

Samantha Latest Instagram Post Goes Viral

హీరోయిన్‌ సమంత(Samantha) క్రేజ్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. చేతిలో సినిమాలు ఉన్నా లేకున్నా సోషల్‌ మీడియాలో మాత్రం ఆమె ఎప్పుడూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగతం లేదా సినిమాలు, వర్కౌట్స్, ఆరోగ్య సూత్రాలు... ఇలా ఏదో ఒక విషయాన్ని షేర్‌ చేస్తూ తన అభిమానులతో టచ్‌లో ఉంటారు. ప్రస్తుతం ఆమె అబుదాబీలో ఉన్నారు. అక్కడ హ్యాపీగా... జాలీగా ఎంజాయ్‌ చేస్తున్న ఫొటోలను సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌ చేశారు సమంత. 

(చదవండి: అక్కినేని అఖిల్‌ పెళ్లి.. బరాత్‌లో జోరుమీదున్న నాగచైతన్య)

‘‘ఇక్కడ ఏమీ లేదు... సౌండ్‌ లేదు... హడావిడి లేదు... చక్కని స్పేస్‌ ఉంది’’ అంటూ వెకేషన్‌లో భాగంగా అబు దాబీలో సంతోషంగా ఉన్న అక్కడి ఫొటోలను ఆమె షేర్‌ చేయగా, వైరల్‌గా మారాయి. దుబాయ్‌లో జరిగిన ఓ జ్యువెలరీ బ్రాండ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న సమంత అనంతరం అక్కడి అందాలను చూస్తూ సందడి చేస్తున్నారు. 

ఇక సమంత కెరీర్‌ విషయానికొస్తే... విజయ్‌ దేవరకొండ హీరోగా నటించిన ‘ఖుషి’ (2023) సినిమా తర్వాత మరో తెలుగు చిత్రంలో నటించలేదు సమంత. అయితే తన సొంత బ్యానర్‌ ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌పై ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’ మే 9న విడుదలైంది. ఈ చిత్రంలో అతిథి పాత్రలో మెరిశారు. ప్రస్తుతం ‘రక్త్‌ బ్రహ్మాండ్‌: ది బ్లడీ కింగ్‌డమ్‌’ అనే వెబ్‌ సిరీస్‌తో పాటు ‘మా ఇంటి బంగారం’ అనే సినిమా చేస్తున్నారు సమంత.   

Advertisement
 
Advertisement
Advertisement