అక్కినేని అఖిల్‌ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ | Tollywood Actor Akhil Akkineni Married To Zainab Ravdjee, Wedding Videos Trending On Social Media | Sakshi
Sakshi News home page

Akhil Akkineni Marriage: అక్కినేని అఖిల్‌ పెళ్లి.. బరాత్‌లో జోరుమీదున్న నాగచైతన్య

Jun 6 2025 8:39 AM | Updated on Jun 6 2025 12:12 PM

Tollywood Actor Akhil Akkineni Married to Zainab Ravdjee

సాక్షి, హైదరాబాద్‌: హీరో నాగార్జున (Nagarjuna Akkineni) చిన్న కుమారుడు అక్కినేని అఖిల్‌ (Akkineni Akhil) బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌బై చెప్తూ వైవాహిక జీవితానికి వెల్‌కమ్‌ చెప్పాడు.  ప్రియురాలు జైనబ్‌ను వేదమంత్రాల సాక్షిగా పెళ్లాడాడు. జూబ్లీహిల్స్‌లో నాగార్జున నివాసంలో శుక్రవారం (జూన్‌ 6న) ఉదయం మూడు గంటలకు ఈ వివాహం జరిగింది. ఇరుకుటుంబ సభ్యులు సహా అతి దగ్గరివాళ్లే ఈ వెడ్డింగ్‌కు హాజరయ్యారు. 

సెలబ్రిటీల హాజరు
మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi Konidela)- సురేఖ, రామ్‌చరణ్‌- ఉపాసన దంపతులు, దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, హీరో సుమంత్‌ సహా తదితరులు పెళ్లికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. పెళ్లి అనంతరం జరిగిన బరాత్‌లో హీరో నాగచైతన్య హుషారుగా పాల్గొన్నాడు. జూన్‌ 8న అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా రిసెప్షన్‌ జరగనుంది. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు.

అఖిల్‌ ఎంగేజ్‌మెంట్‌
అఖిల్‌- జైనబ్‌ల నిశ్చితార్థం గతేడాది నవంబర్‌లో జరిగింది. సరిగ్గా అదే సమయంలో నాగచైతన్య (Naga Chaitanya)- శోభితల పెళ్లి పనులు మొదలుకావడంతో అఖిల్‌ పెళ్లిని వాయిదా వేశారు. చై-శోభిత గతేడాది డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్నారు. ఇక హైదరాబాద్‌లో పుట్టిన జైనబ్‌ రవ్జీ ఒక ఆర్టిస్ట్‌. రిఫ్లెక్షన్‌ పేరుతో హైదరాబాద్‌లో ఓ పెయింట్‌ ఎగ్జిబిషన్‌ నిర్వహించగా అందులో ఈమె వేసిన పెయింటింగ్స్‌ను ప్రదర్శించారట!  మీనాక్షి: ఎ టేల్‌ ఆఫ్‌ త్రీ సిటీస్‌ సినిమాలోనూ ఓ చిన్న పాత్రలో నటించిందట! ఈమె తండ్రి జుల్ఫీ రవ్జీ నిర్మాణ రంగంలోనే పెద్ద బిజినెస్‌ టైకూన్‌ అని తెలుస్తోంది. 

అక్కినేని ఇంట పెళ్లి సందడి

గతంలో పెళ్లి క్యాన్సిల్‌
మరి అఖిల్‌- జైనబ్‌లు పెయింటింగ్‌ ఎగ్జిబిషన్‌లోనే ఒకరికొకరు పరిచయమయ్యారా? అసలు వీరి ప్రేమకథ ఎలా మొదలైందన్నది ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది. ఇదిలా ఉంటే అఖిల్‌ గతంలో.. పారిశ్రామికవేత్త జీవీకే రెడ్డి మనవరాలు శ్రేయ భూపాల్‌తో ప్రేమలో పడ్డాడు. 2016లో వీరి ఎంగేజ్‌మెంట్‌ కూడా జరిగింది. పెళ్లితో ఒక్కటి కాబోతారనుకునేలోపే వివాహం రద్దు చేసుకుని అందరికీ షాకిచ్చారు. ప్రస్తుతం అఖిల్‌ 'లెనిన్‌' అనే సినిమా చేస్తున్నాడు.

👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: విడాకులు కోర్టులో ఉండగా హీరో పెళ్లి? అసలు విషయమిదే!

Advertisement
 
Advertisement
Advertisement