
ఆసియా కప్-2025 టోర్నమెంట్ కీలక దశకు చేరుకుంది. మొత్తంగా ఎనిమిది జట్లు పాల్గొంటున్న ఈ ఖండాంతర టోర్నీలో రెండు గ్రూపులు ఉన్న విషయం తెలిసిందే. లీగ్ స్టేజ్‌లో గ్రూప్-ఎ నుంచి భారత్, పాకిస్తాన్, యూఏఈ, ఒమన్.. గ్రూప్-బి నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ పోటీ పడ్డాయి.
అయితే, వీటిలో భారత్, పాకిస్తాన్.. శ్రీలంక, బంగ్లాదేశ్ సూపర్-4 (Asia Cup Super 4)లో అడుగుపెట్టగా.. యూఏఈ, ఒమన్, అఫ్గనిస్తాన్, హాంకాంగ్ ఎలిమినేట్ అయ్యాయి. కాగా లీగ్ దశలో ఒకే ఒక్క మ్యాచ్ మిగిలి ఉంది.
నామమాత్రపు మ్యాచ్
ఆఖరిగా భారత్- ఒమన్ మధ్య శుక్రవారం మ్యాచ్ జరుగుతుంది. అయితే, టీమిండియా ఇప్పటికే యూఏఈ, పాకిస్తాన్ జట్లను ఓడించి సూపర్-4కు చేరగా.. పాక్ ఒమన్, యూఏఈలపై గెలిచి అర్హత సాధించింది.
దీంతో టీమిండియా- ఒమన్ మధ్య మ్యాచ్ నామమాత్రపు మ్యాచ్‌గానే మిగిలిపోనుంది. మరోవైపు.. నాలుగు పాయింట్లతో పాటు నెట్ రన్ రేటు (+4.793) పరంగానూ టీమిండియా ప్రస్తుతం మెరుగైన స్థితిలో ఉన్నందున.. ఒమన్ మ్యాచ్ తర్వాత కూడా గ్రూప్-ఎ టాపర్‌గా ఉండటం లాంఛనమే.
గ్రూప్-బి నుంచి ఆ రెండు జట్లు
ఇక గ్రూప్-బి విషయానికొస్తే... అబుదాబి వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్ ద్వారా ఫలితం తేలింది. అఫ్గనిస్తాన్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించిన లంక.. రషీద్ ఖాన్ బృందాన్ని నాకౌట్ చేసింది. ఫలితంగా లంకతో పాటు బంగ్లాదేశ్ సూపర్-4కు క్వాలిఫై అయింది.
గ్రూప్-బి లీగ్ మ్యాచ్‌లన్నీ ముగిసిపోవడంతో టాపర్‌గా శ్రీలంక నిలవగా.. బంగ్లాదేశ్ రెండో స్థానం ఆక్రమించింది. ఈ నేపథ్యంలో ఆసియా కప్-2025 సూపర్-4 దశ షెడ్యూల్, వేదికలు, మ్యాచ్ టైమింగ్ వివరాలు తెలుసుకుందాం!
సూపర్-4 షెడ్యూల్
👉మ్యాచ్ 1: సెప్టెంబరు 20- శనివారం- శ్రీలంక వర్సెస్ బంగ్లాదేశ్- దుబాయ్
👉మ్యాచ్ 2: సెప్టెంబరు 21- ఆదివారం- భారత్ వర్సెస్ పాకిస్తాన్- దుబాయ్
👉మ్యాచ్ 3: సెప్టెంబరు 23- మంగళవారం- పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక- అబుదాబి
👉మ్యాచ్ 4: సెప్టెంబరు 24- బుధవారం- భారత్ వర్సెస్ బంగ్లాదేశ్- దుబాయ్
👉మ్యాచ్ 5: సెప్టెంబరు 25- గురువారం- పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్- దుబాయ్
👉మ్యాచ్ 6: సెప్టెంబరు 26- శుక్రవారం- భారత్ వర్సెస్ శ్రీలంక- దుబాయ్
ఫైనల్
👉సెప్టెంబరు 28- దుబాయ్
టైమింగ్స్
👉ఫైనల్ సహా సూపర్-4 మ్యాచ్‌లన్నీ కూడా భారత కాలమానం ప్రకారం రాత్రి ఎనిమిది గంటలకు ఆరంభం
లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే
👉టీవీ: సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్
👉డిజిటల్: సోనీ లివ్ వెబ్‌సైట్, మొబైల్ యాప్
జట్లు ఇవే
టీమిండియా
సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.
రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.
పాకిస్తాన్
సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్-కీపర్), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీమ్ జూనియర్, సాహిబ్‌జాదా ఫర్హాన్, సయీమ్ అయూబ్, సల్మాన్ మీర్జా, షాహిన్ అఫ్రిది, సూఫియాన్ మొకిమ్
శ్రీలంక
చరిత్ అసలంక (కెప్టెన్), కుశాల్ మెండిస్ (వికెట్‌కీపర్), పాతుమ్ నిస్సాంక, కుశాల్ పెరీరా, కమిల్ మిషార, దసున్ షనక, కమిందు మెండిస్, వనిందు హసరంగ, నువానీదు ఫెర్నాండో, దునిత్ వెల్లాలగే, చమిక కరుణరత్నే, మహీశ్ తీక్షణ, మతీశ పతిరణ, నువాన్ తుషార, దుష్మంత చమీరా, బినుర ఫెర్నాండో.
బంగ్లాదేశ్
లిట్టన్ కుమార్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఇమాన్, సైఫ్ హసన్, తౌహిద్ హ్రిదోయ్, జాకర్ అలీ అనిక్, షమీమ్ హొస్సేన్, క్వాజీ నూరుల్ హసన్ సోహన్, షాక్ మహేదీ హసన్, రిషద్ హుస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, తాంజిమ్ హసన్ సకీబ్, టస్కిన్ అహ్మద్, షరీఫుల్ ఇస్లాం, షైఫ్ ఉద్దీన్
స్టాండ్‌బై ప్లేయర్లు: సౌమ్య సర్కార్, మెహిదీ హసన్ మిరాజ్, తన్వీర్ ఇస్లాం, హసన్ మహమూద్.
చదవండి: Asia Cup: మా జట్టులో భారత్, పాక్ వినిపించదు.. మేమంతా ఒకే కుటుంబం