టీ20 ప్రపంచకప్-2026 కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే అజిత్ అగార్కర్ నేతృత్వంలోని కమిటీ బీసీసీఐ సెలక్షన్ కమిటీ వరల్డ్‌కప్ జట్టులో ఊహించని మార్పులు చేసింది. ఏకంగా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పైనే వేటు వేశారు. ఈ మెగా టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో గిల్‌కు చోటు దక్కలేదు.
అతడి స్దానంలో అక్షర్ పటేల్‌ను తిరిగి వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. అదేవిధంగా సెలక్టర్లు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రెండేళ్లగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు పిలిపునిచ్చారు. దీంతో నిన్నటివరకు జట్టులో ఉన్న వికెట్ కీపర్ జితీష్ శర్మను పక్కన పెట్టేశారు.
తను ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరిచిన జితీష్‌పై వేటు వేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. అయితే జితేష్ శర్మను ఎంపిక చేయకపోవడంపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. జట్టు కాంబినేషన్ల కోసమే జితీష్‌ను పక్కన పెట్టినట్లు అజిత్ తెలిపాడు.
"టీ20ల్లో శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ ఇప్పుడు జట్టు కాంబినేషన్ల దృష్ట్యా అతడికి వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కలేదు. అదేవిధంగా టాప్ ఆర్డర్‌లో ఆడే వికెట్ కీపర్ మాకు కావాలి. సంజూ శాంసన్ మాకు ప్రధాన వికెట్ కీపర్, ఓపెనర్‌గా ఉన్నాడు. సంజూకు బ్యాకప్ ఓపెనర్, వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ సరైనోడు అని భావించాము.
అతడికి ఓపెనర్‌గా అనుభవం ఉంది. అందుకే జితేష్‌కు బదులుగా కిషన్‌ను జట్టులో తీసుకున్నాడు. అలాగే లోయార్డర్‌లో రింకూ సింగ్ ఫినిషర్‌గా ఉంటాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో జితీష్ స్ధానాన్ని రింకూ భర్తీ చేస్తాడు. జితీష్ అద్బుతమైన ప్లేయర్ అయినప్పటికి జట్టు కాంబినేషన్ కోసం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు" అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అగార్కర్ పేర్కొన్నాడు. కాగా సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కు రింకూ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.
అతడి స్ధానంలో జితీష్ ఫినిషర్‌గా కొనసాగాడు. ఇప్పుడు వరల్డ్‌కప్‌లో రింకూ ఫినిషర్‌గా బాధ్యతలు తీసుకోనున్నాడు. ఇక కిషన్ కూడా ప్రస్తుతం అద్భతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) కిషన్ దుమ్ములేపాడుఏ. 10 మ్యాచ్‌లలో 57.44 సగటుతో 571 పరుగులు చేశాడు. ఫైనల్లో సంచలన సెంచరీతో చెలరేగిన కిషన్.. జార్ఖండ్‌కు తొలిసారి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని అందించాడు.
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రింకూ సింగ్.


