టీ20 ప్రపంచకప్-2026కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. ఈ క్రమంలో వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై బీసీసీఐ సెలక్షన్ కమిటీ వేటు వేసింది. అతడి స్ధానంలో ఆల్‌రౌండర్ అక్షర్‌పటేల్‌ను తిరిగి వైస్ కెప్టెన్‌గా నియమించారు. అయితే ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న సూర్యకుమార్ యాదవ్‌ను మాత్రం కెప్టెన్‌గా సెలక్టర్లు కొనసాగించారు. కానీ వచ్చే ఏడాది ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్‌ను తప్పించేందుకు బీసీసీఐ సిద్దమైనట్లు తెలుస్తోంది.
పేలవ ఫామ్‌లో సూర్య..
స్కై కెప్టెన్‌గా జట్టును విజయపథంలో నడిపిస్తున్నప్పటికీ.. బ్యాటర్‌గా మాత్రం అట్టర్‌ప్లాప్ అయ్యాడు. ఒకప్పుడు టీ20 వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా కొనసాగిన ఈ ముంబై ఆటగాడు.. ఇప్పుడు రెండెంకెల స్కోర్ చేయడానికి కూడా కష్టపడుతున్నాడు. గత 14 నెలల్లో 24 టీ20 మ్యాచ్‌లు ఆడి ఒక్క హాఫ్ సెంచరీ కూడా సూర్య సాధించలేకపోయాడు. కెప్టెన్సీ భారం అతడి బ్యాటింగ్‌పై పడుతున్నట్లు బీసీసీఐ భావిస్తోంది.
దీంతో అతడి స్దానంలో మరో ఆటగాడికి కెప్టెన్సీ పగ్గాలు అప్పగించాలని బోర్డు నిర్ణయించుకున్నట్లు ఇండియా టూడే తమ కథనంలోపేర్కొంది. వాస్తవానికి సూర్యను కెప్టెన్సీ నుంచి ముందే తొలగించాలని భావించినప్పటికీ.. మరికొద్ది రోజుల్లోనే టీ20 ప్రపంచకప్ ఉండడంతో సెలక్టర్లు తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. మెగా టోర్నీ ముందు ప్రయోగాలు చేయడం ఇష్టం లేక సూర్యనే కెప్టెన్‌గా ఎంపిక చేశారు. సూర్యకు కెప్టెన్‌గా ఇదే చివరి ప్రపంచకప్ కావచ్చు.
కెప్టెన్సీ రికార్డు అదర్స్..
సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఇప్పటివరకు 35 మ్యాచ్‌లు ఆడిన భారత్.. ఏకంగా 28 విజయాలు సాధించింది. 5 మ్యాచ్ ఓడిపోగా.. మరో రెండింట ఫలితం రాలేదు. అతడి విజయశాతం 84.9%గా ఉంది. కానీ అతడి పేలవ ఫామ్‌ను టీమ్ మెనెజ్‌మెంట్‌ను ఆందోళన కలిగిస్తోంది.
కెప్టెన్సీ రేసులో అక్షర్, హార్దిక్..!
అయితే మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు అతడు ఏకంగా జట్టులోనే చోటు కోల్పోయాడు. అటువంటిది గిల్‌ను టీ20 కెప్టెన్‌గా చేస్తారంటే నమ్మశక్యం కావడం లేదు. టీ20 కెప్టెన్సీ రేసులో స్టార్ ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ ఉన్నట్లు తెలుస్తోంది.
అందుకే అక్షర్‌ను తిరిగి వైస్ కెప్టెన్‌గా నియమించారని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరికొంతమంది హార్దిక్‌కు కెప్టెన్‌గా అనుభవం ఉందని, తిరిగి అతడికి జట్టు ప్గాలు అప్పగిస్తారని అంచనా వేస్తున్నారు. భారత జట్టుకు తదుపరి టీ20 కెప్టెన్ ఎవరో తెలియాలంటే ప్రపంచకప్ ముగిసే వరకు అగాల్సిందే.
చదవండి: అతడొక అద్భుతం.. అయినా పక్కన పెట్టాల్సి వచ్చింది: అగార్కర్


