జాతీయ జట్టుకు దూరంగా ఉన్న టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ మరోసారి దేశవాళీ క్రికెట్‌లో సత్తాచాటేందుకు సిద్దమయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీ- 2025 వన్డే టోర్నీ కోసం బెంగాల్ జట్టుకు షమీ ఎంపికయ్యాడు. రంజీ ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కనబరిచిన ఫామ్‌ను.. ఈ దేశవాళీ వన్డే టోర్నీలో కూడా కొనసాగించాలని షమీ భావిస్తున్నాడు.
ఈ బెంగాల్ స్పీడ్ స్టార్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. డొమాస్టిక్ క్రికెట్‌లో అద్భుతాలు చేస్తున్నాడు. ప్రస్తుత దేశవాళీ సీజన్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 36 వికెట్లు పడగొట్టాడు. రంజీ ట్రోఫీలో నాలుగు మ్యాచ్‌లు ఆడి 20 వికెట్లు పడగొట్టిన షమీ.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 16 వికెట్లు తీసి బెంగాల్ తరఫున లీడింగ్ వికెట్ టేకర్ గా నిలిచాడు.
బెంగాల్ జట్టులో షమీతో పాటు భారత పేసర్లు ఆకాశ్ దీప్, ముఖేష్ కుమార్ సైతం చోటు దక్కించుకున్నారు. ఈ జట్టు కెప్టెన్‌గా వెటనర్ అభిమన్యు ఈశ్వరన్ వ్యవహరించనున్నాడు. బెంగాల్ ఎలైట్ గ్రూప్-బిలో ఉంది. బెంగాల్ తమ తొలి మ్యాచ్‌లో 24న రాజ్‌కోట్ వేదికగా తలపడనుంది.
షమీ విషయానికి వస్తే.. చివరగా భారత్ తరపున ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడాడు. అప్పటి నుంచి ఫిట్‌నెస్ సమస్యలు అంటూ అతడిని తీసుకోవడం లేదు. కానీ షమీ మాత్రం దేశవాళీ క్రికెట్‌లో క్రమం తప్పకుండా ఆడుతున్నాడు. ప్రస్తుతం భారత జట్టులో సీనియర్ ఫాస్ట్ బౌలర్లు లేని లోటు స్పష్టంగా కన్పిస్తోంది.
విజయ్ హజారే ట్రోఫీకి బెంగాల్ జట్టు
అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), అనుస్తుప్ మజుందార్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీపర్), సుదీప్ ఘరామి, సుమంత్ గుప్తా, సుమిత్ నాగ్ (వికెట్ కీపర్), చంద్రహాస్ డాష్, షాబాజ్ అహ్మద్, కరణ్ లాల్, మహ్మద్ షమీ, ఆకాశ్ దీప్, ముఖేష్ కుమార్, సయన్ ఘోష్, రవి కుమార్, అమీర్ ఘనీ, విశాల్ భాటి, అంకిత్ మిశ్రా.
చదవండి: అతడొక అద్భుతం.. అయినా పక్కన పెట్టాల్సి వచ్చింది: అగార్కర్


