గోల్డ్ కార్డు: బంగారంతోనే షాపింగ్‌! | O Gold launches gold backed Mastercard | Sakshi
Sakshi News home page

గోల్డ్ కార్డు: బంగారంతోనే షాపింగ్‌!

Jan 17 2026 2:29 AM | Updated on Jan 17 2026 4:31 AM

O Gold launches gold backed Mastercard

నగదుకు ప్రత్యామ్నాయంగా బంగారాన్ని వినియోగించే వినూత్న విధానంతో ‘ఓ గోల్డ్ మాస్టర్ కార్డు’ను దుబాయ్‌లో అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్డు ద్వారా వినియోగదారులు తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించకుండా, నేరుగా కొనుగోళ్లకు ఉపయోగించుకోవచ్చు.

ఓ గోల్డ్ మేనేజ్‌మెంట్ సంస్థ తమ డిజిటల్ గోల్డ్ ప్లాట్‌ఫామ్‌ను లైఫ్‌స్టైల్ సూపర్ యాప్‌గా తిరిగి ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ యాప్ ద్వారా తక్కువ పరిమాణంలోనూ బంగారం యాజమాన్యాన్ని పొందే అవకాశం కల్పిస్తున్నారు.

కొత్తగా ప్రవేశపెట్టిన ఓ గోల్డ్ మాస్టర్ కార్డుతో, వినియోగదారులు బంగారాన్ని నగదు మాదిరిగా ఉపయోగించి వివిధ వస్తువులు, సేవలను కొనుగోలు చేయవచ్చు. ఈ లావాదేవీలు సులభమైనవి, సురక్షితమైనని, అన్ని చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఉంటాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. ఈ వినూత్న వ్యవస్థను మావరిడ్ ఫైనాన్స్, మాస్టర్ కార్డ్ సహకారంతో అమలు చేశారు.

ఈ కార్డు వినియోగదారులకు అనేక ఆకర్షణీయమైన ఆఫర్లు, డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. విమానాశ్రయ లాంజ్‌‌లకు కాంప్లిమెంటరీ ప్రవేశం, హోటళ్లపై ప్రత్యేక డిస్కౌంట్లు, ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులపై ఆఫర్లు, అలాగే రెస్టారెంట్లు, ఈ-కామర్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సేవలపై రాయితీలు లభిస్తాయి.

ఓ గోల్డ్ మాస్టర్ కార్డు ద్వారా 8,000కు పైగా బ్రాండ్ల ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. యాప్ ద్వారా వోచర్లు, గిఫ్ట్ కార్డులను సులభంగా రీడీమ్ చేసుకునే సదుపాయం ఉంది. అలాగే ఈ-సిమ్ కార్డులు, రివార్డులు, లాయల్టీ ప్రోగ్రామ్‌లను సులభంగా యాక్సెస్ చేయవచ్చని  ఓ గోల్డ్ వ్యవస్థాపకుడు బందర్ అల్ ఓట్మాన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement