breaking news
shakings
-
నాటి సౌర తుఫాను... భూమిని వణికించింది!
2024 అక్టోబర్‌లో సంభవించిన భారీ సౌర తుఫాను భూమిని గట్టిగా వణికించిందని సైంటిస్టులు తాజాగా తేల్చారు. ముఖ్యంగా భూ అయస్కాంత క్షేత్రంపై అది పెను ప్రభావమే చూపిందట. భారత్ ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ఆదిత్య ఎల్1 సౌర అబ్జర్వేటరీయే ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం విశేషం!నాటి సౌర తుఫాను భూ అయస్కాంత క్షేత్రంతో పాటు దాని తాలూకు రక్షణ వ్యవస్థలను కూడా పునాదులతో సహా కంపింపజేసింది! ఆదిత్య ఎల్1 అందించిన డేటాను విశ్లేషించిన మీదట సైంటిస్టులు ఈ మేరకు నిర్ధారించారు. ఆ తుఫానర తాలూకు పెను ప్రభావాన్ని పరిశీలించేందుకు ఆదిత్య ఎల్1 అందించిన డేటాను అప్పటికే అందుబాటులో ఉన్న ఇతర అంతర్జాతీయ డేటాతో కలగలిపి నాసా లోతుగా విశ్లేషించింది. 2024 అక్టోబర్‌లో సూర్యునిపై అతి శక్తిమంతమైన ప్లాస్మా పేలుళ్లు సంభవించాయి. ఫలితంగా చెలరేగిన అపార శక్తి కణాలు అతి భారీ పరిమాణంలో భూమికేసిదూసుకొచ్చాయి. భూమిని సూర్యుని తాలూకు పరారుణ, రేడియో ధార్మిక కిరణాలు తదితరాల బారినుంచి అనునిత్యం కాపాడే అయ స్కాంతావరణాన్ని అపార శక్తితో ఢీకొ ట్టాయి. వాటి ధాటికి అది కిందమీదులై నట్టు సైంటిస్టులు చెబుతున్నారు. అంతేకాదు, ఆ ఆఘాతం దెబ్బకు అయస్కాంతావరణం స్వల్పకాలం పాటు చెప్పుకో దగ్గ స్థాయిలో కుంచించుకు పోయిందట కూడా! అంతేగాక భూ ఎగువ వాతావరణ పొరల్లో అరోరా ప్రవాహాలు విపరీత స్థాయికి పెరిగాయి. ఫలితంగా పలు కృత్రిమ ఉపగ్రహాలు కూడా ప్రభావితం కావడం, పలు దేశాల్లో కమ్యూనికేషన్ల వ్య వస్థ తాత్కాలికంగా దెబ్బతినడం, పవర్ గ్రిడ్లు, మౌలిక వ్యవస్థలు పడకేయడం, జీపీఎస్ వ్యవస్థలు మొరాయించడం తెలిసిందే. ఈ భీకర సౌర తుఫానుకు సంబంధించిన రియల్ టైమ్ నిర్మాణాత్మక విశ్లేషణను ఆదిత్య ఎల్1 అందించింది. అంతరిక్షంలో జరుగుతున్న కీలక పరిణా మాలకు సంబంధించి రియల్ టైమ్ డేటా ఆవశ్యకతను ఈ ఉదంతం మరోసారి కళ్లకు కట్టిందని సైంటిస్టులు చెబుతు న్నారు. ముఖ్యంగా 2026లో సూర్యప్ర తాపం పరాకాష్టకు చేరవచ్చన్న అంచనాల నేపథ్యంలో ఇది మరీ ముఖ్యమని వారంటున్నారు. ఈ పరిశోధన ఫలితాలను ఆస్ట్రోఫిజికల్ జర్నల్‌లో ప్రచురించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎత్తు తగ్గి కుదుపులకు లోనైన విమానం..
టాంపా: విమానం ఎత్తులో ఆకస్మిక తగ్గుదల కారణంగా ఒక్కసారిగా కుదుపులకు లోనై కనీసం 20మంది ప్రయాణికులు గాయపడ్డారు. గురువారం మెక్సికోలోని కాంకున్ నుంచి టేకాఫ్ తీసుకున్న జెట్‌బ్లూ సంస్థ ఎయిర్ బస్ విమానం న్యూజెర్సీలోని నెవార్క్ విమానాశ్రయానికి చేరుకోవాల్సి ఉంది. అయితే, అమెరికాలోకి ప్రవేశించిన తర్వాత అకస్మాత్తుగా విమానం దిగువకు వచ్చింది. కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు సీట్లలో నుంచి ఎగిరిపడ్డారు. ప్రమాదాన్ని శంకించిన పైలట్ విమానాన్ని టాంపా అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. గాయపడిన కనీసం 20 మంది ప్రయాణికులను వెంటనే ఆస్పత్రులకు తరలించారు. వీరెవరికీ ప్రాణాపాయం లేదని అధికారులు తెలిపారు. కాగా, విమానంలో మొత్తం 162 సీట్లుండగా ప్రయాణికులెందరనే విషయంలో స్పష్టత లేదు. -
వణికించిన భూకంపం
ఒంగోలు: నిద్రమత్తు వదిలించుకుంటున్న వారు కొందరైతే ఇంకా గాఢ నిద్రలో ఉన్నవారు మరికొందరు. ఇంతలో ఒక రకమైన ధ్వనితో వారంతా కంపించిపోయారు. బుధవారం ఉదయం 5 క్షణాలపాటు వచ్చిన ఈ వింత శబ్దం ఏమిటో అర్థం చేసుకునేలోగానే అటకల మీద ఉన్న వస్తువులు కిందపడిపోయాయి. ఏం జరిగిందో తెలుసుకునేలోపే మరికొద్ది నిమిషాల తరువాత మారోమారు ప్రకంపనలు రావడంతో భూకంపం వచ్చిందని గుర్తించి ఇళ్లల్లో నుంచి జనం వీధుల్లోకి పరిగెత్తారు. ఉదయం 6.09 గంటలకు ఒక తరంగంలాగా భూమిలో నుంచి వింతైన శబ్దం వినిపించింది. మరో 8 నిముషాలకు అంటే 6.17 గంటలకు మరోమారు ఇదే పరిస్థితి. దీంతో ఏదో జరగబోతుందంటూ అందరూ ఉలిక్కిపడ్డారు. భూకంప కేంద్రం జిల్లాలోని ద్రోణాదుల అని తెలియడంతో ఆందోళన హెచ్చింది. 60 నుంచి 70 కి.మీ మేర ప్రకంపనలు: భూకంప తీవ్రత రిక్టర్‌స్కేలుపై 4 పాయింట్లుగా నమోదైంది. అయితే దీని నుంచి ప్రారంభమైన ప్రకంపనలు మాత్రం సుమారు 60 నుంచి 70 కిలోమీటర్ల దూరం వరకు భూమిలో వ్యాపించాయి. ప్రకాశం జిల్లాలోనే కాకుండా గుంటూరు జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో దీని ప్రభావం కనిపించింది. దీని ప్రభావంతో మార్టూరు, కొరిశపాడు, పర్చూరు, చీరాల, అద్దంకి, బల్లికురవ, సంతమాగులూరు, చీమకుర్తితోపాటు ఒంగోలు, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, దర్శి, చినగంజాం, ఇంకొల్లు, కొండపి మండలాల్లో కూడా భూ ప్రకంపనలు ఏర్పడ్డాయి. భూకంపం వచ్చిందంటూ జనం వీధుల్లోకి పరిగెత్తారు. చిన్న పిల్లలను సైతం పొదివి పట్టుకొని ప్రాణభయంతో పరుగులు పెట్టారు. జనం ఈ సంఘటన నుంచి తేరుకోవడానికి దాదాపు అర్ధగంటపైనే పట్టింది. ప్రకాశం జిల్లా సరిహద్దు ప్రాంతాలైన గుంటూరు జిల్లాలోని మద్దిరాల, రాజాపేట, యడవల్లి, మురికిపూడి, శావల్యాపురం తదితర ప్రాంతాల్లో కూడా ఈ ప్రకంపనలు కనిపించడం గమనార్హం. దీనిపై జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హరిజవహర్‌లాల్ స్పందించారు. ప్రకంపనలు తమ ఇంటివద్ద కూడా కనిపించాయన్నారు. భూప్రకంపనలకు సంబంధించి జియాలిజిస్టులతో మాట్లాడి కారణాలను తెలుసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల జిల్లాలో భూగర్భ ఖనిజ సంపదను వెలికితీసేందుకు విస్తృతమైన తవ్వకాలు చేపడుతున్నందునే ఇటువంటి భూప్రకంపనలు తరుచుగా కనిపిస్తున్నాయని జనం భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రకంపనల తీవ్రత తక్కువగానే ఉన్నా భవిష్యత్తులో పెద్దగా వస్తాయేమో అనే భయం మాత్రం ప్రజలను వెంటాడుతోంది. అయితే కొంతమంది మాత్రం దీనిని కొట్టిపారేస్తున్నారు. అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో తరుచుగా భూమిలోపలి పొరల్లో మార్పులు జరుగుతుండడం సహజమని, ఆ నేపథ్యంలో వచ్చిన స్వల్ప ప్రకంపనలే అని పేర్కొంటున్నా కచ్చితమైన సమాచారం ఏమిటనేది తెలియరావడంలేదు.


