ఇరాన్‌లో పరిస్థితులు చేయిదాటిపోయాయి. అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేస్తున్న వారిపై ప్రభుత్వం ఊచకోతలకు పాల్పడుతోంది. తాజాగా అక్కడి ఓ ప్రభుత్వ ఆసుపత్రి ముందు కనబడిన దృశ్యాలు హృదయ విధారకంగా కనిపిస్తున్నాయి. ఆ దేశ రాజధాని టెహ్రాన్‌లోని ఓ ఆసుపత్రి ముందు వందల సంఖ్యలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండగా వారిలో.. తమ వారు ఉన్నారా అని భయంభయంగా అక్కడి ప్రజలు వెతుకుతున్నారు. ఈ దృశ్యాలు ప్రపంచాన్ని కలతచెందేలా చేస్తున్నాయి.
ఇరాన్‌లో ద్రవ్యోల్బణం, అవినీతి తదితర కారణాలతో అక్కడి ప్రజలు ఖమేనీ ప్రభుత్వంపై పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఇస్లామిక్ పాలన అంతంకావాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. మహిళలు సైతం రోడ్లెక్లి హిజాబ్‌లను తొలిగించి చేతిలో సిగరెట్లు పట్టుకొని ఇస్లామిక్ చట్టాలకు వ్యతిరేకంగా నిరనసలు జరుపుతున్నారు. అయితే ఆందోళన కారులపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని అమెరికా రంగంలోకి దిగుతుందని ట్రంప్ హెచ్చరించారు. అయినప్పటికీ ఖమేనీ ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. నిరసన కారులను ఊచకోతకోస్తుంది.
రెండు వేల మంది మృతి
ఇప్పటివరకూ నిరసనలో పాల్గొన్న వారిలో 2 వేల మంది మృతి చెందిన విషయాన్ని ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఇరాన్ అధికారి ఒకరు మరణాల సంఖ్యను వెల్లడించారు. ఇరాన్ పౌరులు చేపట్టిన ఈనిరసనలను ఆ దేశం ఉగ్రవాద చర్యగా అభివర్ణించింది. ఆందోళనలు ఇలానే కొనసాగితే మరణాల సంఖ్య కూడా ఇలానే ఉంటుందని హెచ్చరించింది. తమ దేశానికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం ఎక్కువైతే తీవ్ర పరిణామాలుంటాయని తెలిపింది. ఈ నిరసనల్లో పాల్గొన్న ఉగ్రవాద శక్తులు ప్రభుత్వ భవనాలు, పోలీస్ స్టేషన్లు, వ్యాపారాలు, పౌరులు, భద్రతా దళాలపై కాల్పులు జరిపాయని సదరు అధికారి పేర్కొన్నారు. ఆ దేశానికి చెందిన ఓమంత్రి ఈ నిరసనలను ఖండిస్తున్నారు.
అయితే ఇరాన్ రెడ్‌లైన్ దాటిందని అక్కడి పరిస్థితులను అమెరికా నిశితంగా గమనిస్తుందని తమ నిర్ణయం త్వరలోనే ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందా? అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Dozens of black body bags seen in Iran. pic.twitter.com/6PB0y6sNxP
— Open Source Intel (@Osint613) January 13, 2026


