
సాక్షి, అమరావతి: అంగన్‌వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆగస్ట్ 21న రాష్ట్రంలోని ఐసీడీఎస్ ప్రాజెక్టులు, మండల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని మూడు యూనియన్లు పిలుపునిచ్చాయి.
ఈ మేరకు ఏపీ అంగన్‌వాడీ వర్క్‌ర్స్, హెల్పర్స్ యూనియన్(సీఐటీయూ), ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ అసోసియేషన్(ఏఐటీయూసీ), ఏపీ ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్(ఐఎఫ్‌టీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సుబ్బరావమ్మ, లలితమ్మ, వీఆర్ జ్యోతి సోమవారం సంయుక్త ప్రకటన విడుదల చేశారు. 21న దేశ వ్యాప్తంగా బ్లాక్ డే నిర్వహించాలని అఖిల భారత అంగన్‌వాడీ యూనియన్ నిర్ణయించిందని పేర్కొన్నారు. దీనిలో భాగంగానే ఏపీలో చేపట్టే నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లకు పిలుపునిచ్చారు.