2025లో రాష్ట్రంలో 115 అవినీతి కేసులు నమోదు
అవినీతి అధికారులకు శిక్షలు మాత్రం తగ్గుదల
ఏసీబీ నివేదిక విడుదల చేసిన డీజీ అతుల్ సింగ్
వాట్సాప్ గవర్నెన్స్‌లో ఫిర్యాదులకు అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి సూచన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవినీతి పెరిగిపోతోంది. ఇదే సమయంలో అవినీతి అధికారులకు శిక్షలు మాత్రం తగ్గుతున్నాయి. 2025లో రాష్ట్రంలో అవినీతి కేసులపై ఏసీబీ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. అవినీతిలో రెవెన్యూ శాఖదే మొదటి స్థానమని తేలి్చంది. ఏసీబీ డీజీ అతుల్‌సింగ్ శుక్రవారం విడుదల చేసిన ఆ నివేదిక రాష్ట్రంలో అవినీతి పెరుగుతోందని వెల్లడించింది. 2025లో ఏసీబీ అధికారులు రాష్ట్రంలో మొత్తం 115 అవినీతి కేసులను నమోదు చేశారు. వాటిలో లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న (ట్రాప్) కేసులు 69 ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు 8 నమోదు కాగా, వీటిలో కారి్మక శాఖకు చెందినవి రెండు.. విద్యుత్తు, వైద్య–ఆరోగ్య, పురపాలక – పట్టణాభివృద్ధి, పంచాయతీరాజ్– గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, గిరిజన సంక్షేమ శాఖల్లో ఒక్కో కేసు నమోదైంది.
నేరపూరితమైన ప్రవర్తన కేసులు 7, సాధారణ విచారణ కేసులు 19, ఆకస్మిక తనిఖీల కేసులు 12 ఉన్నాయి. ట్రాప్ కేసుల్లో రెవెన్యూ శాఖ మొదటి స్థానంలో ఉంది. మొత్తం 69 కేసుల్లో అత్యధికంగా 19 కేసులు ఆ శాఖ అధికారులపై నమోదు చేసినవే. ఓ వైపు అవినీతి పెరుగుతూ ఉంటే మరోవైపు అవినీతికి పాల్పడిన అధికారులపై మాత్రం శిక్షలు తగ్గుతుండటం విస్మయ పరుస్తోంది. ఏసీబీ కేసుల్లో శిక్షల శాతం తగ్గడమే అందుకు నిదర్శనం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి సంవత్సరం 2023లో 48 శాతం కేసుల్లో అవినీతి అధికారులకు న్యాయస్థానాల ద్వారా శిక్షలు విధించారు. 2025లో టీడీపీ ప్రభుత్వ హయాంలో మాత్రం శిక్షల శాతం 46 శాతానికి తగ్గింది. న్యాయస్థానాల్లో విచారణ ముగిసిన 36 కేసుల్లో కేవలం 12 కేసుల్లోనే దోషులకు శిక్షలు పడ్డాయి.
అవినీతి తగ్గించేందుకు కృషి: అతుల్ సింగ్, డీజీ, ఏసీబీ
‘రాష్ట్రంలో అవినీతి పెరుగుతోంది. దాన్ని ఒక్క ఏసీబీనే కట్టడి చేయలేదు. ప్రజల సహకారం చాలా అవసరం’ అని ఏసీబీ డీజీ అతుల్ సింగ్ పేర్కొన్నారు. అవినీతికి పాల్పడిన అధికారులపై 46 శాతం శిక్షల రేటుతో తాను సంతృప్తికరంగా లేనని చెప్పారు. శిక్షల రేటు 75 శాతం ఉండాలన్నారు. మధ్య స్థాయి, ఉన్నత స్థాయి అధికారులు బినామీల పేరుతో ఆస్తులను కూడగడుతుండటాన్ని గుర్తించడం ఏసీబీకి సవాల్‌గా మారిందన్నారు. అందుకోసం ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టూల్‌ను త్వరలో ప్రవేశ పెట్టబోతున్నామని తెలిపారు. అవినీతి అధికారులపై ఫిర్యాదు చేసేందుకు వాట్సాప్ గవర్నెన్స్ విధానంలో అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి సూచించామని చెప్పారు.


