
సాక్షి, విజయవాడ: ఆటో కార్మికులు దశలవారీ ఆందోళనకు సిద్ధమవుతున్నారు. సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో కార్యాచరణ ప్రకటించారు. సెప్టెంబర్ 8న అన్ని జిల్లాల కలెక్టరేట్లలో వినతి పత్రాలు అందించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు వినతి పత్రాలు అందజేయడంతో పాటు.. ప్రచార జాతాలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 18న ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు.
సెప్టెంబర్ 18న అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున భారీ నిరసన చేపట్టనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి ఆటో, క్యాబ్, టాటా మ్యాజిక్ డ్రైవర్లు తరలిరానున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని సీఐటీయూ, ఐఎఫ్‌టీయూ డిమాండ్ చేసింది. స్త్రీశక్తి పథకంతో నష్టపోతున్న ఆటో కార్మికులకు వాహన మిత్ర కింద రూ.30 వేలు ఇవ్వాలని.. లేనిపక్షంలో బంద్ చేపడతామని హెచ్చరించారు.