అ‍ర్జెంటీనాలో దారుణం.. లైవ్‌ స్ట్రీమ్‌లో యువతుల హత్య | Protest Over Argentina Women Incident Live On Instagram | Sakshi
Sakshi News home page

అ‍ర్జెంటీనాలో దారుణం.. లైవ్‌ స్ట్రీమ్‌లో యువతుల హత్య

Sep 28 2025 9:01 AM | Updated on Sep 28 2025 9:01 AM

Protest Over Argentina Women Incident Live On Instagram

బ్యూనస్‌ ఎయిర్స్‌: అర్జెంటీనాలో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. సోషల్‌ మీడియా లైవ్‌లో ముగ్గురు యువతులను దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ నేపథ్యంలో బాధితులకు న్యాయం చేయాలని, ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ భారీ సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలిపారు.

వివరాల ప్రకారం.. అర్జెంటీనాకు చెందిన లారా, బ్రెండా, మెరానా అనే ముగ్గురు యువతులను డ్రగ్స్‌ ముఠా అత్యంత దారుణంగా హత్య చేశారు. సెప్టెంబర్‌ 19వ తేదీన ముగ్గురు యువతులు ఒక పార్టీకి హాజరయ్యేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఐదుగురు సభ్యుల డ్రగ్స్‌ ముఠా వారిని కిడ్నాప్‌ చేసింది. అనంతరం, వారిని వేధింపులకు గురిచేస్తూ నిందితులు సోషల్‌ మీడియా ఇన్స్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో హత్య చేశారు. ఈ సందర్భంగా నిందితులు.. తమ వద్ద నుంచి డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నా.. దొంగలించినా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి అనే వ్యాఖ్యలు వినిపించినట్టు స్థానిక మీడియా తెలిపింది.

ఇక, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలించారు. ఐదుగురు నిందితుల్లో ఒకరిని బొలీవియన్ సరిహద్దు నగరం విల్లాజోన్‌లో పోలీసులు అరెస్టు చేశారు. అతడిని విచారిస్తున్నట్టు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు పెరువియన్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో అతడి ఫొటోను విడుదల చేశారు.

మరోవైపు.. యువతుల హత్యపై అర్జెంటీనా రాజధాని బ్యూనస్‌ ఎయిర్స్‌ నగరంలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. బాధితులకు న్యాయం చేయాలని.. నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజల రోడ్లకు మీదకు వచ్చారు. బాధితుల కుటుంబ సభ్యులు ఆవేదనతో నిందితులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ప్లకార్డులు పట్టుకుని పార్లమెంట్‌ వరకు ర్యాలీ తీశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement