లండన్‌: నిరసనకారులకు దీదీ ఝలక్‌ | Mamata Banerjee Speech Interrupted By Students At Oxford Event Video, Mamata Reaction Goes Viral | Sakshi
Sakshi News home page

వీడియో: లండన్‌లో మమతా బెనర్జీకి నిరసన సెగ.. దీదీ కౌంటర్‌తో చప్పట్లు

Published Fri, Mar 28 2025 8:23 AM | Last Updated on Fri, Mar 28 2025 9:40 AM

Mamata Banerjee Speech Interrupted By Students At Oxford Event Video

లండన్‌: విదేశీ పర్యటనలో ఉన్న పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee)కి నిరసన సెగ తాకింది. ఓ కాలేజ్‌ ఈవెంట్‌లో మమత ప్రసంగిస్తు‍న్న టైంలో టీఎంసీ వ్యతిరేక నినాదాలతో అడ్డుపడ్డారు. అయితే వాళ్లకు అంతే ధీటుగా ఆమె సమాధానం ఇవ్వడంతో అక్కడి హాల్‌ అంతా చప్పట్లతో మారుమోగిపోయింది.

గురువారం ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ(Oxford University)లోని కెల్లాగ్‌ కళాశాలలో బెంగాల్‌ పారిశ్రామికీరణ అంశంపై ఆమె ప్రసంగించారు. ఆ టైంలో కొందరు ఫ్లకార్డులతో నినాదాలు చేస్తూ ఆమె ప్రసంగానికి అడ్డు పడ్డారు. ఆ ఫ్లకార్డుల మీద బెంగాల్‌ ఎన్నికల హింస, ఆర్జీకర్‌ ఘటన(RG Kar Incident), జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ ఘటనలకు సంబంధించిన రాతలు ఉన్నాయి. మమత మాట్లాతున్న టైంలో.. టీఎంసీ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు వాళ్లు. అయితే.. 
 

వాళ్లకు ఆమె ధీటుగానే బదులిచ్చారు. ‘‘మీరేం చెప్పదల్చుకున్నారో గట్టిగా చెప్పండి. నాకేం వినిపించడం లేదు. మీరే చెప్పే ప్రతీది వినేందుకు నేను సిద్ధం. ఈ కేసు(ఆర్జీకర్‌ ఘటన) పెండింగ్‌లో ఉందని మీకు తెలుసా?. ప్రస్తుతం ఆ అంశం మా చేతుల్లో లేకుండా పోయింది. కేంద్రమే ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఇది రాజకీయాలకు వేదిక కాదు. మీ రాజకీయాలు ఇక్కడ కాదు. దమ్ముంటే మా రాష్ట్రానికి వచ్చి నాతో రాజకీయం చేయండి’’ అని సవాల్‌ విసిరారామె. దీంతో అక్కడ ఉన్నవాళ్లంతా కంగుతిన్నారు. 

నిరసకారుల్లో ఓ విద్యార్థిని ఉద్దేశించి.. ‘‘చూడు తమ్ముడూ.. అబద్ధాలు చెప్పకు. నీ మీద నాకు సానుభూతి ఉంది. కాకుంటే ఇక్కడ రాజకీయాలు చేసే బదులు బెంగాల్‌కు వెళ్లి మీ పార్టీని బలోపేతం చేసుకోండి. అప్పుడే వాళ్లు మాతో తలపడగలరు’’ అని అన్నారామె. ఆ మాటలతో వాళ్లు మరింత రెచ్చిపోయారు.  దీంతో ఆమె మరోసారి స్పందిచాల్సి వచ్చింది. ‘‘నన్ను అవమానించడం ద్వారా మీ విద్యా సంస్థను మీరే అగౌరవపర్చుకుంటున్నారు. నేను ఇక్కడికి వచ్చింది దేశం తరఫున ప్రతినిధిగా. దయచేసి మీ దేశాన్ని మీరే అవమానించకండి.’’ అన్నారు. 

మమత మాటలతో ప్రాంగణమంతా చప్పట్లతో మారుమోగింది. ఆ టైంలో సభలో ఉన్నవాళ్లను ఉద్దేశిస్తూ.. ఇప్పుడు మీరు ఇస్తున్న ప్రొత్సాహాం నన్ను మళ్లీ మళ్లీ ఇక్కడికి వచ్చేలా చేసింది. దీదీ.. ఎవరినీ పట్టించుకోదు. దీదీ ఓ రాయల్‌ బెంగాల్‌ టైగర్‌. ఒకవేళ పట్టుకోవాలనుకుంటే.. పట్టుకోండి అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. ఆపై నిర్వాహకులు, అక్కడున్న ఆడియొన్స్‌ సూచన మేరకు నిరసనకారులు బయటకు వెళ్లిపోగా.. దీదీ ప్రసంగం కొనసాగింది.  ఆ టైంలో వేదికపై క్రికెట్‌ దిగ్గజం సౌరబ్‌ గంగూలీ కూడా ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement