ఖమేనీ కోసం.. అంతరిక్షం నుంచి మిస్సైల్‌? | Iran Supreme Leader Khamenei Killed In Israel’s Advanced Bluesparrow Missile Strike, Check More Details Inside | Sakshi
Sakshi News home page

ఖమేనీ కోసం.. అంతరిక్షం నుంచి మిస్సైల్‌?

Mar 6 2026 9:18 PM | Updated on Mar 7 2026 1:24 PM

Israel used Blue Sparrow missile to attack Khamenei

ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఆలీ ఖమేనీ ఇజ్రాయెల్ జరిపిన దాడులలో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఖమేనీ మరణంతో ఇరాన్ శోకసంద్రంలో మునిగింది. అయితే ఇరాన్ మాజీ సుప్రీం లీడర్‌పై అటాక్ కోసం ఇజ్రాయెల్ అత్యాధునిక బ్లూస్పారో క్షిపణిని ప్రయోగించినట్లు పత్రికా కథనాలు తెలుపుతున్నాయి. అంతేకాదు ఖమేనీని అంతంచేయడం కోసం ఈ క్షిపణి అంతరిక్షం నుంచి దూసుకొచ్చి లక్షాన్ని భేదించింది.

ఇరాన్ సుప్రీం లీడర్ హత్యతో పశ్చిమాసియా భగ్గుమంది. ఒక దేశాధినేతను అతని దేశంలోనే అటాక్ చేసి చంపడం ప్రపంచాన్ని నోరెళ్లబెట్టాలా చేసింది. అయితే ఈ దాడికి సంబంధించిన ప్లాన్ గతేడాది నవంబర్‌లోనే జరిగిందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి తెలిపారు. ఆయనపై ఈ 2026 మధ్యలో దాడి చేయాలని ప్లాన్ చేసినప్పటికీ  ఇరాన్‌లోని నిరసనల కారణంగా ప్లాన్‌ ముందుకు జరిగిందని తెలిపారు. అయితే ఖమేనీపై అటాక్‌ చేయడానికి ఇజ్రాయెల్ వాడిని క్షిపణి అత్యంత శక్తివంతమైనదిగా తెలుస్తోంది.

బ్లూస్పారో ప్రత్యేకత

బ్లూస్పారోగా పిలిచే ఈ బాలిస్టిక్ క్షిపణి రేంజ్ దాదాపు 2 వేల కిలోమీటర్లు. దీని పొడవు 6.5 మీటర్లు కాగా బరువు 1.9 టన్నులు శత్రు రాడార్లకు చిక్కకుండా ఖచ్చితంగా లక్షాన్ని భేదించడం ఈ మిస్సైల్‌ ప్రత్యేకత. అయితే వేగవంతంగా లక్షాన్ని చేధించడానికి ఇవి తొలుత అంతరిక్షానికి ఎగిరి అక్కడి నుంచి టార్గెట్‌ను ధ్వంసం చేస్తాయి. బ్లూస్పారో రాకను గమనించేలోగే విధ్వంసం చేసేయడం ఈ మిస్సైల్ ప్రత్యేకత  స్పందించే లోపే విధ్వంసం జరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

అయితే దీనిని ఇజ్రాయెల్ ‘అంతరిక్షం నుంచి విరుచుకుపడే బాలిస్టిక్ క్షిపణి’గా అభివర్ణిస్తుంది. ఎందుకంటే దీనిని ప్రయోగించేటప్పుడు మెుదటగా  ఆకాశం అంచుల వరకూ ఎగురుతుంది అనంతరం తరువాత భూమిపై ఉన్న లక్ష్యాల వైపు మెరుపు వేగంతో దూసుకెళ్లి వాటిని ధ్వంసం చేస్తుంది. భీకర వేగంతో అత్యంత కచ్చితత్వంతో టార్గెట్స్‌ను ఛేదించడం ఈ మిస్సైల్‌ ప్రత్యేకత. ఇక ఇరాన్ సుప్రీం ఖమేనీని ఈ క్షిపణి వాడే ఇజ్రాయెల్ అంతం చేసింది.

 

 

Advertisement
 
Advertisement
Advertisement