ఇండియాలో ఖమేనీ మూలాలు! | Iran Supreme Leader Ayatollah Ali Khamenei has roots in India | Sakshi
Sakshi News home page

ఇండియాలో అయతుల్లా అలీ ఖమేనీ మూలాలు!

Mar 1 2026 11:50 PM | Updated on Mar 2 2026 6:03 AM

Iran Supreme Leader Ayatollah Ali Khamenei has roots in India

ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు, సంతాప సూచనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాకు వ్యతిరేకంగా అనేక దేశాల్లో నిరసనలు మిన్నంటుతున్నాయి. భారత్‌లోని కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా ఖమేనీ కుటుంబ మూలాలు ఉన్న పలు గ్రామాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఖమేనీ పూర్వీకుల మూలాలు ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకి జిల్లా, కింతూర్ గ్రామానికి చెందినవారని రికార్డులు చెబుతున్నాయి. ఆయన తాత సయ్యద్ అహ్మద్ ముసావి హిందీ 1800 ప్రాంతంలో యూపీలో జన్మించారు. 1830లో ఇరాక్‌లోని నజాఫ్‌కు మతపరమైన ప్రయాణంలో వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఇరాన్ అధికారిక రికార్డుల్లో ‘హిందీ’ అనే పదాన్ని తన పేరులో ఖమేనీ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.  

భారత్‌తో ఖమేనీ అనుబంధం  
1986లో ఖమేనీ భారత్ పర్యటనలో అలిపురాను సందర్శించారు. ఈ క్రమంలో ఖమేనీ గౌరవార్థం ఆయన పేరిట ఓ ఆస్పత్రిని నిర్మించారు. అలిపురాలోని అనేక కుటుంబాలు ఇప్పటికీ ఇరాన్‌తో ప్రత్యక్ష సంబంధాలు కొనసాగిస్తున్నాయి. కొంతమంది గ్రామస్థులు విద్య, ఉపాధి కోసం ఇరాన్‌లో స్థిరపడ్డారు.  

అలిపురాలో విషాద వాతావరణం  
కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లా అలిపురా గ్రామంలో ఖమేనీ మరణంతో సంతాప దినాలు ప్రకటించారు. గ్రామంలోని షియా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.  మూడు రోజులపాటు దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసివేశారు.  అలిపురా జనాభా దాదాపు 30,000 కాగా, వీరిలో ఎక్కువ మంది షియా ముస్లింలే.  

ఖమేనీ మరణం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుండగా, భారత్‌తో ఆయన కుటుంబానికి ఉన్న అనుబంధం ఇప్పుడు మరింతగా వెలుగులోకి వచ్చింది.  

Advertisement
 
Advertisement
Advertisement