
వాషింగ్టన్: తన ప్రాణాలకు ముప్పు ఉన్న మాట నిజమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. డ్రోన్ దాడి చేసి ట్రంప్‌ను అంతం చేస్తామంటూ ఇరాన్ అధినేత అయతొల్లా అలీ ఖమేనీ సన్నిహితుడొకరు ఇటీవల హెచ్చరికలు జారీ చేశారు.
అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న మర్–ఎ–లాగో రిసార్ట్‌లో ట్రంప్ సన్ బాత్ చేస్తున్న సమయంలో డ్రోన్ ప్రయోగిస్తామని, అదే అనువైన ప్రదేశమని చెప్పారు. దీనిపై ట్రంప్ తాజాగా స్పందించారు. ఇది తనకు వచి్చన బెదిరింపుగానే భావిస్తున్నానని తెలిపారు. తన ప్రాణాలకు ముప్పు ఉందన్న విషయంలో సందేహం లేదన్నారు. వాస్తవానికి ఏడేళ్ల వయసు నుంచి తాను సన్ బాత్ చేయడం లేదని వివరించారు. ఖమేనీ అనుచరుడి హెచ్చరికలను పరోక్షంగా ట్రంప్ తేలిగ్గా తీసుకున్నారు.