breaking news
Sunbathing
-
ఆతప స్నానం అంటే ఏంటి? ప్రయోజనాలు
కార్తీక స్నానం, మాఘస్నానం, పుష్కరస్నానం, త్రివేణీసంగమ స్నానం... ఇలా రకరకాల స్నానాల విశిష్టతను గూర్చి మన శాస్త్రాలు చెప్పాయి. కోట్లాది ప్రజలు పుణ్య తిథులలో, బ్రహ్మ ముహూర్తంలో, సూర్యోదయానికి కాస్త ముందే ఆ పుణ్యస్నానాలు చేయటానికి పుణ్యనదీ తీరాలకు చేరుకుంటారు. అయితే క్రియాయోగాన్ని ప్రపంచానికి అందించిన పరమహంస యోగానంద ‘ఆతపస్నాన’ విశిష్టతను గూర్చి చెప్పారు.ఆతపస్నానం (sunbathing) అంటే ఏమిటో, ఎలా చేయాలో, ఎంతసేపు చేయాలో వారు ఇలా వివరించారు: ‘మందులకంటె ఉత్తమ మైనవి సూర్యకిరణాలు. వాటిలో ఉంది రోగాలను నయంచేసే అద్భుత శక్తి. ప్రతి దినం పది నిమిషాలసేపు ఆతపస్నానం చేయాలి (ఒంటి మీద ఎండపడేలా చేయాలి). అప్పుడోసారి, ఇప్పుడోసారి ఎక్కువసేపు ఎండలో ఉండడం కంటె దినానికి పదేసి నిమిషాల చొప్పున ఎండలో ఉండడం మంచిది. ఆరోగ్యపరమైన అలవాట్లు, మంచి అలవాట్లు ఏర్పరచుకోవడంతో పాటు ప్రతి రోజూ కొద్ది సేపు చేసే ఆతపస్నానం, హానికరమైన సూక్ష్మ జీవులను నాశనం చేయడానికి తగినంత ప్రాణ శక్తిని శరీరానికి సరఫరా చేస్తూఉంటుంది’ (పుట 100– మానవుడి నిత్యాన్వేషణ – శ్రీ పరమహంస యోగానంద). మనకు సూర్యుడు కేవలం ఒక అగ్ని గోళం కాదు, ‘సూర్య భగవానుడు’, ‘శక్తి ప్రదాత’. కాబట్టే భక్తిని జత చేసి సూర్య నమస్కారాలు చేయమన్నారు మహర్షులు.ఈ ఆతపస్నానం ఆచరించటానికి మనం ఎక్కడికో పోవాల్సిన పనికానీ, డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం కానీ లేదు. లక్షణంగా మన ఇంటి ముందో, మిద్దెపైననో ప్రశాంతంగా, భక్తి పూర్వకంగా చేసుకోవచ్చు. ‘ఆదిదేవ! నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర! దివాకర! నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే’ అని ప్రతి రోజూ సూర్యోదయ సమయాన ప్రార్ధిద్దాం. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక లాభాలను పొందుదాం.– రాచమడుగు శ్రీనివాసులుఆతప స్నానం అంటే సూర్య స్నానం చేయడం. ఈ పదం "ఆతప" (సూర్యకాంతి) స్నానం. పురాతన భారతీయ వైద్య వ్యవస్థ అయిన ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీనివల్ల అనేక ప్రయోజనాలున్నాయని నమ్ముతారు. ముఖ్యంగా శరీరంలో విటమిన్ డీ విరివిగా లభిస్తుంది. విటమిన్ డీ ఎముకల ఆరోగ్యానికి , మొత్తం శ్రేయస్సుకు ,ఆలా అవసరం. విటమిన్ డితో పాటు, మెరుగైన మానసిక స్థితి , ఎనర్జీ మెరుగుపడుతుంది. -
నా ప్రాణాలకు ముప్పు నిజమే: ట్రంప్
వాషింగ్టన్: తన ప్రాణాలకు ముప్పు ఉన్న మాట నిజమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. డ్రోన్ దాడి చేసి ట్రంప్‌ను అంతం చేస్తామంటూ ఇరాన్ అధినేత అయతొల్లా అలీ ఖమేనీ సన్నిహితుడొకరు ఇటీవల హెచ్చరికలు జారీ చేశారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న మర్–ఎ–లాగో రిసార్ట్‌లో ట్రంప్ సన్ బాత్ చేస్తున్న సమయంలో డ్రోన్ ప్రయోగిస్తామని, అదే అనువైన ప్రదేశమని చెప్పారు. దీనిపై ట్రంప్ తాజాగా స్పందించారు. ఇది తనకు వచి్చన బెదిరింపుగానే భావిస్తున్నానని తెలిపారు. తన ప్రాణాలకు ముప్పు ఉందన్న విషయంలో సందేహం లేదన్నారు. వాస్తవానికి ఏడేళ్ల వయసు నుంచి తాను సన్ బాత్ చేయడం లేదని వివరించారు. ఖమేనీ అనుచరుడి హెచ్చరికలను పరోక్షంగా ట్రంప్ తేలిగ్గా తీసుకున్నారు. -
అసూర్యంపశ్య
అసూర్యంపశ్య. అంటే ఎండ కన్నెరగని స్త్రీ. చైనాలో ఓ 48 ఏళ్ల మహిళ ఉదంతమిది. సిచువాన్ ప్రావిన్సులో చెంగ్డూ నగరానికి చెందిన ఆమె తన ఒంటిని ఒక్క సూర్యకిరణం కూడా తాకనిచ్చేది లేదని భీషణ ప్రతిజ్ఞ చేసింది. ఆరుబయటకు వెళ్లినా ఒళ్లంతా కప్పేలా వ్రస్తాలు ధరించేది. ముఖం, చేతులు బయటకు కనిపించక తప్పని పరిస్థితుల్లో నిండుగా సన్స్క్రీమ్ లోషన్ పట్టించి మరీ వెళ్లేది. ఈమెకు ఉన్న ఈ అలవాటు ఇప్పటిది కాదు. చిన్ననాటి నుంచే ఇదే తంతు. ఎండ తగిలితే కందిపోవడమే గాక నల్లబడతానన్న భయమే ఇందుకు కారణం. అందుకే నిత్యం పొడవాటి టాప్స్ ధరించేది. చలువ కళ్లద్దాలు, సాక్స్, షూ, పొడవాటి చొక్కా.. ఇలా ఏ రకంగానూ సూర్యకాంతి సోకకుండా బహుజాగ్రత్తలు తీసుకుంది. షార్ట్స్, స్లీవ్స్ పొరపాటున కూడా వేసుకునేది కాదు! అయితే ఏమైంది? ఒంటికి ఎండ తాకక అత్యావశ్యకమైన ‘డి’విటమిన్ లోపించింది. ఎంతగా అంటే, ఇటీవల ఆమె పడక మంచంపై కాస్త అటూ ఇటూ కదలగానే ఏకంగా ఓ ఎముక విరిగిపోయింది. డి విటమిన్ లోపంతో ఎముకలు గట్టిదనం తగ్గి పెళుసుబారడమే అందుకు కారణం. ఎముక విరగడంతో నరకయాతన నడుమ ఆస్పత్రిలో చేరింది. మెత్తని బెడ్ మీద ఎముక ఎలా విరిగిందని వైద్యులే విస్తుపోయారు. పరీక్షలన్నీ చేసి, డి విటమిన్ లోపమని తేల్చడమే గాక ఆమెను మందలించారు. బోలు ఎముక వ్యాధిగా పేర్కొనే ఆస్టియోపోరోసిస్ బారినపడ్డట్టు చెప్పారు. లాంగ్ షువాంగ్ అనే సంప్రదాయ వైద్యున్ని ఉటంకిస్తూ సౌత్‌చైనా మారి్నంగ్ పోస్ట్ వార్తా సంస్థ తాజాగా ఈ వింతగాథను బయటపెట్టింది. ఇదిప్పుడు అంతటా పెద్ద చర్చనీయంగా మారడమే గాక సోషల్ మీడియాలోనూ తెగ వైరలైంది. కీలకమైన విటమిన్ విటమిన్ డి ప్రకృతిలో సహజంగా లభించదు. శరీరమే దాన్ని తయారు చేసుకుంటుంది. అందుకు సూర్యకాంతి అవసరం. ఉదయపు లేత కిరణాల వేడికి చర్మం కింది పొరలోని రసాయనాలు వేడెక్కి డి విటమిన్‌ను తయారు చేసుకుంటాయి. అది ఉంటేనే మన శరీరం అత్యధికంగా కాల్షియంను సంగ్రహించుకోగలదు. కాల్షియం సమపాళ్లలో ఉన్నప్పుడే ఎముకలకు గట్టిదనం వస్తుంది. అవి గట్టిగా ఉంటేనే అన్ని పనులు చక్కగా చేసుకోగలం. కాల్షియం లోపిస్తే ఎముకలు గుల్లబారతాయి. ఎముక ఆరోగ్యంగా, అస్థిపంజరం పటిష్టంగా ఉండాలంటే ఉదయపు ఎండ తగలాల్సిందే. చైనాలో విపరీత పోకడ చైనాలో ఇలా ఎండకు ముఖం చా టేస్తున్న మహిళల సంఖ్య బాగా పెరుగుతోంది. ఆరుబయటకు వెళ్లినా పేద్ద గొడుగు, చేతులన్నీ కప్పేసేలా దుస్తులు, పెద్ద కళ్లద్దాలు, గ్లౌజ్‌లు, ఫేస్ మాస్క్ లు, కాళ్లకు షూ, అతినీలలోహత కిరణాలను ఆపే హూడీలు... ఇవే ఇప్పుడు చైనాలో ట్రెండ్! ఇలా చేస్తే కాల్షియం సంబంధ వ్యాధులతో ఆస్పత్రిపాలవడం ఖాయ మని వైద్య నిపుణులు మొత్తుకుంటున్నారు. ఒంట్లో పదేళ్లకోసారి ఎముకలన్నీ కొత్త శక్తితో పునరుజ్జీవం పొందుతాయి. 40 ఏళ్లు దాటాక మాత్రం ఎము కల సాంద్రత తగ్గడం మొదలవుతుంది. ఆ తర్వాత అవి పెళుసుబారతాయి. చక్కటి వ్యాయామం, ఆహారశైలే దానికి విరుగుడని గ్వాంగ్జూ వైద్య విశ్వవిద్యాలయంలో ఆర్థోపెడిక్ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణుడు డాక్టర్ జియాంగ్ గ్జియోబింగ్ చెప్పుకొచ్చారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వైరల్: మాస్క్ పెట్టుకున్నాడు.. మొహం వింతగా మారిపోయిందే!
కరోనా వైరస్ రాకతో ప్రపంచంలోని అందరి జీవితాల్లో గణనీయమైన మార్పు చోటుచేసుకుంది. కరోనా వైరస్ బారిన పడకుండా మాస్క్ ధరించడమే శ్రీ రామ రక్ష..! అని పలువురు పరిశోధకులు, ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా తెలిపింది. దీంతో ప్రపంచంలోని అన్ని వర్గాల ప్రజలు తారతమ్యం లేకుండా మాస్క్‌ను ఎల్లప్పుడు ధరిస్తూనే ఉన్నారు. కాగా మానవుల జీవితాల్లో మాస్క్ అనేది ఒక భాగమైంది. మాస్క్‌తో కొంతమందికి చికాకు కల్గిస్తున్నా.. కచ్చితంగా ధరిస్తేనే మనుగడ ఉంటుందని తెలుసుకొని ధరిస్తున్నారు. మాస్క్ ధరించడంతో కొంతమందికి వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. మాస్క్ ఉందని గ్రహించకుండా మనలో కొంతమంది టీ, కాఫీ తీసుకుంటాం. అబ్బా..ఈ మాస్క్ ఒకటి ఉంది కదా అని చెప్పి తెరుకుంటాం. కాగా మాస్క్ ధరించడంతో ఓ వ్యక్తికి వింత సంఘటన ఎదురైంది. తన ఇంట్లో ఉన్న తోటలో మాస్క్ పెట్టుకొని సన్‌బాత్‌కు వెళ్లగా.. తిరిగి ఇంట్లోకి వచ్చి మాస్క్ తీసి అద్దంలో తన మోహాన్ని చూసుకొని నిర్ఘాంతపోయాడు. అతని మోహం మీద మాస్క్ ముద్ర అలాగే వచ్చింది. ఈ వీడియోను అతడు సోషల్‌మీడియాలో పోస్ట్ చేయగా.. వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అంతేకాకుండా సన్‌బాత్ చేసేటప్పుడు కచ్చితంగా మాస్క్ తీయకపోతే నాకు జరిగిందే మీకు జరుగుతుందనీ హెచ్చరించాడు. కాగా ఈ వీడియోను ప్రముఖ బాస్కెట్ బాల్ ప్లేయర్ రెక్స్ చాంప్మ్యాన్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. నేను ఈ వీడియోను చూస్తే నవ్వు ఆపుకోలేకపోతున్నాను అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియోను సుమారు 20 లక్షల మంది వీక్షించారు. వీడియోను చూసిన నెటిజన్లు పగలబడి నవ్వుతూ షేర్ చేస్తున్నారు. Public Service Announcement: Don’t forget to take you facemask off when sunbathing 😭😭💀 pic.twitter.com/XLcSxepgfD — Theo Shantonas (@TheoShantonas) June 7, 2021 -
వానొస్తే వాపస్
వానొస్తే వాపస్ ఇటలీలో ఎల్బా అనే ఒక పెద్ద ద్వీపం ఉంది. అక్కడి వాతావరణం అమోఘంగా ఉంటుంది. ఇడిలిక్ హాలిడే స్పాట్! మనోహరం అన్నమాట ఇడిలిక్ అంటే. ముదురాకుపచ్చ నీలం రంగులో ఉండే తీరప్రాంతపు ఒడ్డున సన్‌బాత్ చెయ్యడానికి దేశదేశాల నుంచి టూరిస్ట్‌లు వస్తుంటారు. అయితే ఒకటే ప్రాబ్లమ్. సడన్‌గా వాన పడుతుంది. పడితే మంచిదే కదా. కానీ సన్‌బాత్ ఉండదే! అదొక్కటే కాదు ఎండ వల్ల ఒనగూడే అనేక ఆహ్లాదాలు అవిరైపోతాయి.అంత డబ్బు పెట్టి అక్కడి హోటళ్లలో స్టే అయితే.. వానొచ్చి వృధా చేసి వెళ్లిపోయిందే అనిపిస్తుంది. అందుకే ఇప్పుడు ఎల్బా టూరిస్ట్ శాఖ ఒక ఆఫర్‌ని ప్రవేశపెట్టింది. వానొస్తే, వచ్చి ఆగకుండా రెండు గంటలపాటు కురిస్తే, ఒక రాత్రి రెంట్‌ను వాపస్ చేస్తుంది. నాలుగు రోజుల స్టే కోసం ఎవరైనా ఎల్బా వచ్చి, వచ్చిన నాలుగు రోజులూ రోజుకు కనీసం రెండు గంటల పాటు వాన కురిస్తే మొత్తం రెంట్ అంతా తిరిగి ఇచ్చేస్తుంది! ఆఫర్ మంచిదే కానీ, ఇంతదూరం వచ్చి వానను మాత్రమే ఎంజాయ్ చేసి వెళ్లడం మళ్లీ అదొక అసంతృప్తి. అదలా ఉంచితే, ఎల్బాకు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. నెపోలియన్ ఇక్కడే పది నెలలు అజ్ఞాతంగా గడిపివెళ్లారట.. రెండు శతాబ్దాల క్రితం. -
విస్మయ పరుస్తున్న 'విండో సన్ బాత్'
రష్యాః సన్ బాత్ చేయాలంటే బీచ్ లకు, తీర ప్రాంతాలకు వెడుతుంటారు. అవకాశం లేనివారు కొందరు.. బాల్కనీల్లోనూ, అపార్ట్ మెంట్లు, భవనాల టెర్రస్ లను సన్ బాత్ కు వినియోగించుకుంటారు. అయితే అసలు బయటకు వెళ్ళే పనే లేదంటోంది ఓ రష్యన్ మహిళ. బికిని ధరించి, ప్రతిరోజూ కిటికీ నుంచీ వచ్చే ఎండనే సన్ బాత్ కు వినియోగించుకుంటూ చుట్టుపక్కల వారిని విస్మయపరుస్తోంది. రష్యన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రష్యాపట్టణం నోవోసిబిర్స్క్ క్రోపోట్కిన్ వీధిలోని ఓ ఇంటి కిటికీనుంచీ ప్రతిరోజూ కనిపించే సన్ బాత్ దృశ్యం ఇరుగు పొరుగులను ఇబ్బందులకు గురిచేస్తోంది. అపార్ట్ మెంట్ లోని రెండో అంతస్తులో నివసించే మహిళ.. బికినీ ధరించి, తలభాగం మాత్రం లోపల, మిగిలిన శరీరభాగం కిటికీనుంచి బయటకు కనిపించేలా సన్ బాత్ చేస్తూ చూపరులను అకట్టుకోవడమేకాదు.. ఒకింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. సన్ బాత్ చేయాలంటే బీచ్ లకు, పార్క్ లకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఎలా చేయాలో అందరికీ తెలిసేట్లు చేస్తోంది. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట ప్రాంతం వరకూ విండో సన్ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆమె.. ఇప్పుడు అక్కడి వార్తల్లో వ్యక్తిగా మారింది. అయితే కొందరు కాలనీవాసులు మాత్రం ఆమె సన్ బాత్ వ్యవహారాన్ని తప్పుబడుతున్నారు. అక్కడే చిన్న పిలలు అడుకుంటుంటారని, సదరు మహిళ ఎక్స్ పోజింగ్ ను తట్టుకోలేకపోతున్నామని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఆమె విండో సన్ బాత్ ను ఆపించాలంటూ ఇరుగుపొరుగువారంతా సంతకాలు చేసిన ఓ పిటిషన్ ను స్థానిక బిల్డింగ్ అడ్మినిస్ట్రేటర్ కు, పోలీసులకు ఇచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. అయితే ఎవరేం అనుకుంటే నాకేంటీ అన్నట్లు సదరు సన్ బాతర్ మాత్రం తనకు ఇష్టం వచ్చినంత సమయం విండో సన్ బాత్ చేస్తూనే ఉంది. దీంతో కొందరు అటుగా వెళ్ళేవారు ఆమె ఫోటోలు తీసి పోస్ట్ చేయడంతో ఇప్పుడు రష్యన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. వేలమంది షేర్లు, కామెంట్లు చేస్తున్నారు. ఆమె సన్ బాత్ విషయం స్థానికులను ఇబ్బంది పెట్టడమేకాక.. ఎప్పుడోప్పుడు విండోనుంచి పడే ప్రమాదం కూడా ఉందంటున్నారు. ఆమె ఇలా కాళ్ళు, నడుమువరకూ బయటకు పెట్టి ఎక్స్ పోజ్ చేయడం మొదటిసారి కాదని, బాడీ మొత్తం సమాంతరంగా ట్యాన్ అయ్యేందుకు, శరీర పై భాగాన్ని కూడ ఎండలో బయటకు పెట్టేదని చెప్తున్నారు. కానీ అటువంటప్పుడు పూర్తి శాతం బికినీతో ఉండేదని మరి కొందరు ఇంటర్నెట్ వినియోగదారులు అంటున్నారు. ఎవరేమనుకున్నా ఆ సన్ బాత్ సుందరి మాత్రం.. తన రోజువారీ కార్యక్రమాన్ని ఆపేట్టు కనిపించడం లేదు.