వానొస్తే వాపస్‌

Rain Much on Your Vacation One Italian Island Offers Hotel Refunds - Sakshi

వానొస్తే వాపస్‌ ఇటలీలో ఎల్బా అనే ఒక పెద్ద ద్వీపం ఉంది. అక్కడి వాతావరణం అమోఘంగా ఉంటుంది. ఇడిలిక్‌ హాలిడే స్పాట్‌! మనోహరం అన్నమాట ఇడిలిక్‌ అంటే. ముదురాకుపచ్చ నీలం రంగులో ఉండే తీరప్రాంతపు ఒడ్డున సన్‌బాత్‌ చెయ్యడానికి దేశదేశాల నుంచి టూరిస్ట్‌లు వస్తుంటారు. అయితే ఒకటే ప్రాబ్లమ్‌. సడన్‌గా వాన పడుతుంది. పడితే మంచిదే కదా. కానీ సన్‌బాత్‌ ఉండదే! అదొక్కటే కాదు ఎండ వల్ల ఒనగూడే అనేక ఆహ్లాదాలు అవిరైపోతాయి.అంత డబ్బు పెట్టి అక్కడి హోటళ్లలో స్టే అయితే.. వానొచ్చి వృధా చేసి వెళ్లిపోయిందే అనిపిస్తుంది.

అందుకే ఇప్పుడు ఎల్బా టూరిస్ట్‌ శాఖ ఒక ఆఫర్‌ని ప్రవేశపెట్టింది. వానొస్తే, వచ్చి ఆగకుండా రెండు గంటలపాటు కురిస్తే, ఒక రాత్రి రెంట్‌ను వాపస్‌ చేస్తుంది. నాలుగు రోజుల స్టే కోసం ఎవరైనా ఎల్బా వచ్చి, వచ్చిన నాలుగు రోజులూ రోజుకు కనీసం రెండు గంటల పాటు వాన కురిస్తే మొత్తం రెంట్‌ అంతా తిరిగి ఇచ్చేస్తుంది! ఆఫర్‌ మంచిదే కానీ, ఇంతదూరం వచ్చి వానను మాత్రమే ఎంజాయ్‌ చేసి వెళ్లడం మళ్లీ అదొక అసంతృప్తి. అదలా ఉంచితే, ఎల్బాకు ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. నెపోలియన్‌ ఇక్కడే పది నెలలు అజ్ఞాతంగా గడిపివెళ్లారట.. రెండు శతాబ్దాల క్రితం.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top