
టెహ్రాన్: ఇజ్రాయెల్‌తో వివాదం.. ఇరాన్‌లోని అణుస్థావరాలపై అమెరికా భీకర దాడుల అనంతరం తాజాగా ఇరాన్ సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీ ఒక బహిరంగ వేదికపై కనిపించారు. టెహ్రాన్‌లో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారని సమాచారం. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణల నేపధ్యంలో ఇంతకాలం ఖమేనీ సురక్షితమైన ప్రదేశంలో దాక్కున్నారు.
తాజాగా ఇరాన్‌లోని షియా ముస్లింలకు అత్యంత పవిత్రమైన మొహర్రం సంతాప దినాలలో ఖమేనీ కనిపించారు. షియా ముస్లిం క్యాలెండర్‌లోని అషురా(మొహరం)ను జరుపుకుంటున్న హాలులోకి ఆయతుల్లా ఖమేనీ ప్రవేశించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇరాన్ స్టేట్ టీవీ మీడియాకు విడుదల చేసింది. ప్రతి సంవత్సరం ఖమేనీ ఈ కార్యక్రమాలలో తప్పనిసరిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా ఖమేనీ సంప్రదాయ నల్లని వస్త్రాలు ధరించి వచ్చారు. ఈ సందర్భంగా ఆయనను చూసిన అక్కడి జనం పలు నినాదాలు చేశారు.
📹 لحظه ورود رهبر انقلاب به حسینیه امام خمینی(ره) در مراسم عزاداری شب عاشورای حسینی#عاشورا pic.twitter.com/09mfwm3qFM
— خبرگزاری تسنیم 🇮🇷 (@Tasnimnews_Fa) July 5, 2025
జూన్ 14న ఇజ్రాయెల్- ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత సుప్రీం నేత ఖమేనీ బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. వైమానిక దాడుల తొలి రోజుల్లో ఖమేనీ రికార్డ్ చేసిన సందేశాలు మీడియాకు విడుదల చేశారు. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణల సమయంలో భద్రతా సమస్యల కారణంగా ఖమేనీ బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అయితే మతపరమైన ఆచారాలను గుర్తుచేసేందుకు ఆయన ప్రసంగాలను ముందే రికార్డ్ చేసి ప్రసారం చేశారు.
ఇది కూడా చదవండి: పుట్టినరోజు సందేశంలో.. దలైలామా నోటి వెంట ఘన భారతం