
న్యూఢిల్లీ: నేడు(జూలై 6) ప్రముఖ ఆధ్మాత్మిక గురువు దలైలామా 90వ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనను అనుసరించే టిబెటన్ కమ్యూనిటీలకు చెందినవారు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరిని అభినందిస్తూ, దలైలామా ఒక సందేశాన్ని అందించారు.
దలైలామా మాటల్లో..‘నేను ఒక సాధారణ బౌద్ధ సన్యాసిని. నేను సాధారణంగా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనను. అయితే మీరంతా నా పుట్టినరోజును దృష్టిలో ఉంచుకుని, వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నందున, నేను కొన్ని ఆలోచనలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.. మనిషి తన భౌతిక అభివృద్ధి కోసం పనిచేయడం ముఖ్యమే! అయినప్పటికీ, సత్ హృదయాన్ని పెంపొందించుకోవడం ద్వారా, ప్రియమైన వారితోనే కాకుండా అందరితో ప్రేమగా ప్రవర్తిస్తూ, ప్రతి ఒక్కరి పట్ల కరుణ చూపడం ద్వారా మనశ్శాంతిని సాధించడంపై దృష్టి పెట్టడం చాలా అవసరం. తద్వారా మనమంతా ప్రపంచాన్ని మరింత మెరుగైన శాంతియుత ప్రదేశంగా మార్చడానికి అవకాశం కలుగుతుంది.
90th Birthday Message
On the occasion of my 90th birthday, I understand that well-wishers and friends in many places, including Tibetan communities, are gathering for celebrations. I particularly appreciate the fact that many of you are using the occasion to engage in… pic.twitter.com/bfWjAZ18BO— Dalai Lama (@DalaiLama) July 5, 2025
ఇక నా విషయానికొస్తే, మానవతా విలువలను, మత సామరస్యాన్ని ప్రోత్సహించడం, మనస్సు, భావోద్వేగాల పనితీరును వివరించే ప్రాచీన భారతీయ విజ్ఞానం గురించి తెలియజేయడం, మనశ్శాంతి, కరుణ మొదలైన అంశాలను వివరించడంపై నిబద్ధత కలిగివున్నాను. అలాగే టిబెటన్ సంస్కృతి, వారసత్వంపై దృష్టి పెట్టడాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నాను. బుద్ధుని బోధనలు, ప్రపంచశాంతి సందేశంతోపాటు భారతీయ గురువులు అందించిన విలువలతో నా దైనందిన జీవితంలో నేను దృఢ సంకల్పాన్ని, ధైర్యాన్ని పెంపొందించుకుంటాను. అంతరిక్షం ఉన్నంత వరకు, జీవాత్మ ఉన్నంత వరకు, ప్రపంచంలోని దుఃఖాన్ని తొలగించాలనే కట్టుబాటుతో ఉంటాను. మనశ్శాంతి, కరుణను పొందించుకునేందుకు నా పుట్టినరోజును ఒక అవకాశంగా స్వీకరిస్తున్నందుకు ధన్యవాదాలు’ అని దలైలామా తన పుట్టినరోజు సందేశంలో పేర్కొన్నారు.