
మెగాస్టార్- అనిల్ రావిపూడి కాంబోలో వస్తోన్న చిత్రంపై టాలీవుడ్ ఫ్యాన్స్‌తో పాటు మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ అప్డేట్ కోసం సినీ ప్రియులు ఎప్పుడెప్పుడొస్తుందా అనుకుంటున్నారు. ఈనెలలోనే మెగాస్టార్ బర్త్ డే రానుండడంతో ఫ్యాన్స్ సైతం ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఈ సినిమాకు టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయవచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తాజాగా దీనిపై దర్శకుడు అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చేశారు.
అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే డైరెక్టర్ అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చారు. మెగాస్టార్ మూవీ టైటిల్ ఈనెల 21 రివీల్ చేయనున్నట్లు వెల్లడించారు. తాజాగా లిటిల్ హార్ట్స్ మూవీ ఈవెంట్కు హాజరైన అనిల్ రావిపూడి మెగా మూవీ టైటిల్ అప్డేట్ గురించి ప్రశ్నించగా.. నిజమేనని స్పష్టం చేశారు. అయితే ఈ మూవీ టైటిల్లో సంక్రాంతి అనే పదం లేదని తెలిపారు. దీంతో మెగా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా చిరంజీవి కెరీర్లోనే 157వ చిత్రంగా నిలవనుంది.