‘‘హోయ్.. అద్దం ముందు నిలబడి అబద్ధం చెప్పలేనే.. నా అద్దం అంటే నువ్వే మరి... నిజం దాచలేనే...’ అంటూ సాగే ఈపాట ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంలోనిది. రవితేజ హీరోగా, డింపుల్ హయతి, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించిన చిత్రమిది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ సినిమాలోని ‘అద్దం ముందు..’పాట ప్రోమోను విడుదల చేశారు మేకర్స్.
ఈపాట పూర్తి లిరికల్ వీడియో ఈ నెల 10న విడుదల కానుంది. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈపాటను శ్రేయా ఘోషల్, కపిల్ కపిలన్ పాడారు. జీ స్టూడియోస్ సమర్పణలో కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా థియేటర్స్‌లో రిలీజ్ కానుంది.


