
అమెరికా, ఇజ్రాయెల్‌లపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ నేరాల్లో అమెరికా భాగస్వామి అంటూ విరుచుకుపడ్డారు. టెల్ అవీవ్‌ను క్యాన్సర్ కణితిగా ఆయన అభివర్ణించారు. వాషింగ్టన్ చెప్పినట్లు నడుచుకుంటుందంటూ మండిపడ్డారు. కాగా, ఇజ్రాయెల్‌తో యుద్ధం తర్వాత అయతుల్లా అలీ ఖమేనీ ఎట్టకేలకు బయటకు రాగా.. జూలై 5న టెహ్రాన్‌లో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో తొలిసారిగా కనిపించారు. ఇరాన్-ఇజ్రాయెల్‌లలో 12 రోజుల పాటు జరిగిన వైమానిక దాడుల కారణంగా ఖమేనీ సురక్షితమైన ప్రాంతానికి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.
ఇజ్రాయెల్‌తో కాల్పుల విరమణ ఒప్పందం జరిగి.. మరోవైపు అమెరికాతో అణు చర్చలు జరపనున్న వేళ సుప్రీం లీడర్ తీవ్ర స్థాయిలో స్పందించడం సంచలనం రేపుతోంది. అమెరికా, ఇజ్రాయెలతో గొప్పగా పోరాటం చేశామన్న ఖమేనీ.. మళ్లీ ఎలాంటి దాడులు జరిగినా దీటుగా బదులిచేందుకు ఇరాన్ సిద్ధంగా ఉందంటూ హెచ్చరించారు. ఇజ్రాయెల్ ఇటీవల 12 రోజుల యుద్ధాన్ని ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రారంభించింది.. కానీ విఫలమైంది’’ అంటూ ఖమేనీ తీవ్ర ఆరోపణలు చేశారు.
12 రోజుల పాటు జరిగిన తీవ్ర యుద్ధంలో జోక్యం చేసుకున్న అమెరికా.. ఇరాన్‌లో అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు జరిపింది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధంలో వందల మంది మరణించారు. ఇజ్రాయెల్ తన వైమానిక దాడులతో ఇరాన్‌లోని అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. ఇరాన్ ప్రతిగా మిస్సైల్ దాడులు చేసి, అమెరికా స్థావరాలపై కూడా దాడి చేసింది.