అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తలు తారాస్థాయికి చేరుకున్నాయి. రేపో మాపో యుద్ధం తప్పదు అన్నట్లు ప్రస్తుత పరిస్థితులున్నాయి. ఇప్పటికే అమెరికాకు చెందిన అతి పెద్ద యూఎస్ఎస్ అబ్రహం లింకన్ నౌక్ ఇరాన్ సమీపంగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అప్రమత్తమైన ఇరాన్ మిలిటరీ అధికారులు.. ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ టెహ్రాన్‌లోని ఓ బంకర్‌కు తరలించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో అమెరికాలోని ఎమోరీ యూనివర్సిటీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్ అగ్రనేత అలీ లారిజానీ కుమార్తె డాక్టర్ ఫాతిమా అర్దేషిర్‌ను విధుల్లో నుంచి తొలగిస్తున్నట్లు ఎమోరీ యూనివర్సిటీ ప్రకటించింది. ఈ యూనివర్సిటీలోని మెడికల్ స్కూల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఫాతిమా పనిచేస్తోంది.
అయితే ఆమె తండ్రి సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీకి సీనియర్ సలహాదారుడిగా ఉన్నారు. కాగా ఇరాన్‌లో జరుగుతున్న ప్రజా నిసనలపై భద్రతా దళాలు కఠినంగా వ్యవహరించడంలో అలీ లారిజానీ కీలక పాత్ర పోషించారని అమెరికా ట్రెజరీ విభాగం అతడిపై ఆంక్షలు విధించింది. ఈ క్రమంలోనే ఫాతిమా అర్దేషిర్‌పై ఎమోరీ యూనివర్సిటీ వేటు వేసింది.


