ఇరాన్‌పై ఏ క్షణంలోనైనా దాడులు జరగొచ్చు. ఇందుకోసం అమెరికా అంతా సిద్ధం చేసుకుంటోంది. అబ్రహం లింకన్‌తో పాటు యూఎస్‌ఎస్ ఫ్రాంక్ ఈ పీటర్సన్ జూనియర్, యూఎస్‌ఎస్ స్ప్రూయాన్స్ డెస్ట్రాయర్లు, యూఎస్‌ఎస్ మిషెల్ మార్ఫీ .. అన్నీ ఎర్ర సముద్రానికి చేరుకోవడమే ఆలస్యం!.
పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయంటూ వెస్ట్రన్ మీడియా కథనాలు ఇస్తోంది. అగ్రరాజ్యానికి చెందిన యుద్ధ విమాన వాహక నౌక యూఎస్‌ఎస్ అబ్రహం లింకన్ తాజాగా గల్ఫ్‌నకు చేరుకుంది. జనవరి 19నే మలక్కా జలసంధిని ఈ అణుశక్తి విమానవాహక దాటిందని అమెరికా సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది కూడా. దీంతో ఇరాన్‌పై యూఎస్ ఏ క్షణాన దాడి చేస్తుందోనన్న భయాందోళనలు నెలకొన్నాయి.
ఇరాన్ వద్ద కాచుకు కూర్చొన్న అమెరికా యుద్ధనౌకకు తోడుగా యుఎస్‌ఎస్ ఫ్రాంక్ ఈ పీటర్సన్ జూనియర్, యుఎస్‌ఎస్ మిషెల్ మార్ఫి, యుఎస్‌ఎస్ స్ప్రుయాన్స్ డెస్ట్రాయర్లు చేరకున్నాయి. అయితే.. ప్రస్తుతం ఇవి ఇరాన్ సరిహద్దుల్లోని అరేబియా సముద్రంలో కాకుండా.. హిందూ మహాసముద్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మరోవైపు ప్రాంతీయ భద్రత, స్థిరత్వం కోసం దీన్ని మోహరించినట్లు అమెరికా చెబుతోంది.
అయితే అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ మాత్రం పలు ఫైటర్ జెట్‌లు, మిలిటరీ కార్గో విమానాలను ఎర్ర సముద్రం రీజియన్‌కు తరలించనున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అక్కడి నుంచి సూయాజ్ కాలువకు చేరుకుకోవాలనేదే ఉద్దేశంగా పేర్కొంటున్నాయి. ఒకవేళ అదే గనుక జరిగితే మాత్రం.. ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తారాస్థాయికి చేరుకోవడం ఖాయం.
ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జరిగిన ఘర్షణల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఆందోళనకారులకు మద్దతుగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ .. వారికి వ్యతిరేకంగా ఇరాన్ ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటే జోక్యం చేసుకుంటామని హెచ్చరించారు. ఈ క్రమంలో భారీగా తమ సైన్యాన్ని ఇరాన్ దిశగా పంపినట్లు ప్రకటించారు.
అయితే.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ అంతే ధీటుగా స్పందిస్తోంది. తమ వేలు కూడా ట్రిగ్గర్ మీదే ఉందంటూ కౌంటర్ ఇస్తోంది. మరోవైపు తమ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీని బంకర్‌లో సురక్షితంగా దాచినట్లు కథనాలు వెలువడుతున్నాయి. అదే సమయంలో.. ఇటు చర్చల అంశమూ తెర మీదకు వస్తోంది. చర్చలు ముందుకుసాగేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో టెహ్రాన్‌కు ఇప్పటికే తెలుసని ట్రంప్ పేషీలోని ఓ ముఖ్యాధికారి వ్యాఖ్యానించారు కూడా.


