టెహ్రాన్: ఇరాన్ దివంగత సుప్రీం లీడర్ అయతోల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమం ముగింపు వేళ ఇరాన్ కీలక వీడియో విడుదల చేసింది. ఆయన నివాసంపై అమెరికా జరిపిన దాడికి సంబంధించిన చిత్రాలను తొలిసారిగా అధికారికంగా పంచుకుంది. ఇంతవరకూ కేవలం శాటిలైట్ చిత్రాలు మాత్రమే అందుబాటులో ఉండగా తొలిసారిగా అధికారికంగా వీడియోను విడుదల చేసింది.
ఫిబ్రవరి 28 అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేసి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ దాడికి సంబంధించిన వీడియోను ఇరాన్ రిలీజ్ చేసింది. 35 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో దాడులలో భవనం పూర్తిగా శిథిలమైన చిత్రాలు క్షిపణుల దాడులు భవనం కుప్పకూలిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఖమేని అంత్యక్రియలు ముగింపువేళ ఈ చిత్రాలు ఇరానీయలను తీవ్రమైన బాధకు గురి చేస్తున్నాయి.
కాగా ఈ దాడిలో ఖమేనీ ఆయన కుటుంబసభ్యులతో సహా 14 నెలల మనవరాలు 40 మంది అధికారులు సైతం మరణించారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఈ భవనంపై ఏకకాలంలో 35 క్షిపణులను ప్రయోగించాయి. అయితే అయతుల్లా ఖమేనీ అంత్యక్రియలు ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ రోజు (గురువారం) సాయంత్రం ఆయనను మషద్‌లో ఖననం చేయనున్నారు.
కాగా ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్న అమెరికా దాడులకు తెగబడింది. చైనా, రష్యా, ఇరాన్‌లకు భూమర్గం ద్వారా జరిగే వస్తురవాణాకు కీలకంగా భావించే ఆక్ తఖే ఖాన్ రైల్వేబ్రిడ్జిపై దాడులు చేసినట్లు అంతర్జాతీయ కథనాలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌లో ఆందోళన నెలకొంది.
Iran released footage of leader Khamanei's residence after the US attack that martyred him and his family, including 14-month old Zahra pic.twitter.com/dpSEJWKeGP
— COMBATE |🇵🇷 (@upholdreality) July 8, 2026


