ఇరాన్ హిట్‌ లిస్ట్‌లో నేనే నంబర్ వన్‌.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు | US Trump Says I'm No 1 on Iran's kill list | Sakshi
Sakshi News home page

ఇరాన్ హిట్‌ లిస్ట్‌లో నేనే నంబర్ వన్‌.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Jul 9 2026 7:06 AM | Updated on Jul 9 2026 8:32 AM

US Trump Says I'm No 1 on Iran's kill list

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఇరాన్ టార్గెట్‌ చేసిన హిట్‌ లిస్ట్‌లో (కిల్ లిస్ట్)లో మొదటి స్థానంలో ఉన్నానని ట్రంప్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. తనపై దాడి చేసే ఇరాన్‌ ప్లాన్‌ చేసిందని చెప్పుకొచ్చారు. ఇరాన్‌ దాడి అవకాశం ఉన్నప్పటికీ అలాంటి బెదిరింపులకు భయపడబోనని స్పష్టం చేశారు.

నాటో సదస్సు సందర్భంగా మీడియాతో మాట్లాడిన ట్రంప్.. ఇటీవల ఇరాన్‌పై అమెరికా చేపట్టిన సైనిక దాడులను సమర్థించారు. ఇరాన్ దూకుడు చర్యలకు ప్రతిస్పందనగానే అమెరికా బలంగా వ్యవహరించిందని, దేశ భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదన్నారు. అవసరమైతే మరింత కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశ భద్రతకు ముప్పు ఏర్పడితే వెంటనే స్పందిస్తామని తెలిపారు.

కాగా, 2020లో ఇరాన్ సైనిక అధికారి ఖాసిం సులేమానీ హత్య తర్వాత ట్రంప్‌పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌కు చెందిన పలువురు నాయకులు హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ట్రంప్‌పై హత్యాయత్నాలకు సంబంధించిన కుట్రలను అమెరికా దర్యాప్తు సంస్థలు కూడా వెలుగులోకి తెచ్చాయి. అయితే తాను ఇరాన్ 'కిల్ లిస్ట్'లో మొదటి స్థానంలో ఉన్నానన్న ట్రంప్ వ్యాఖ్యకు సంబంధించి ఇరాన్ నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ వెలువడలేదు.

ఇక, ట్రంప్ తాజా వ్యాఖ్యలు అమెరికా-ఇరాన్ సంబంధాల్లో నెలకొన్న ఉద్రిక్తతలను మరోసారి ప్రపంచ దృష్టికి తీసుకొచ్చాయి. ఈ పరిణామాలను ఐక్యరాజ్యసమితి, నాటో సభ్యదేశాలు, మధ్యప్రాచ్య దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. ప్రాంతీయ భద్రత, చమురు సరఫరా, అంతర్జాతీయ వాణిజ్యంపై ఈ ఉద్రిక్తతల ప్రభావం ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement