ఆసియాకప్-2025 టైటిల్‌ను కోల్పోయిన పాకిస్తాన్ జట్టు ఇప్పుడు మరో కఠిన సవాల్‌కు సిద్దమవుతోంది. స్వదేశంలో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో సౌతాఫ్రికాతో పాక్ తలపడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు లహోర్ వేదికగా అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 16 వరకు జరగనుంది.
ఈ నేపథ్యంలో అభిమానులను ఆకర్షించేందుకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు మ్యాచ్‌లు జరిగే స్టేడియాల్లో కొన్ని స్టాండ్స్ వరకు ప్రేక్షకులకు ఉచిత ప్రవేశాన్ని పీసీబీ కల్పించింది. జనరల్, ఫస్ట్-క్లాస్, ప్రీమియం, వీఐపీ ఎన్‌క్లోజర్ స్టాండ్స్‌కు ఎటువంటి ధరలను పాక్ క్రికెట్ కేటాయించలేదు.
తొలి టెస్టు జరిగే లహోర్‌లో వీఐపీ ఇక్బాల్ అండ్ జిన్నా ఎండ్, గ్యాలరీ టిక్కెట్ ధరలను పీకేఆర్ 800-1,000( భారత కరెన్సీలో రూ.350-రూ.440)గా నిర్ణయించారు. రావాల్పిండి స్టేడియంలో పీసీబీ గ్యాలరీ మొదటి నాలుగు రోజుల టిక్కెట్ ధర పీకేఆర్ 800(రూ.350), ఐదో రోజు పీకేఆర్ 1,000 (రూ.440)గా కేటాయించారు.
పాకిస్తాన్‌లో టెస్టు క్రికెట్‌కు అదరణ రోజు రోజుకు తగ్గిపోతుంది. పాక్ జట్టు ప్రదర్శన కూడా అంతంత మాత్రంగా ఉండడంతో ప్రేక్షకులు స్టేడియంకు రావడం లేదు. ఇంతకుముందు జరిగిన టెస్టు సిరీస్‌లలో స్టాండ్స్ ఖాళీగా దర్శనమిచ్చాయి. ఈ క్రమంలోనే ప్రీ ఎంట్రీ ఇవ్వాలని పీసీబీ నిర్ణయించింది. ఇప్పటికైనా స్టేడియాలకు ప్రేక్షకులు వస్తారో లేదో వేచి చూడాలి.
చదవండి: సహనం కోల్పోయిన వైభవ్ సూర్యవంశీ.. కారణం ఇదే!


