
రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన రెండో టెస్టులో 8 వికెట్ల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయం సాధించింది. పాక్ నిర్ధేశించిన 72 పరుగుల స్పల్ప లక్ష్యాన్ని ప్రోటీస్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ సమమైంది. సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఐడైన్ మార్‌క్రమ్(42) టాప్ స్కోరర్‌గా నిలవగా.. రికెల్టన్ 25 పరుగులతో రాణించాడు. పాక్ బౌలర్లలో నోమన్ అలీ ఒక్కడే రెండు వికెట్లు సాధించాడు.
తిప్పేసిన హర్మర్..
అంతకుముందు 94/4 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ఆరంభించిన పాక్‌కు సౌతాఫ్రికా స్పిన్నర్ హర్మర్ చుక్కలు చూపించాడు. అతడు స్పిన్ ఉచ్చులో చిక్కుకున్న పాక్..సెకెండ్ ఇన్నంగ్స్‌లో కేవలం 138 పరుగులకే కుప్పకూలింది. 44 పరుగుల వ్యవధిలో ఆతిథ్య జట్టు ఏకంగా 6 వికెట్లు కోల్పోయింది. దీంతో సఫారీలు ముందు పాక్ జట్టు కేవలం 72 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగల్గింది.
సౌతాఫ్రికా బౌలర్లలో హర్మర్ ఆరు వికెట్లతో సత్తాచాటగా.. మహారాజ్ రెండు, రబాడ ఒక్క వికెట్ పడగొట్టారు. పాక్ బ్యాటర్లలో బాబర్ ఆజం(50) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 404 పరుగులు భారీ స్కోర్ సాధించింది.
టెయిలాండర్ బ్యాటర్లలు సెనురన్ ముత్తుస్వామి (155 బంతుల్లో 89 నాటౌట్; 8 ఫోర్లు) అజేయ అర్ధశతకంతో ఆకట్టుకోగా... కగిసో రబడ (61 బంతుల్లో 71; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అదరగొట్టారు. పాక్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 333 పరుగులు చేసింది. కేశవ్ మహారాజ్‌కు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కగా.. హర్మర్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు.
చదవండి: ఎట్టకేలకు బాబర్ ఆజంను కనికరించిన సెలక్టర్లు.. రిజ్వాన్‌కు భారీ షాక్