
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ(Rohit Sharma) సత్తాచాటాడు. 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును అద్బుతమైన హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో కలిసి మూడో వికెట్‌కు వందకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.
తొలుత ఆచితూచి ఆడిన రోహిత్.. క్రీజులో సెటిల్ అయ్యాక దూకుడు పెంచాడు. 97 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్ 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 73 పరుగులు చేశాడు. అయితే భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే క్రమంలో రోహిత్-శ్రేయస్ అయ్యర్ మధ్య చిన్నపాటి మాటల యుద్దం చోటు చేసుకుంది.
ఏమి జరిగిందంటే?
ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోవడంతో రోహిత్ శర్మ ఎక్కువగా సింగిల్స్ పైన దృష్టిపెట్టాడు. ఈ క్రమంలో భారత ఇన్నింగ్స్ 14వ ఓవర్ వేసిన జోష్ హాజిల్‌వుడ్.. ఐదో బంతిని బ్యాక్-ఆఫ్-లెంగ్త్ డెలివరీగా రోహిత్‌కు సంధించాడు. ఆ బంతిని హిట్‌మ్యాన్ ఫ్లిక్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి అతడి ప్యాడ్‌లను తాకి కాస్త దూరంగా వెళ్లింది.
దగ్గరలో ఫీల్డర్లు ఎవరూ లేకపోవడంతో క్విక్ సింగిల్‌కు కాల్ ఇచ్చాడు. అయ్యర్ మాత్రం రోహిత్ పిలుపును తిరష్కరించాడు. అయితే రన్‌కు పిలిచిన శ్రేయస్ రాకపోవడంపై హిట్‌మ్యాన్ అసహనం వ్యక్తం చేశాడు. నువ్వు త్వరగా వచ్చి ఉంటే పరుగు పూర్తయ్యేది అని రోహిత్ అనగా.. అరె.. మీరే చూసుకుని రండి.. మళ్లీ నన్ను అంటారెందుకు? అని శ్రేయస్ గట్టిగానే బదులిచ్చాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా అయ్యర్(61) సైతం హాఫ్ సెంచరీతో రాణించాడు.
చదవండి: #Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. గంగూలీ ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
Stump mic captures Rohit Sharma vs Shreyas Iyer 🤣🙌
Whose call was it really?✍🏻👇#AUSvIND 👉 2nd ODI | LIVE NOW 👉 https://t.co/dfQTtniylt pic.twitter.com/YipS5K9ioa— Star Sports (@StarSportsIndia) October 23, 2025
— crictalk (@crictalk7) October 23, 2025