
అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును శ్రేయస్ అయ్యర్‌తో కలిసి రోహిత్ ఆదుకున్నాడు.
తొలుత ఆచితూచి ఆడిన రోహిత్, క్రీజులో నిలదొక్కకున్నాక ప్రత్యర్ధి బౌలర్లపై తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో 97 బంతులు ఎదుర్కొన్న హిట్‌మ్యాన్ 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 73 పరుగులు చేశాడు. సెంచరీ మార్క్‌ను అందుకునేలా కన్పించిన రోహిత్.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను కోల్పోయాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.
రోహిత్ సాధించిన రికార్డులు ఇవే..
👉వన్డేల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండో ఓపెనర్‌గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. రోహిత్ ఇప్పటివరకు వన్డేల్లో ఓపెనర్‌గా 9180* పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (9146 ) పేరిట ఉండేది. తాజా ఇన్నింగ్స్‌తో గంగూలీని రోహిత్ బ్రేక్ చేశాడు. కాగా ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో సచిన్ టెండూల్కర్(15310) అగ్రస్ధానంలో ఉన్నాడు.
👉ఆస్ట్రేలియా గడ్డపై ఆసీస్ జట్టుపై 1,000 కంటే ఎక్కువ వన్డే పరుగులు తొలి భారత బ్యాటర్‌గా రోహిత్ నిలిచాడు. ఓవరాల్‌గా ఐదో బ్యాటర్‌గా హిట్‌మ్యాన్ రికార్డులకెక్కాడు. అయితే ఈ ఫీట్‌ను అంత్యంత వేగంగా అందుకున్న రెండో బ్యాటర్ మాత్రం రోహిత్ శర్మనే కావడం గమనార్హం. రోహిత్ కేవలం 21 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనత సాధించాడు. ఈ జాబితాలో విండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్ (19) అగ్రస్దానంలో ఉన్నాడు.
👉వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రోహిత్ మూడో స్ధానానికి చేరుకున్నాడు. రోహిత్ ఇప్పటివరకు 11225 పరుగులు చేశాడు. ఈ క్రమంలో గంగూలీ(11221)ని రోహిత్ అధిగమించాడు.
👉ఆసీస్‌పై వన్డేల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన నాలుగో ఆటగాడిగా బ్రియాన్ లారా రికార్డును హిట్‌మ్యాన్ సమం చేశాడు. వీరిద్దరూ 18 హాఫ్ సెంచరీలు ఆసీస్‌పై సాధించారు.
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది.
చదవండి: IND vs AUS: విరాట్ కోహ్లి మళ్లీ డకౌట్.. లండన్‌కు బ్యాగ్ సర్దుకోవాల్సిందే!?