
ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) అభిమానులను మరోసారి నిరాశపరిచాడు. అసీస్‌తో తొలి వన్డేలో డకౌటైన కోహ్లి.. ఇప్పుడు అడిలైడ్ వేదికగా జరుగుతున్న రెండో మ్యాచ్‌లో కూడా అదే తీరును కనబరిచాడు. 4 బంతులు ఎదుర్కొని తన పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు.
గిల్ ఔటైన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కింగ్ కోహ్లి.. ఆసీస్ యువ పేసర్ జేవియర్ బార్ట్‌లెట్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. భారత ఇన్నింగ్స్ 7 ఓవర్ వేసిన బార్ట్‌లెట్ తొలి బంతికి కెప్టెన్ గిల్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఆ తర్వాత అదే ఓవర్‌లో ఆఖరి బంతిని కోహ్లికి మిడిల్ స్టంప్ లైన్ దిశగా గుడ్ లెంగ్త్ డెలివరీగా సాధించాడు.
ఆ బంతిని కోహ్లి ఫ్లిక్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. కనీ బంతి మాత్రం బ్యాట్‌కు మిస్స్ అయ్యి ఫ్రంట్ ప్యాడ్‌కు తాకింది. వెంటనే బౌలర్‌తో పాటు ఫీల్డర్లు ఎల్బీగా అప్పీల్ చేయగా.. అంపైర్ ఔట్ అని వేలు పైకెత్తాడు. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న రోహిత్ శర్మతో చర్చించాక రివ్యూ తీసుకోకుండానే కోహ్లి మైదానం వీడి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రిప్లేలో బంతి మిడిల్ స్టంప్‌ను హిట్ చేస్తున్నట్లు కన్పించింది.
ఇక తన ఇంటర్ననేషనల్ క్రికెట్ రీ ఎంట్రీలో దారుణ ప్రదర్శన కనబరుస్తున్న కోహ్లిపై నెటిజన్లు ఫైరవతున్నారు. ఇక నీ పని అయిపోయింది.. లండన్‌కు బ్యాగ్ సర్దుకో అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. కాగా అడిలైడ్‌లో కోహ్లికి మంచి రికార్డు ఉన్నప్పటికి.. ఈ మ్యాచ్‌లో మాత్రం తన మార్క్ చూపించలేకపోయాడు.
ఈ మైదానంలో అతడికి రెండు సెంచరీలు ఉన్నాయి. కాగా 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడాలని లక్ష్యం పెట్టుకున్న కోహ్లి ఈ తరహా ప్రదర్శనలు కనబరిచడం అందరిని షాక్‌కు గురిచేస్తోంది. రెండో వన్డేలో భారత్ తడబడుతోంది. 15 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది.
చదవండి: 'లేటుగా ఎంట్రీ ఇచ్చా.. లేదంటే సచిన్‌ను మించిపోయేవాడిని'
VIRAT KOHLI GONE FOR HIS SECOND DUCK OF THE SERIES!#AUSvIND | #PlayoftheDay | @BKTtires pic.twitter.com/jqIdvMeX9T
— cricket.com.au (@cricketcomau) October 23, 2025