
మైఖేల్ హస్సీ.. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలు లిఖించకున్నాడు. 28 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టినప్పటికి అన్ని ఫార్మాట్లలో కలిపి పన్నేండు వేలకు పైగా పరుగులు చేశాడు. 2007లో వన్డే వరల్డ్ కప్, , 2006, 2009లో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ గెలుచుకున్న ఆసీస్ జట్టులో హస్సీ భాగమయ్యాడు.
మిస్టర్ క్రికెట్‌గా పేరు గాంచిన హస్సీ తన అద్భుత ఇన్నింగ్స్‌లతో కంగారులకు చారిత్రత్మక విజయాలను అందించాడు. కాగా దేశవాళీ క్రికెట్‌లో మెరుగైన రికార్డులు ఉన్నప్పటికి.. ఆ సమయంలో తీవ్రమైన పోటీ వల్ల ఆసీస్ జట్టులో ఆలస్యంగా హస్సీకి జట్టులో చోటు దక్కింది.
లేటుగా వచ్చినా అందరితో మాత్రం గ్రేట్ అని అన్పించుకున్నాడు. అయితే హస్సీ తాజాగా యూట్యూబ్ ఛానల్ ది గ్రేడ్ క్రికెటర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ తాను త్వరగా క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఉంటే భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కంటే ఎక్కువ పరుగులు చేసేవాడినంటూ అతడు చెప్పుకొచ్చాడు.
"సచిన్ రికార్డులు గురుంచి నేను చాలాసార్లు ఆలోచించాను. నాకు ముందుగా ఆసీస్ జట్టులో చోటు దక్కింటే,సచిన్ టెండూల్కర్ కంటే 5,000 పరుగులు ఎక్కువ చేసేవాడిని. అంతేకాకుండా ఎక్కువ సెంచరీలు, ఎక్కువ యాషెస్ విజయాలు,వరల్డ్ కప్‌లు గెలిచేవాడినని కూడా అనిపిస్తుంది.
కానీ దురదృష్టవశాత్తూ ఉదయం నిద్రలేవగానే మాయపోతున్నాయి. అప్పుడు అర్ధమైంది అదింతా కల అని. ముందే నాకు ఆడే ఛాన్స్ లభించింటే బాగుండేది. ఏదేమైనప్పటికి నాకు అవకాశం ఆలస్యంగా వచ్చినప్పటికీ గొప్పగా భావిస్తున్నా అని హస్సీ పేర్కొన్నాడు. ఈ ఆసీస్ గ్రేట్ ఐపీఎల్‌లో చాలా సీజన్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. ప్రస్తుతం సీఎస్‌కే బ్యాటింగ్ కోచ్‌గా ఉన్నాడు.
మైఖల్ హస్సీ తన అంతర్జాతీయ కెరీర్‌లో అన్ని ఫార్మాట్లు కలిపి 49 సగటుతో 12,398 పరుగులు చేశాడు. అందులో 22 సెంచరీలు ఉన్నాయి. అయితే హస్సీతో పోలిస్తే టెండూల్కర్ కెరీర్ 24 సంవత్సరాలు ఎక్కువగా సాగింది. 16 ఏళ్ల వయసులోనే లిటల్ మాస్టర్ భారత క్రికెట్‌లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో సచిన్ టెండూల్కర్(34,357) అగ్రస్ధానంలో ఉన్నాడు. అయన దారిదాపుల్లో ఎవరూ లేరు.
చదవండి: World cup 2025: ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఆసీస్..