IND Vs AUS: ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్‌ | India Vs Australia 2nd ODI Match Live Score Updates, Highlights And Viral Videos | Sakshi
Sakshi News home page

IND Vs AUS: ఐదో వికెట్‌ కోల్పోయిన భారత్‌

Oct 23 2025 8:32 AM | Updated on Oct 23 2025 11:52 AM

India vs Australia 2nd odi live updates and highlights

IND vs Aus 2nd Odi live updates and Highlights: అడిలైడ్ వేదిక‌గా రెండో వ‌న్డేలో ఆస్ట్రేలియా-భార‌త్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. 

టీమిండియా ఐదో వికెట్ డౌన్‌
టీమిండియా 174 ప‌రుగుల వ‌ద్ద ఐదో వికెట్ కోల్పోయింది. 11 ప‌రుగులు చేసిన రాహుల్‌.. ఆడ‌మ్ జంపా బౌలింగ్‌లో 
ఔట‌య్యాడు. క్రీజులోకి వాషింగ్ట‌న్ సుంద‌ర్ వ‌చ్చాడు.

నాలుగో వికెట్‌ కోల్పోయిన భారత్‌
శ్రేయస్‌ అయ్యర్‌ (61)​ రూపంలో టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. జంపా బౌలింగ్‌లో అయ్యర్‌​ బౌల్డ్‌. స్కోరు: 160-4(32.4).  అక్షర్‌ 13 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

రోహిత్‌ శర్మ ఔట్‌..
రోహిత్ శర్మ రూపంలో భారత్ మూడో వికెట్ కోల్పో‍ంయింది. 73 పరుగులు చేసిన రోహిత్‌.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి అక్షర్ పటేల్ వచ్చాడు.
అయ్యర్‌ హాఫ్‌ సెంచరీ..
శ్రేయస్‌ అయ్యర్‌ కూడా తన హాఫ్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 67 బంతుల్లో అయ్యర్‌ తన 23వ ఆర్ధ శతకాన్ని అందుకున్నాడు. టీమిండియా స్కోరు: 94-2 (29).  రోహిత్‌ 72 పరుగులతో క్రీజులో ఉన్నాడు.

రోహిత్‌ శర్మ హాఫ్‌ సెంచరీ
21.5: కన్నోలి బౌలింగ్‌లో సింగిల్‌ తీసి అర్ధ శతకం పూర్తి చేసుకున్న రోహిత్‌ శర్మ. 74 బంతుల్లో యాభై పరుగుల మార్కు అందుకున్న హిట్‌మ్యాన్‌. వన్డేల్లో ఇది 59వ ఫిఫ్టీ. టీమిండియా స్కోరు: 94-2 (22). అయ్యర్‌ 33 పరుగులతో ఆడుతున్నాడు.

సిక్స్‌లు, ఫోర్‌.. 17 పరుగులు
19వ ఓవర్లో రోహిత్‌ శర్మ రెండు సిక్స్‌లు బాదగా.. శ్రేయస్‌ అయ్యర్‌ ఓ ఫోర్‌ బాదాడు. ఈ క్రమంలో మిచెల్‌ ఓవెన్‌ బౌలింగ్‌లో ఈ ఓవర్లో ఓవరాల్‌గా 17 పరుగులు వచ్చాయి. టీమిండియా స్కోరు 83-2.

నిలకడగా ఆడుతున్న రోహిత్‌, అయ్యర్‌..
15 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ(26), శ్రేయస్‌ అయ్యర్‌(13) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు.

టీమిండియాకు భారీ షాక్‌.. కోహ్లి డకౌట్‌
విరాట్ కోహ్లి రూపంలో టీమిండియా రెండో వికెట్ కోల్పోయింది. జేవియర్ బార్ట్‌లెట్ బౌలింగ్‌లో కోహ్లి వికెట్లు ముందు దొరికిపోయాడు. దీంతో ఖాతా తెరవకుండానే కోహ్లి పెవిలియన్‌కు చేరాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన భారత్‌..
రెండో వన్డేలో కూడా భారత కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ విఫలమయ్యాడు. కేవలం 9 పరుగులు మాత్రమే చేసిన గిల్‌.. బార్ట్‌లెట్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. క్రీజులోకి కోహ్లి వచ్చాడు.

తడబడుతున్న గిల్‌..
6 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్‌ నష్టపోకుండా 17 పరుగులు చేసింది. ఓ వైపు శుభ్‌మన్‌ గిల్‌(8 బంతుల్లో 9) మంచి టచ్‌లో కన్పిస్తుంటే.. రోహిత్‌ శర్మ(28 బంతుల్లో 8) మాత్రం తడబడుతున్నాడు.

అడిలైడ్ వేదిక‌గా రెండో వ‌న్డేలో ఆస్ట్రేలియా-భార‌త్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్‌ కెప్టెన్ మిచెల్‌ మార్ష్‌ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఆసీస్‌ రెండు మార్పులతో బరిలో​కి దిగింది. 

తుది జట్టులో​కి స్టార్‌ ప్లేయర్లు అలెక్స్‌ క్యారీ, అడమ్‌ జంపా వచ్చారు. మరోవైపు భారత్‌ మాత్రం ఎటువంటి మార్పులు చేయలేదు. పెర్త్‌లో ఆడిన జట్టునే ​కొనసాగించింది. కుల్దీప్‌ యాదవ్‌ మరోసారి బెంచ్‌కే పరిమితమయ్యాడు.

తుది జట్లు
ఆస్ట్రేలియా : మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మాట్ రెన్షా, అలెక్స్ కారీ (వికెట్ కీపర్‌), కూపర్ కోనోలీ, మిచెల్ ఓవెన్, జేవియర్ బార్ట్‌లెట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్

భారత్‌ : రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్‌), వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement