
రావల్పిండి వేదికగా పాకిస్తాన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఆధిక్యం చేతులు మారుతున్న ఈ పోరులో మూడో రోజు బుధవారం ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 94 పరుగులు చేసింది.
మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ (83 బంతుల్లో 49 బ్యాటింగ్; 7 ఫోర్లు), మొహమ్మద్ రిజ్వాన్ (16 బ్యాటింగ్) పోరాడుతున్నారు. ఇమాముల్ హక్ (9), అబ్దుల్లా షఫీఖ్ (6), కెపె్టన్ షాన్ మసూద్ (0), సౌద్ షకీల్ (11) విఫలమయ్యారు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో సిమన్ హర్మెర్ 3 వికెట్లు పడగొట్టగా... రబడ ఓ వికెట్ తీశాడు. చేతిలో 6 వికెట్లు ఉన్న ఆతిథ్య పాకిస్తాన్ జట్టు... ప్రస్తుతం 23 పరుగుల ఆధిక్యంలో ఉంది. సఫారీ బౌలర్ల ధాటికి ఒక దశలో 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన జట్టును బాబర్ ఆదుకున్నాడు. కాస్త సంయమనం పాటిస్తూ వికెట్ల పతనానికి అడ్డుకట్ట వేశాడు.
ముత్తుస్వామి, రబడ మెరుపులు
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 185/4తో బుధవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా... చివరకు 119.3 ఓవర్లలో 404 పరుగులు చేసింది. సెనురన్ ముత్తుస్వామి (155 బంతుల్లో 89 నాటౌట్; 8 ఫోర్లు) అజేయ
అర్ధశతకంతో ఆకట్టుకోగా... కగిసో రబడ (61 బంతుల్లో 71; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) అదరగొట్టాడు. పాక్ బౌలర్లను ఓ ఆటాడుకున్న ఈ జంట పదో వికెట్‌కు 98 పరుగులు జోడించడం విశేషం. ముత్తుస్వామి అచ్చమైన టెస్టు బ్యాటింగ్‌తో ఆకట్టుకోగా... రబడ టి20 తరహాలో రెచ్చిపోయాడు. ఎడాపెడా భారీ షాట్లు ఆడుతూ విలువైన
పరుగులు రాబట్టాడు.
ఈ ఇద్దరికీ ఇదే కెరీర్ బెస్ట్ స్కోరు కాగా... రబడ 38 బంతుల్లోనే టెస్టుల్లో తొలి అర్ధశతకం నమోదు చేసుకున్నాడు. కేశవ్ మహరాజ్ (53 బంతుల్లో 30; 3 ఫోర్లు) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒకదశలో 210/7తో నిలిచిన దక్షిణాఫ్రికా... చివరి మూడు వికెట్లకు 194 పరుగులు జోడించింది. ఫలితంగా దక్షిణాఫ్రికా జట్టుకు 71 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. పాక్ ఫీల్డింగ్ తప్పిదాలు కూడా దక్షిణాఫ్రికా భారీ స్కోరుకు దోహదపడ్డాయి.
చదవండి: PKL 2025: భరత్ ఒంటరి పోరాటం.. హర్యానా చేతిలో తెలుగు టైటాన్స్ చిత్తు