పాకిస్తాన్ కొత్త వన్డే కెప్టెన్‌గా స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది ఎంపికైన సంగతి తెలిసిందే. మహ్మద్ రిజ్వాన్ నుంచి వన్డే జట్టు పగ్గాలను అఫ్రిది చేపట్టాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు మందు ఈ కెప్టెన్సీ మార్పు చోటు చేసుకుంది. రిజ్వాన్ సారథ్యంలో పాక్ జట్టు దారుణ ప్రదర్శన కనబరచడంతో పీసీబీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ పీసీబీ మాత్రం రిజ్వాన్‌తో సంప్రదించాకే కెప్టెన్సీ మార్పు చేసిందని షాహీన్ తాజాగా వెల్లడించాడు.
"పాకిస్తాన్ కెప్టెన్సీ తీసుకోవాలా వద్ద అన్న విషయం గురుంచి నేను చర్చించిన ఏకైక వ్యక్తి మహ్మద్ రిజ్వాన్. అతడితో అన్ని విషయాలు మాట్లాడాకే బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరించాను. రిజ్వాన్ నిజంగా చాలా మంచివాడు. రిజ్వాన్ భాయ్ తనంతట తానే తప్పుకొని నాకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు" అని విలేకరుల సమావేశంలో షాహీన్ పేర్కొన్నాడు.
కాగా 25 ఏళ్ల అఫ్రిది తన కెప్టెన్సీ అద్భుతంగా ఆరంభించాడు. స్వదేశంలో సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో పాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు శ్రీలంకతో వన్డేల్లో తలపడేందుకు మెన్ ఇన్ గ్రీన్ సిద్దమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా శ్రీలంక-పాక్ మధ్య తొలి మ్యాచ్ రావల్పిండి వేదికగా మంగళవారం జరగనుంది. ఇక ఇది ఉండగా..20 వన్డేల్లో పాక్ జట్టుకు రిజ్వాన్ సారథ్యం వహించాడు. ఇందులో 9 విజయాలు, 11 ఓటములు ఉన్నాయ. అతడి గెలుపు శాతం 45%గా ఉంది.
చదవండి: శ్రేయస్ అయ్యర్ విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం!


