దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ దూరమయ్యే అవకాశం ఉంది. ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడ్డ శ్రేయస్ అయ్యర్.. పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరింత సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. అయ్యర్ తన ప్రక్కెటుమకల గాయం నుంచి క్రమంగా కోలుకుంటున్నాడు.
అయితే అయ్యర్‌కు వైద్యులు దాదాపు ఐదు వారాల పాటు విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో ఈ ముంబై ఆటగాడిని సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌లో ఆడించి రిస్క్ తీసుకోడదని బీసీసీఐ భావిస్తుందంట. శ్రేయస్ అయ్యర్ పూర్తిగా కోలుకోవడానికి మరింత సమయం పడుతోంది.
అయ్యర్ విషయంలో బోర్డు, సెలక్షన్ కమిటీ ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోదు అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. కాగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య మూడు వన్డేల సిరీస్ నవంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. అయ్యర్ స్దానంలో సెలక్టర్లు సాయిసుదర్శన్‌కు చోటు ఇచ్చే అవకాశముంది.
అయ్యర్‌కు ఏమైందంటే?
ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో క్యారీ ఇచ్చిన క్యాచ్‌ను అందుకునే క్రమంలో బంతి అయ్యర్ పక్కటెముకలకు బలంగా తాకింది. ప్లీహానికి (Spleen Injury) తీవ్ర గాయమైంది. ఆ తర్వాత అంతర్గతంగా రక్తస్రావం జరిగినట్లు పరీక్షల్లో తేలింది. దీంతో అతడికి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో ఉంచి చికిత్స అందించారు. దాదాపు నాలుగు రోజుల తర్వాత శ్రేయస్ అయ్యర్ అస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. అయ్యర్ ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు.
చదవండి: మహ్మద్ షమీ వర్సెస్ అగార్కర్.. ఎవరు గొప్ప బౌలర్?


