మ‌హ్మ‌ద్‌ ష‌మీ వ‌ర్సెస్ అగార్క‌ర్‌.. ఎవ‌రు గొప్ప బౌల‌ర్‌? | Mohammad Shami vs Ajit Agarkarcomparing their stats after 108 ODIs | Sakshi
Sakshi News home page

మ‌హ్మ‌ద్‌ ష‌మీ వ‌ర్సెస్ అగార్క‌ర్‌.. ఎవ‌రు గొప్ప బౌల‌ర్‌?

Nov 11 2025 11:19 AM | Updated on Nov 11 2025 12:15 PM

Mohammad Shami vs Ajit Agarkarcomparing their stats after 108 ODIs

టీమిండియా స్పీడ్ స్టార్ మహ్మద్ షమీ అంతర్జాతీయ కెరీర్ తుది దశకు చేరుకుందా?  జాతీయ జ‌ట్టులోకి అత‌డి రీ ఎంట్రీ అసాధ్యమేనా..? అంటే అవునానే స‌మాధానం ఎక్కువ‌గా వినిపిస్తోంది. ష‌మీ గ‌త ఎనిమిది నెల‌ల నుంచి జాతీయ జ‌ట్టుకు దూరంగా ఉంటున్నాడు.

ఈ ఏడాది ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025 త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌సారి కూడా భారత జెర్సీలో ష‌మీ క‌న్పించ‌లేదు. టెస్టుల్లో అయితే అత‌డు చివ‌ర‌గా 2023లో ఆస్ట్రేలియాపై ఆడాడు. షమీ ప్ర‌స్తుతం దేశ‌వాళీ క్రికెట్‌లో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్న‌ప్ప‌టికి సెల‌క్ట‌ర్లు మాత్రం అత‌డిని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవడం లేదు. 

ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆడిన షమీ..  91 ఓవర్లు బౌలింగ్ చేసి 15 వికెట్లు పడగొట్టాడు. లాంగ్ స్పెల్స్ బౌలింగ్ చేస్తూ తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు. దీంతో సౌతాఫ్రికాతో రెండు మ్యాచ్‌ల మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఈ స్పీడ్ స్టార్‌ను సెలక్టర్లు ఎంపిక చేస్తారని అంతా భావించారు. కానీ సెలక్టర్లు మాత్రం మరోసారి షమీకి నిరాశే మిగిల్చారు.

షమీ× అగార్క‌ర్‌
అయితే తనను సెలెక్టర్లు పట్టించుకోవడం లేదని, కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదని షమీ ఇటీవల బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు.  రంజీల్లో ఆడే వాడిని.. వన్డేలు ఆడలేనా? అని ప్రశ్నించాడు. ష‌మీ వ్యాఖ్య‌ల‌పై అగార్క‌ర్ కూడా స్పందించాడు. షమీకి ఫిట్‌నెస్ ప్రధాన సమస్యగా ఉందని అందుకే అత‌డిని ఎంపిక చేయ‌డం లేద‌ని చీఫ్ సెల‌క్ట‌ర్ చెప్పుకొచ్చాడు. షమీ త‌న ముందు ఉండింటే స‌మాధ‌న‌ము చెప్పేవాడ‌ని అని అగార్క‌ర్ అన్నాడు.

అయితే తాజాగా బీసీసీఐ సీనియర్ అధి‍కారి ఒకరు కూడా షమీ ఆరోపణలపై స్పందించారు. "సెలక్టర్లు, బీసీసీఐ సెంటర్ ఆఫ్​ ఎక్స్‌‌‌‌‌‌‌‌లెన్స్‌‌‌‌‌‌‌‌ సపోర్ట్ స్టాఫ్ షమీతో నిరంతరం టచ్‌‌‌‌‌‌‌‌లోనే ఉన్నారు. ఇంగ్లండ్ టూర్‌లో కొన్ని మ్యాచ్‌ల్లో బుమ్రాకు విశ్రాంతి ఇచ్చినందున షమీ లాంటి సీనియర్ బౌలర్‌ను జట్టులోకి తీసుకోవాలని భావించాము.

ఓ సీనియర్ సెలెక్టర్ అతడితో చర్చలు జరిపారు. ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో కాంటర్‌‌‌‌‌‌‌‌బరీ లేదా నార్తాంప్టన్‌‌‌‌‌‌‌‌లో జరిగే ఇండియా-ఎ మ్యాచ్ ఆడాలని కోరారు. షమీ సుదీర్ఘ స్పెల్స్ వేయగలడా లేడా అని సెలక్టర్లు పరీక్షించాలి అనుకున్నారు. కానీ షమీ మాత్రం సెలక్టర్ల ప్రతిపాదనను తిరష్కరించాడు. అగార్క‌ర్ స‌రైన నిర్ణ‌యాలు తీసుకుంటున్నాడ‌ని "సదరు బోర్డు అధికారి పేర్కొన్నారు.

ఎవరు గొప్ప..?
ఈ నేపథ్యంలో ష‌మీ, అగార్క‌ర్‌ల‌లో ఎవ‌రూ గొప్ప బౌల‌ర్ అన్న చ‌ర్చ క్రికెట్ వ‌ర్గాల్లో న‌డుస్తోంది. అగార్కర్  భారత క్రికెట్‌లో తనంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ రైట్ ఆర్మ్ పేసర్ ముఖ్యంగా వన్డేల్లో ఎన్నో మ్యాచ్ విన్నింగ్ స్పెల్స్  బౌలింగ్ చేశాడు.

ఈ ఢిల్లీ బాయ్‌ త‌న కెరీర్‌లో మొత్తంగా 191 వ‌న్డేలు ఆడి 288 వికెట్లు ప‌డ‌గొట్టాడు. వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో (అనిల్ కుంబ్లే, జవగళ్ శ్రీనాథ్ తర్వాత) మూడో స్థానంలో అగార్క‌ర్ ఉన్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 50 వికెట్ల మైలు రాయిని అందుకున్న బౌల‌ర్‌గా కూడా అజిత్ చానాళ్ల‌పాటు కొన‌సాగాడు. 

అత‌డు కేవ‌లం 23 మ్యాచ్‌ల‌లోనూ ఈ రికార్డును అందుకున్నాడు. చాలా మ్యాచ్‌ల‌లో బ్యాట్‌తో కూడా అజిత్ స‌త్తాచాటాడు. వ‌న్డేల్లో భార‌త్ త‌రపున‌ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ(కేవలం 21 బంతుల్లో)  సాధించిన రికార్డు ఇప్పటికీ అగార్కర్ పేరిటే ఉంది.

అదే విధంగా ప్ర‌తిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌పై అగార్క‌ర్ సాధించిన టెస్టు సెంచ‌రీ స‌గ‌టు క్రికెట్ అభిమాని ఎప్ప‌టికి మ‌ర్చిపోడు. దాదాపు 15 ఏళ్ల పాటు భార‌త జ‌ట్టు విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించిన‌ అగార్క‌ర్‌.. ఇప్పుడూ చీఫ్ సెల‌క్ట‌ర్‌గా త‌న సేవ‌ల‌ను అందిస్తున్నాడు.

ఇక ష‌మీ విషయానికి వ‌స్తే ఇప్ప‌టివ‌రకు 108 వ‌న్డేలు ఆడాడు. ష‌మీ పేరిట ప్ర‌స్తుతం 206 వికెట్లు ఉన్నాయి. అదే అగ‌ర్కార్ 108 వ‌న్డేల్లో 158 వికెట్లు మాత్ర‌మే సాధించాడు. ఇద్ద‌రూ మ‌ధ్య దాదాపుగా 48 వికెట్లు తేడా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే షమీ తిరిగి వన్డేల్లో ఆడుతాడన్నది అనుమానమే. ఒకవేళ రీ ఎంట్రీ ఇచ్చినా అగార్కర్‌ ఆడిన వన్డేలకు సంఖ్యకు దారిదాపుల్లోకి కూడా వెళ్లలేడు. 

షమీ ఇప్పటివరకు 108 వన్డేల మ్యాచ్‌ల ఆడగా అందులో భారత్ 69 విజయాలు సాధించిందంటే అతడి ట్రాక్ రికార్డు ఎలా ఉందో ఆర్ధం చేసుకోవచ్చు. ఈ 69 వన్డేల్లో అతడు 5.24 ఎకానమీ రేటుతో 150 వికెట్లు పడగొట్టాడు. అంతేకాకుండా ఐదు ఫైవ్ వికెట్ల హాల్స్‌, ఎనిమిది ఫోర్ వికెట్ల హాల్స్‌ను షమీ నమోదు చేశాడు.

అదే భారత్ ఓడిపోయిన 33 మ్యాచ్‌లలో షమీ  6.12 ఎకానమీ రేటుతో 47 మాత్రమే వికెట్లు పడగొట్టాడు. అంటే షమీ మెరుగైన ప్రదర్శన కనబరిచిన ప్రతీసారి భారత్ దాదాపుగా విజయం సాధించింది. అతడు విఫలమైన చోట టీమిండియా ఓటమి పాలైంది. వన్డే వరల్డ్‌కప్‌-2023లోనూ షమీ సంచలన ప్రదర్శన కనబరిచాడు. షమీ పేరిట టెస్టుల్లో కూడా 229 వికెట్లు ఉన్నాయి. అదే అగర్కార్ టెస్టుల్లో కేవలం 58 వికెట్లు మాత్రమే సాధించాడు.
చదవండి: అత‌డి రీ ఎంట్రీ తప్పనిసరి.. మూడు ఫార్మాట్ల‌లోనూ ఆడించాలి: గంగూలీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement