దక్షిణాఫ్రికాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లను సొంతం చేసుకున్న పాకిస్తాన్.. ఇప్పుడు స్వదేశంలో మరో కీలక పోరుకు సిద్దమైంది. సొంతగడ్డపై శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో పాక్ జట్టు తలపడనుంది. నవంబర్ 11న రావాల్పిండి వేదకగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.
అనంతరం శ్రీలంక-అఫ్గానిస్తాన్‌తో పాక్ ట్రై సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సిరీస్‌లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. దాదాపుగా సౌతాఫ్రికాతో ఆడిన వన్డే జట్టునే సెలక్టర్లు కొనసాగించారు. గత సిరీస్‌తో పోలిస్తే సెలక్టర్లు ఒకే ఒక మార్పు చేశారు.
జట్టు నుంచి మిడిలార్డర్ బ్యాటర్ హసన్ నవాజ్‌ను రిలీజ్ చేశారు. పాక్ దేశవాళీ టోర్నీ కైద్-ఎ-ఆజం ట్రోఫీలో నవాజ్ ఆడనున్నాడు. దీంతో అతడికి టీ20 జట్టులో కూడా చోటు దక్కలేదు. టీ20ల్లో అతడి స్ధానాన్ని స్టార్ ఓపెనర్ ఫఖార్ జమాన్‌తో భర్తీ చేశారు. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌కు జమాన్‌ను పక్కన పెట్టారు.
అయితే సఫారీలతో వన్డే సిరీస్‌లో ఆడిన జమాన్ మాత్రం దారుణ ప్రదర్శన కనబరిచాడు. అయినప్పటికి ఇప్పుడు వన్డే, టీ20 జట్టు రెండింటిలోనూ అతడికి చోటు దక్కడం గమనార్హం. సౌతాఫ్రికాతో కానీ వన్డే జట్టులోకి నవాజ్ స్ధానంలో ఎవరిని ఎంపిక చేయలేదు. మరోసారి స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌కు టీ20 జట్టులో చోటు దక్కలేదు.
శ్రీలంకతో వన్డేలకు పాక్ జట్టు: షాహీన్ షా ఆఫ్రిది (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, బాబర్ అజామ్, ఫహీమ్ అష్రఫ్, ఫైసల్ అక్రమ్, ఫఖర్ జమాన్, హారీస్ రవూఫ్, హసీబుల్లా, హుస్సేన్ తలత్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), మహ్మద్, వసీమ్ అగౌబ్, సలీమ్, సల్మాన్, సల్మాన్.
టీ20 ముక్కోణపు సిరీస్‌కు పాక్ జట్టు: సల్మాన్ అలీ అఘా (కెప్టెన్), అబ్దుల్ సమద్, అబ్రార్ అహ్మద్, బాబర్ అజామ్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, మహ్మద్ సల్మాన్ మీర్జా, నసీమ్ షా, సాహిబ్జాదా ఫర్హాన్,ఉస్మాన్ తారిఖ్


