
పాకిస్తాన్ పర్యటన నేపథ్యంలో సౌతాఫ్రికా క్రికెట్ (South Africa tour of Pakistan, 2025) జట్టుకు భారీ షాక్ తగిలింది. పాక్‌తో టెస్టు సిరీస్‌కు కెప్టెన్ తెంబా బవుమా (Temba Bavuma) దూరమయ్యాడు. పిక్కల్లో గాయం కారణంగా అతడు పాక్ టూర్‌కు అందుబాటులో ఉండటం లేదు.
కాగా గత కొంతకాలంగా ఫిట్‌నెస్ సమస్యలతో బాధపడుతున్న బవుమా.. ఇటీవల ఇంగ్లండ్ పర్యటనలో మరోసారి గాయపడ్డాడు. ఈ క్రమంలో ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్లు చెప్పారు. దీంతో పాక్ పర్యటనకు అతడు దూరమయ్యాడు.
వరల్డ్ చాంపియన్‌గా నిలిపాడు
ఫలితంగా సౌతాఫ్రికాకు భారీ షాక్ తగిలినట్లయింది. కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023- 2025 సీజన్‌లో బవుమా ఇటు బ్యాటర్‌గా.. అటు కెప్టెన్‌గా అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. అనూహ్య రీతిలో ప్రొటిస్ జట్టును ఫైనల్‌కు చేర్చిన అతడు.. ఏకంగా చాంపియన్‌గానూ నిలిపాడు. తద్వారా డబ్ల్యూటీసీ మూడో సీజన్ టైటిల్ సౌతాఫ్రికా సొంతమైంది.
బవుమా స్థానంలో అతడే
ఇక డబ్ల్యూటీసీ తాజా ఎడిషన్ (2025-27)లో వరల్డ్ చాంపియన్ సౌతాఫ్రికా తొలుత పాకిస్తాన్‌తో తలపడనుంది. అదే విధంగా పాక్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు కూడా ఆడనుంది. ఈ నేపథ్యంలో బవుమా గైర్హాజరీలో ప్రొటిస్ పరిమిత ఓవర్ల క్రికెట్ కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ టెస్టు జట్టును ముందుకు నడిపించనున్నాడు.
గుడ్ న్యూస్ ఏంటంటే
ఇక పాక్‌తో టీ20 సిరీస్‌లో డేవిడ్ మిల్లర్, వన్డేల్లో మాథ్యూ బ్రీట్జ్కే సౌతాఫ్రికాకు నాయకత్వం వహించనున్నారు. ఇదిలా ఉంటే.. వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డికాక్ తన వన్డే రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం సౌతాఫ్రికాకు సానుకూలాంశంగా పరిణమించింది.
వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా డికాక్.. యాభై ఓవర్ల ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే, తాజా సిరీస్‌తో అతడు తిరిగి వన్డేల్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇక అక్టోబరు 12- నవంబరు 8 వరకు సౌతాఫ్రికా క్రికెట్ జట్టు పాక్ పర్యటనలో రెండు టెస్టులు, మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.
పాకిస్తాన్‌తో టెస్టులకు సౌతాఫ్రికా జట్టు
ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డేవిడ్ బెడింగ్‌హామ్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, టోనీ డి జోర్జి, జుబేర్ హంజా, సైమన్ హార్మర్, మార్కో యాన్సెన్, కేశవ్ మహరాజ్* , వియాన్ ముల్డర్, సెనురాన్ ముత్తుసామి, కగిసో రబడ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, ప్రెనేలన్ సుబ్రేయన్, కైలీ వెరెన్నె.
పాకిస్తాన్‌తో టీ20లకు సౌతాఫ్రికా జట్టు
డేవిడ్ మిల్లర్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రీ బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, లుంగీ ఎన్గిడి, ఎన్కాబా పీటర్, లువాన్-డ్రే ప్రిటోరియస్, ఆండీలే సిమెలానే, లిజాడ్ విలియమ్స్.
పాకిస్తాన్‌తో వన్డేలకు సౌతాఫ్రికా జట్టు
మాథ్యూ బ్రీట్జ్కే (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రీ బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, జార్న్ ఫార్చూయిన్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, లుంగి ఎన్గిడి, ఎన్కాబా పీటర్, లువాన్-డ్రే ప్రిటోరియస్, సినెతెంబా కెషిలె.
చదవండి: ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్.. వైభవ్, వేదాంత్, అభిగ్యాన్ అదుర్స్