సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) సత్తా చాటాడు. కోల్‌కతా వేదికగా శనివారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా బ్యాట్‌తో, బాల్‌తో రాణించాడు.
భారత తొలి ఇన్నింగ్స్‌లో 45 బంతులు ఎదుర్కొన్న జడ్డూ.. మూడు ఫోర్ల సాయంతో 27 పరుగులు చేశాడు. అయితే, సైమన్ హార్మర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ కావడంతో ఈ లెఫ్లాండర్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఏదేమైనా భారత్ 189 పరుగుల మెరుగైన స్కోరు చేయడంలో జడ్డూ తన వంతు పాత్రను పోషించాడని చెప్పవచ్చు.
ఆకాశమే హద్దుగా
ఇక సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో ఎనిమిది ఓవర్ల బౌల్ చేసి పదమూడు పరుగులు మాత్రమే ఇచ్చిన జడ్డూ.. వికెట్ మాత్రం తీయలేకపోయాడు. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈడెన్ గార్డెన్స్‌లో శనివారం నాటి రెండో రోజు ఆటలో జడ్డూ 13 ఓవర్లు బౌలింగ్ చేసి 29 పరుగులు మాత్రమే ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.
భారత తొలి క్రికెటర్‌గా రికార్డు
ప్రొటిస్ బ్యాటర్లు ఐడెన్ మార్క్రమ్ (4), వియాన్ ముల్దర్ (11), టోనీ డి జోర్జి (2) రూపంలో మూడు వికెట్ల తన ఖాతాలో వేసుకున్న జడ్డూ.. ట్రిస్టన్ స్టబ్స్ (5)ను కూడా వెనక్కి పంపించాడు. ఈ క్రమంలో రవీంద్ర జడేజా సరికొత్త చరిత్ర సృష్టించాడు. సొంతగడ్డపై టెస్టుల్లో 2 వేల పరుగులు పూర్తి చేసుకోవడంతో పాటు 250 వికెట్ల క్లబ్‌లో చేరిన భారత తొలి క్రికెటర్‌గా రికార్డు సాధించాడు.
ప్రపంచంలో రెండో ప్లేయర్‌గా
అంతేకాదు.. ఓవరాల్‌గా ప్రపంచంలో స్టువర్ట్ బ్రాడ్ తర్వాత ఈ ఘనత సాధించిన (స్వదేశంలో 2000+ 250 వికెట్లు) రెండో ఆటగాడిగా జడేజా నిలిచాడు. అదే విధంగా.. టెస్టుల్లో ఓవరాల్‌గా నాలుగు వేల పరుగుల మైలురాయిని చేరుకోవడంతో పాటు 300కి పైగా వికెట్లు తీసిన నాలుగో ప్లేయర్‌గా ఫీట్ నమోదు చేశాడు. ఈ జాబితాలో ఇయాన్ బోతమ్, కపిల్ దేవ్, డానియెల్ వెటోరి జడ్డూ కంటే ముందు వరుసలో ఉన్నారు.
కాగా భారత్‌తో తొలి టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 159 పరుగులకు ఆలౌట్ అయింది. ఇందుకు బదులుగా టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులు సాధించింది. ముప్పై పరుగుల ఆధిక్యం సంపాదించింది.
ఈ క్రమంలో శనివారం నాటి రెండో రోజు ఆటలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టింది సౌతాఫ్రికా. ఆట పూర్తయ్యేసమయానికి 35 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 93 పరుగులు చేసింది. తద్వారా టీమిండియా కంటే 63 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
చదవండి: అందుకే రాజస్తాన్ రాయల్స్‌ను వీడాను: సంజూ శాంసన్ పోస్ట్ వైరల్


