
ఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. విండీస్ విధించిన 121 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి చేధించింది. దీంతో రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 తేడాతో గిల్ సేన క్లీన్ స్వీప్ చేసింది.
63/1 ఓవర్ నైట్ స్కోర్‌తో ఆఖరి రోజు ఆటను ప్రారంభించిన భారత్ సాయిసుదర్శన్(39), కెప్టెన్ గిల్(13) వికెట్‌ను కోల్పోయింది. స్టార్ బ్యాటర్లు కేఎల్ రాహుల్(58 నాటౌట్), ధ్రువ్ జురెల్(6 నాటౌట్) మరో వికెట్ కోల్పోకుండా జాగ్రత్తగా ఆడి మ్యాచ్ ఫినిష్ చేశారు. విండీస్ బౌలర్లలో కెప్టెన్ ఛేజ్ రెండు, వారికన్ ఓ వికెట్ సాధించారు. కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు ఇదే తొలి సిరీస్ విజయం.

సెంచరీలతో మెరిసిన హోప్, క్యాంప్‌బెల్..
కాగా ఈ మ్యాచ్‌లో భారత్ ఇన్నింగ్స్ తేడాతో గెలుస్తుందని అంతా భావించారు. కానీ ఫాల్ ఆన్ ఆడిన వెస్టిండీస్.. సెకెండ్ ఇన్నింగ్స్‌లో అద్బుతమైన పోరాటం కనబరిచింది. ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ (199 బంతుల్లో 115; 12 ఫోర్లు, 3 సిక్స్‌లు), షై హోప్ (214 బంతుల్లో 103; 12 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో కదం తొక్కారు.
దీంతో కరేబియన్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 390 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓ దశలో భారత్ ముందు మెరుగైన టార్గెట్‌ను ఉంచేలా కన్పించిన విండీస్ బ్యాటర్లు.. మరోసారి కుల్దీప్ యాదవ్ స్పిన్ మయాజాలానికి చిత్తు అయ్యారు. వరుస క్రమంలో వికెట్లు కోల్పోయి ఇన్నింగ్స్‌ను ముగించింది.
అంతకుముందు టీమిండియా తమ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 518 రన్స్ స్కోరు చేసి డిక్లేర్ చేయగా.. వెస్టిండీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 248 రన్స్ చేసి ఫాలోఆన్ ఆడింది. అంతకుముందు టీమిండియా తమ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 518 రన్స్ స్కోరు చేసి డిక్లేర్ చేయగా.. వెస్టిండీస్ తన తొలి ఇన్నింగ్స్‌లో 248 రన్స్ చేసి ఫాలోఆన్ ఆడింది.
భారత బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ (175), శుభ్‌మన్ గిల్(129) అద్బుతమైన సెంచరీలతో చెలరేగారు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 8 వికెట్ల పడగొట్టాడు. అతడితో రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా కూడా రాణించారు.
చదవండి: అర్జున్ టెండూల్కర్‌కు గుడ్ న్యూస్.. జట్టులో చోటిచ్చిన సెలక్టర్లు