
ముంబై ఇండియన్స్ జెర్సీలో అర్జున్
రంజీ ట్రోఫీ 2025-26 సీజన్ కోసం గోవా క్రికెట్ అసోయేషిన్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు చోటు దక్కింది. దాదాపు ఏడాది తర్వాత మళ్లీ మైదానంలో అడుగు పెట్టేందుకు అర్జున్ సిద్దమయ్యాడు. అతడు చివరిసారిగా దేశీయ స్థాయిలో డిసెంబర్ 2024లో ఆడాడు.
ఆ తర్వాత ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టులో భాగమైనప్పటికి.. ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అర్జున్ తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ను గతేడాది నవంబర్‌లో అరుణాచల్ ప్రదేశ్‌తో ఆడాడు.
ముంబై టూ గోవా..
కాగా 2022-23 దేశవాళీ క్రికెట్ సీజన్‌కు ముందు ముంబై నుంచి గోవాకు తన మకాంను మార్చిన అర్జున్.. అప్పటి నుంచి మూడు ఫార్మాట్లలోనూ ఆ జట్టు తరపున ఆడుతున్నాడు. ఇప్పటివరకు 17 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 37 వికెట్లు, 532 పరుగులు సాధించాడు. తన రంజీ ట్రోఫీ కెరీర్ తొలి మ్యాచ్‌లోనే రాజస్థాన్‌పై అద్భుత శతకం సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు.
అర్జున్ లిస్ట్ ఎ క్రికెట్‌లో 25, టీ20ల్లో 27 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ (ఎంఐ) తరపున అతను ఐదు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. రాబోయో రంజీ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన చేసి జాతీయ సెలక్టర్ల దృష్టిలో పడాలని జూనియర్ టెండూల్కర్ భావిస్తున్నాడు.
గోవా 2025/26 సీజన్ ఎలైట్ గ్రూప్‌లో భాగంగా ఉంది. అక్టోబర్ 15న తమ తొలి మ్యాచ్‌లో చండీగఢ్‌తో గోవా తలపడనుంది. ఆ తర్వాత మ్యాచ్‌లలో కర్ణాటక, పంజాబ్, మధ్యప్రదేశ్, సౌరాష్ట్ర, మహారాష్ట్ర, కేరళతో ఆడనున్నాడు. ఈ టోర్నీలో గోవా క్రికెట్ జట్టుకు దీప్రాజ్ గావోంకర్ నాయకత్వం వహిస్తాడు. అదేవిదంగా కొత్త సీజన్‌కు ముందు ఢిల్లీ నుంచి గోవాకు తన మకాంను మార్చుకున్న స్టార్ ఆల్‌రౌండర్ లలిత్ యాదవ్‌కు కూడా ఈ జట్టులో చోటు దక్కింది.
గోవా జట్టు: దీప్‌రాజ్ గాంకర్ (కెప్టెన్), లలిత్ యాదవ్ (వైస్ కెప్టెన్), సుయాష్ ప్రభుదేశాయ్, మంథన్ ఖుత్కర్, దర్శన్ మిషాల్, మోహిత్ రెడ్కర్, సమర్ దుబాషి, హేరంబ్ పరబ్, వికాస్ సింగ్, విషెస్ ప్రభుదేశాయ్, ఇషాన్‌క్ బఖార్, కశ్యాంత్ గడేకర్, రాజ్‌షేన్‌డ్ గడేకర్ అభినవ్ తేజ్రానా.
చదవండి: IND vs AUS: టీమిండియాతో తొలి వన్డే.. ఆస్ట్రేలియాకు ఊహించని షాక్