
సౌతాఫ్రికా-పాకిస్తాన్ మధ్య రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సమయం అసన్నమైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు ఇరు జట్ల మధ్య తొలి టెస్టు లహోర్ వేదికగా ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ క్రమంలో లహోర్ టెస్టుకు పాకిస్తాన్ క్రికెట్ తమ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది.
ఈ మ్యాచ్‌తో 38 ఏళ్ల లెఫ్ట్‌ఆర్మ్ స్పిన్నర్ ఆసిఫ్ అఫ్రిది టెస్టు అరంగేట్రం చేయనున్నాడు. కాగా 2022లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు రుజువు కావడంతో రెండేళ్ల నిషేధం ఎదుర్కొన్నాడు. బుకీలు తనను సంప్రదించినప్పటికి పీసీబీ ఆంటీ-కరప్షన్ విభాగానికి సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ఆసిఫ్‌పై అనర్హత వేటు పడింది.
గతేడాది అతడిపై పీసీబీ నిషేధాన్ని ఎత్తివేసింది. ఆ తర్వాత దేశవాళీ క్రికెట్‌లో ఆడిన అఫ్రిది అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతడికి సౌతాఫ్రికాతో టెస్టులకు సెలక్టర్లు ఎంపిక చేశారు. అతడిని జట్టులోకి తీసుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.
అయినపప్పటికి టీమ్ మెనెజ్‌మెంట్ ఏకంగా తుది జట్టులోనే చోటు ఇచ్చి అందరిని ఆశ్చర్చపరిచింది. అసిఫ్ అఫ్రిది 39 ఏళ్ల మరో స్పిన్నర్ నమాన్ అలీతో బంతిని పంచుకోనున్నాడు. అదేవిధంగా ఓపెనర్ ఇమామ్ ఉల్ హాక్ టెస్టు జట్టులోకి తిరిగొచ్చాడు.
ఆసియాకప్-2025కు దూరమైన స్టార్ ప్లేయర్లు బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లకు కూడా ఈ తుది జట్టులో చోటు దక్కింది. ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో షాహీన్ షా అఫ్రిది, హసన్ అలీ పాక్ జట్టుకు కీలకం కానున్నారు. కాగా ఈ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ 2025-27లో భాగంగా జరగనుంది.
సౌతాఫ్రికాతో తొలి టెస్టుకు పాక్ తుది జట్టు
ఇమామ్ ఉల్ హక్, అబ్దుల్లా షఫీక్, షాన్ మసూద్ (కెప్టెన్), బాబర్ ఆజం, సౌద్ షకీల్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సల్మాన్ అలీ అఘా, షాహీన్ షా ఆఫ్రిది, హసన్ అలీ, నౌమన్ అలీ, ఆసిఫ్ అఫ్రిది.