
వెస్టిండీస్‌తో రెండో టెస్టు (IND vs WI)లో టీమిండియా వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (Sai Sudharsan)కు చేదు అనుభవం ఎదురైంది. అద్భుతమైన ఇన్నింగ్స్‌తో సెంచరీ దిశగా పయనించిన ఈ ఎడమచేతి వాటం ఆటగాడు.. తొలి టెస్టు శతకానికి పదమూడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. దీంతో సాయితో పాటు అతడి అభిమానుల హార్ట్‌బ్రేక్ అయింది.

జైస్వాల్ భారీ శతకం
భారత్- వెస్టిండీస్ మధ్య ఢిల్లీ వేదికగా శుక్రవారం రెండో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ఓపెనర్ కేఎల్ రాహుల్ 38 పరుగులకే నిష్క్రమించగా.. మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) భారీ శతకంతో మెరిశాడు. అతడికి జతగా వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ కూడా అదరగొట్టాడు.

193 పరుగుల భాగస్వామ్యం
ఈ ఇద్దరు లెఫ్టాండర్లు కలిసి రెండో వికెట్‌కు 193 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో 165 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో 87 పరుగులు రాబట్టిన సాయి సుదర్శన్.. విండీస్ స్పిన్నర్ జొమెల్ వారికన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఫలితంగా సాయి టెస్టుల్లో తొలి సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.

ఇక తొలిరోజు 83 ఓవర్ల ఆట ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో వారికన్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. జైసూ 151, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 15 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా తొలి మ్యాచ్ సందర్భంగా సాయి సుదర్శన్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఈ చెన్నై చిన్నోడు 234 పరుగులు సాధించాడు.
చదవండి: దిగ్గజాల సరసన యశస్వి జైస్వాల్.. భారత రెండో బ్యాటర్‌గా..
At his clinical best! 🧿#SaiSudharsan makes batting look easy as he brings up his half-century! 🙌
Catch the LIVE action 👉 https://t.co/8pkqpa9s4Z#INDvWI 👉 2nd Test, Day 1 | Live Now on Star Sports & JioHotstar pic.twitter.com/yhYag1I0if— Star Sports (@StarSportsIndia) October 10, 2025