
ఆసియాకప్-2025 అనంతరం తొలి సవాల్‌కు టీమిండియా సిద్దమైంది. స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భారత్ తలపడనుంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 2 నుంచి ప్రారంభం కానుంది.
ఈ మ్యాచ్‌కు ముందు గిల్ సేనకు భారీ షాక్ తగిలింది. మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయపడ్డాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రకారం.. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా సుందర్ చేతి వేలికి గాయమైనట్లు సమాచారం.
దీంతో అతడు ఫీల్డింగ్ డ్రిల్స్‌కు దూరంగా ఉన్నాడు. గాయం తర్వాత సుందర్ బౌలింగ్ ప్రాక్టీస్ చేసినప్పటికి కాస్త అసౌకర్యంగా కన్పించినట్లు సదరు రిపోర్ట్ పేర్కొంది. అతడి చేతి వేలికి బీసీసీ వైద్య బృందం టేపింగ్ చేశారు. అయితే అతడి గాయం తీవ్రతపై ఇప్పటివరకు బీసీసీఐ మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు.
కెప్టెన్ గిల్ మాత్రం సుందర్ వద్దకు వెళ్లి గాయం తీవ్రత గురుంచి తెలుసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ సుందర్ గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైతే భారత్‌కు గట్టి ఎదురు దెబ్బే అనే చెప్పాలి. ఈ తమిళనాడు స్పిన్నర్ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు.
ఇంగ్లండ్ పర్యటనలో ఆల్‌రౌండ్ షోతో సుందర్ అదరగొట్టాడు. ఇప్పుడు వెస్టిండీస్ సిరీస్‌లో కూడా అతడు టీమిండియాకు కీలకం కానున్నాడు. ఒకవేళ మ్యాచ్ సమయానికి అతడి ఫిట్‌గా లేకపోతే అక్షర్ పటేల్ తుది జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
వెస్టిండీస్ సిరీస్‌కు భారత జట్టు
శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా , వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్ జగదీశన్ , మహ్మద్. సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్
చదవండి: ట్రోఫీ కావాలంటే నా ఆఫీస్‌కు వచ్చి తీసుకో.. భారత కెప్టెన్‌కు నఖ్వీ షరతు