షాకిచ్చిన ఐర్లాండ్‌.. తొలి టీ20లో టీమిండియా ఓటమి | Ireland Vs India 1st T20 Match Live Updates And Highlights | Sakshi
Sakshi News home page

షాకిచ్చిన ఐర్లాండ్‌.. తొలి టీ20లో టీమిండియా ఓటమి

Jun 26 2026 5:33 PM | Updated on Jun 26 2026 9:37 PM

Ireland Vs India 1st T20 Match Live Updates And Highlights

బెల్‌ఫాస్ట్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియాకు ఐర్లాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 18.5 ఓవర్లలో 148 పరుగులకు ఆలౌటైంది. ఫలితంగా ఐర్లాండ్ తొలి టీ20లో 34 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.

👉 ఐర్లాండ్‌తో తొలి టీ20లో టీమిండియా ఓటమి దిశగా పయనిస్తోంది. అక్షర్‌ పటేల్‌ (15) గెరాత్‌ డెలానీ బౌలింగ్‌లో వెనుదిరగడంతో ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. టీమిండియా గెలవాలంటే 18 బంతుల్లో 45 పరుగులు అవసరం. 

👉 25 పరుగులు చేసిన శివమ్‌ దూబే జై మూండ్రా బౌలింగ్‌లో కాట్‌ అండ్‌ బౌల్డ్‌గా వెనుదిరగడంతో టీమిండియా 135 పరుగుల వద్ద ఏడో వికెట్‌ కోల్పోయి కష్టాల్లో పడింది.

👉ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో పడింది. వాషింగ్టన్‌ సుందర్‌ (9) రూపంలో టీమిండియా ఆరో వికెట్‌ కోల్పోయింది. అంతకముందు ఆదుకుంటాడునుకున్న తిలక్‌ వర్మ (19) వెనుదిరగడంతో టీమిండియా 90 పరుగుల వద్ద ఐదో వికెట్‌ కోల్పోయింది. 14 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ 6 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది.

అభిషేక్‌ (50) ఔట్‌
టీమిండియా ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ (50) అర్ధశతకం సాధించిన వెంటనే వెనుదిరిగాడు. మెక్‌కార్తీ బౌలింగ్‌లో మాథ్యూ హంపెరీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే అభిషేక్‌ 19 బంతుల్లో హాఫ్‌ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం టీమిండియా నాలుగు వికెట్ల నష్టానికి 80 పరుగులు చేసింది.

అయ్యర్‌ విఫలం.. మూడో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా తడబడుతోంది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (3) మాట్‌ హాలండ్‌ బౌలింగ్‌లో జార్జ్‌ డాక్రెల్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరగడంతో 60 పరుగుల వ ద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. అంతకముందు సంజూ శాంసన్‌ (5), ఇషాన్‌ కిషన్‌ (1) విఫలమయ్యారు.

టీమిండియా టార్గెట్ 183 పరుగులు
బెల్‌ఫాస్ట్ వేదికగా జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్ జట్టు టీమిండియా ముందు మంచి టార్గెట్‌నే నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కెప్టెన్ లోర్కాన్ టక్కర్ (50) అర్ధసెంచరీతో రాణించగా, గారెత్ డెలానీ (32 బంతుల్లో 49) మెరిశాడు. భారత బౌలర్లలో హర్షిత్ రానా మూడు వికెట్లు తీయగా, అక్షర్‌పటేల్‌, అర్ష్‌దీప్ సింగ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకముందు జార్జ్‌ డాక్రెల్‌ (19) రూపంలో ఐర్లాండ్‌ ఆరో వికెట్‌ కోల్పోయింది. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో డాక్రెల్‌ వెనుదిరిగాడు.

లోర్కాన్‌ టక్కర్‌ (50) ఔట్‌
అర్ధసెంచరీ సాధించిన వెంటనే కెప్టెన్‌ లోర్కాన్‌ టక్కర్‌ (50) హర్షిత్‌ రానా బౌలింగ్‌లో తిలక్‌ వర్మకు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా హర్షిత్‌ రానాకు ఇది మూడో వికెట్‌ కావడం విశేషం. ప్రస్తుతం 15 ఓవర్లు ముగిసేసరికి ఐర్లాండ్‌ 5 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. 

లోర్కాన్ ట‌క్క‌ర్ ఫిఫ్టీ
ఐర్లాండ్ కెప్టెన్ లోర్కాన్ ట‌క్క‌ర్ ఫిఫ్టీ సాధించ‌డంతో ఆ జ‌ట్టు కాస్త కోలుకుంది. 14 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ఐర్లాండ్ 4 వికెట్లు న‌ష్ట‌పోయి 111 ప‌రుగులు చేసింది. ట‌క్క‌ర్ 35 బంతుల్లో ఫిఫ్టీ మార్క్ సాధించాడు. గారెత్ డెలానీ (13) అత‌డికి స‌హ‌క‌రిస్తున్నాడు.

👉13 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ఐర్లాండ్ జ‌ట్టు 4 వికెట్లు కోల్పోయి 102 ప‌రుగులు చేసింది. లోర్కాన్ ట‌క్క‌ర్ (43), గారెత్ డెలానీ (12) క్రీజులో ఉన్నారు.

నాలుగో వికెట్‌ డౌన్‌
8 ఓవ‌ర్లు ముగిసేస‌రికి ఐర్లాండ్ 4 వికెట్ల న‌ష్టానికి 57 ప‌రుగులు చేసింది. కెప్టెన్ లోర్కాన్ ట‌క్క‌ర్ (10), గ‌రెత్ డిలేని (1) ప‌రుగుతో ఆడుతున్నారు. శివ‌మ్ దూబే బౌలింగ్‌లో 15 ప‌రుగులు చేసిన బెంజ‌మిన్ కాలిట్జ్ ప్ర‌సిధ్ క్రిష్ణ‌కు క్యాచ్ ఇచ్చి వెదనుదిరగడంతో నాలుగో వికెట్ కోల్పోయింది.

మూడో వికెట్‌ డౌన్‌
30 పరుగుల వద్ద ఐర్లాండ్‌ మూడో వికెట్‌ కోల్పోయింది. హర్షిత్‌ రానా బౌలింగ్‌లో 17 పరుగులు చేసిన టిమ్‌ టెక్టర్‌ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. 

రెండు వికెట్లు  కోల్పోయిన ఐర్లాండ్‌
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌కు టీమిండియా బౌలర్లు చుక్కులు చూపిస్తున్నారు. 25 పరుగుల వద్ద ఐర్లాండ్ రెండో వికెట్ కోల్పోయింది. అర్ష్‌దీప్ బౌలింగ్‌లో హారీ టెక్టర్ డకౌట్ అయ్యాడు. అంతకముందు హర్షిత్ రానా బౌలింగ్‌లో ఓపెనర్ రాస్ అడైర్ (12) కీపర్ శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

బెల్‌ఫాస్ట్ వేదికగా జరుగుతున్న తొలి టీ20లో భారత్, ఐర్లాండ్ తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన టీమిండియా బౌలింగ్‌ ఎంచుకుంది. ఇరుజట్ల మధ్య ఇప్పటివరకు 8 టీ20 మ్యాచ్‌లు జరిగితే అన్నింటిలోనూ టీమిండియానే విజయం సాధించడం విశేషం. అయితే ఈ మ్యాచ్‌లో వైభవ్‌ సూర్యవంశీకి చోటు దక్కలేదు. టైం వచ్చినప్పుడు వైభవ్‌ జట్టులోకి వస్తాడని కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ పేర్కొన్నాడు.

తుది జట్లు
టీమిండియా: అభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్‌ కీపర్‌), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్‌), తిలక్ వర్మ, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్‌ సింగ్, ప్రసిద్ధ కృష్ణ

ఐర్లాండ్‌: టిమ్ టెక్టర్, రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్(వి/సి), బెంజమిన్ కాలిట్జ్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, లియామ్ మెక్‌కార్తీ, మాథ్యూ హంఫ్రీస్, జై మూండ్రా, మాథ్యూ హోలార్డ్

టీ20 ప్రపంచకప్‌లో రెండోసారి విజేతగా నిలిచిన తర్వాత భారత జట్టు తమ తొలి అంతర్జాతీయ టి20 మ్యాచ్‌కు సిద్ధమైంది. వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్టులోనే లేని శ్రేయస్‌ అయ్యర్‌... ఐపీఎల్‌లో కనబర్చిన నాయకత్వ ప్రదర్శనతో ఇప్పుడు తొలిసారి భారత టి20 జట్టుకు సారథిగా బరిలోకి దిగుతున్నాడు. మరోవైపు గతంలో రెండు మ్యాచ్‌లలో తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన లోర్కాన్‌ టకర్‌ కూడా ఇప్పుడు పూర్తి స్థాయిలో ఐర్లాండ్‌ కెప్టెన్‌గా బాధ్యతలు చేపడుతున్నాడు. 

ఐర్లాండ్‌తో మ్యాచ్ అంటే ఫలితం గురించి ఆలోచించాల్సిన అసవరం కూడా లేదు. సంజూ సామ్సన్, అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ల విధ్వంసకర ఆటపై కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఐర్లాండ్‌తో తొలి టి20 మ్యాచ్‌ అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. దానికి ఒకే ఒక్కడు కారణం. 15 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ భారత సీనియర్‌ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేస్తాడా అనేదే ఇప్పుడు చర్చనీయాంశం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement