శ్రేయస్ అయ్యర్ (PC: BCCI)
టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. పసికూనలా భావించే ఐర్లాండ్ చేతిలో భారత జట్టు అనూహ్య రీతిలో ఓడిపోయింది. బెల్‌ఫాస్ట్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ సేన 34 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో పరాజయం పాలైంది.
టక్కర్ అర్ధ శతకం
ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టాపార్డర్‌ను కుదేలు చేసి శుభారంభం అందుకున్నా.. తర్వాత దానిని కొనసాగించలేకపోయింది. ఐరిష్ జట్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన లోర్కాన్ టక్కర్ మెరుపు అర్ధ శతకం (38 బంతుల్లో 50)తో ఇన్నింగ్స్ చక్కదిద్దగా.. గెరాత్ డెలనీ (50) కూడా రాణించాడు.
ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐర్లాండ్ తొమ్మిది వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా మూడు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలా రెండు.. శివం దూబే ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమింఇయా 18.5 ఓవర్లలో కేవలం 148 పరుగులు చేసి ఆలౌట్ అయింది.
అభిషేక్ ఒక్కడే..
ఓపెనర్ అభిషేక్ శర్మ (49) చెలరేగినా మిగతా వారి నుంచి అతడికి సహకారం అందలేదు. లోయర్ ఆర్డర్‌లో శివం దూబే (14 బంతుల్లో 25) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఐర్లాండ్ చేతిలో టీమిండియా తొలిసారి టీ20 మ్యాచ్‌లో పరాజయం నమోదు చేసింది.
ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ఇదొక గొప్ప ఆరంభం అని పేర్కొనడం గమనార్హం. ‘‘ఏదీ సులువుగా దొరకదు. కఠినంగా శ్రమిస్తేనే విజయం వరిస్తుంది. గతంలో ఏం జరిగిందన్న విషయంతో సంబంధం లేకుండా.. వర్తమానంలో జీవించడం ముఖ్యం.
The perfect start for the Men in Blue.💙
Harshit Rana strikes early, and Sanju Samson does the rest behind the stumps.👏
Watch #IREvIND LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV pic.twitter.com/esK99zoUwA— Sony Sports Network (@SonySportsNetwk) June 26, 2026
కెప్టెన్‌గా గొప్ప ఆరంభం
ప్రత్యర్థిని కట్టడి చేసే అవకాశం లభిస్తే.. ఆ క్షణాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ చేజారనీయకూడదు. నిజానికి ఆరంభంలో మా బౌలర్లు అత్యద్భుతంగా బౌలింగ్ చేశారు. వరుసగా వికెట్లు పడగొట్టి సత్తా చాటారు. కానీ ఆ తర్వాత మేము మొమెంటమ్ కోల్పోయాము.
ఇక్కడ వాళ్లు 140 పరుగులు చేయడం గొప్పే అనిపించింది. కానీ వారిని మేము కట్టడి చేయలేకపోయాము. ఏదేమైనా ఇక్కడ గొప్ప అనుభవం లభించింది. ఇలాంటి పిచ్‌లపై మరిన్ని మ్యాచ్‌లు ఆడాలి. అప్పుడే వికెట్‌పై మాకు ఓ అవగాహన వస్తుంది. ఏదేమైనా కెప్టెన్‌గా నాకిది గొప్ప ఆరంభమే’’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.
చదవండి: అందుకే వైభవ్‌ను ఆడించలేదు: శ్రేయస్
The moment history was made! 💚#BackingGreen | #IREvIND | #FáilteSolar pic.twitter.com/irDjNkEbK9
— Cricket Ireland (@cricketireland) June 26, 2026


