breaking news
Lorcan Tucker
-
మళ్లీ నగుబాటే...
బెల్ఫాస్ట్: ఐర్లాండ్ పర్యటనలో భారత పురుషుల క్రికెట్ జట్టు పూర్తిగా విఫలమైంది. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారీ స్కోరు ఛేదించలేక చతికిలబడిన టీమిండియా... రెండో మ్యాచ్‌లో చిన్న లక్ష్యాన్ని కూడా అందుకోలేకపోయింది. ఆదివారం జరిగిన రెండో టి20లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా ఒక పరుగు తేడాతో ఐర్లాండ్ చేతిలో ఓడింది. దీంతో ఐర్లాండ్ 2–0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఏ ఫార్మాట్లోనైనా ఐర్లాండ్‌కు టీమిండియాపై ఇదే తొలి సిరీస్ విజయం కాగా... టి20ల్లో వరుసగా 16 సిరీస్ విజయాల తర్వాత భారత్‌కు తొలి ఓటమి ఎదురైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్... నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. హ్యారీ టెక్టర్ (47 బంతుల్లో 53; 5 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్‌సెంచరీ సాధించగా... బెన్ కాలిట్జ్ (23 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 22 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా... శివమ్ దూబే రెండు వికెట్లు తీశాడు. అనంతరం లక్ష్యఛేదనలో టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు చేసింది. తిలక్ వర్మ (46 బంతుల్లో 55; 3 ఫోర్లు, 1 సిక్స్) ఒంటరి పోరాటం చేయగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. ఐర్లాండ్ బౌలర్లలో జై ముంద్రా, హోలార్డ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. ముంద్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’అవార్డులు దక్కాయి. ఈ మ్యాచ్ ద్వారా భారత యువ పేసర్ ప్రిన్స్ యాదవ్, ఆల్‌రౌండర్ సూర్యాన్ష్ షెడ్గే అంతర్జాతీయ టి20 అరంగేట్రం చేయగా... 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి మరోసారి ఎదురుచూపులు తప్పలేదు. ఐర్లాండ్ పర్యటనను ముగించుకున్న భారత్... బుధవారం నుంచి ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో పాల్గొననుంది. పారని అయ్యర్ పాచిక ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్ చేయగల సమర్థులు ఉన్నారనే నమ్మకంతో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ భారత జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ మాదిరిగానే ఈ సారి కూడా మన బౌలర్లు ఆరంభంలోనే వికెట్లు పడగొట్టారు. టిమ్ టెక్టర్ (5), రాస్ అడెయిర్ (16; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఎక్కువసేపు నిలవలేకపోవడంతో... 21 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ టకర్ (15) కూడా విఫలం కాగా... ఈ దశలో కాలిట్జ్ అండతో హ్యారీ టెక్టర్ కీలక పరుగులు సాధించాడు. చాపకింద నీరులా ముందుకు సాగిన టెక్టర్ జట్టుకు పోరాడే స్కోరు అందించి చివరి ఓవర్లో వెనుదిరిగాడు. టి20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన శ్రేయస్ అయ్యర్... తాజా ఐపీఎల్ అనంతరం అనూహ్య పరిణామాల మధ్య జట్టులోకి రావడంతో పాటు సారథ్య అవకాశం కూడా దక్కించుకున్నా మైదానంలో మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. పరుగులు నియంత్రించడంతో పాటు వికెట్లు తీస్తున్న హర్షిత్ రాణా కోటా పూర్తి చేయించలేకపోయిన శ్రేయస్... ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. అభిషేక్, సామ్సన్ గోల్డెన్ డక్... ఈ మ్యాచ్‌లోనూ ఛేదనకే మొగ్గు చూపిన టీమిండియాకు తొలి ఓవర్లోనే డబుల్ షాక్ తగిలింది. టి20 ప్రపంచకప్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’గా నిలిచిన సంజూ సామ్సన్ (0) ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ల ముందు దొరికిపోగా... నాలుగో బంతికి అభిషేక్ శర్మ (0) కూడా ‘గోల్డెన్ డకౌట్’గా వెనుదిరిగాడు. మూడో ఓవర్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (10) కూడా అవుటయ్యాడు. ఈ మూడు వికెట్లు జై ముంద్రా ఖాతాలోకే వెళ్లాయి. ఇషాన్ కిషన్ (12) రనౌట్ రూపంలో వెనుదిరిగడంతో భారత జట్టు 35/4తో పీకల్లోతూ కష్టాల్లో పడింది. గతంలోనూ ఇలాంటి పరిస్థితుల్లో జట్టును గెలిపించిన అనుభవం ఉన్న హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్మ ఇన్నింగ్స్ నడిపించే బాధ్యత తీసుకోగా... అతడికి అక్షర్ పటేల్ (14), శివమ్ దూబే (20) కాస్త సహకరించారు. దీంతో జట్టు గాడినపడ్డట్లే అనుకుంటుండగా... 18వ ఓవర్ రెండో బంతికి తిలక్ అవుటయ్యాడు. అరంగేట్ర ఆటగాడు సూర్యాన్ష్ (1) ప్రభావం చూపలేకపోగా... హర్షిత్ రాణా (10 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు ఓటమి అంతరాన్ని తగ్గించేందుకే పరిమితమయ్యాయి. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి ప్రిన్స్ (6 నాటౌట్) సిక్స్ కొట్టినా అప్పటికే ఆలస్యమైపోయింది.స్కోరు వివరాలు ఐర్లాండ్ ఇన్నింగ్స్: టిమ్ టెక్టర్ (సి) అభిషేక్ (బి) రాణా 5; అడెయిర్ (సి) తిలక్ (బి) అర్ష్ దీప్ 16; హ్యారీ టెక్టర్ (సి) ఇషాన్ (బి) ప్రిన్స్ 53; టకర్ (సి) ఇషాన్ (బి) ప్రిన్స్ 15; కాలిట్జ్ (సి) తిలక్ (బి) దూబే 37; డెలానీ (బి) దూబే 0; డాక్రెల్ (సి) అక్షర్ (బి) అర్ష్ దీప్ 19; మెక్‌కార్టీ (సి) ఇషాన్ (బి) ప్రిన్స్ 2; జై ముంద్రా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–17, 2–21, 3–48, 4–113, 5–113, 6–144, 7–153, 8–154. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–35–2; హర్షిత్ రాణా 3–0–17–1; ప్రిన్స్ 4–0–22–3; శివమ్ దూబే 3–0–25–2; సూర్యాన్ష్ 2–0–25–0; అక్షర్ 4–0–28–0. భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (ఎల్బీ) (బి) ముంద్రా 0; అభిషేక్ (సి) హోలార్డ్ (బి) ముంద్రా 0; ఇషాన్ (రనౌట్) 12; శ్రేయస్ (బి) ముంద్రా 10; తిలక్ (సి) మెక్‌కార్టీ (బి) హోలార్డ్ 55; అక్షర్ (సి) టకర్ (బి) హోలార్డ్ 14; శివమ్ దూబే (సి) డాక్రెల్ (బి) హంఫ్రీస్ 20; సూర్యాన్ష్ (సి) టిమ్ టెక్టర్ (బి) హోలార్డ్ 1; హర్షిత్ రాణా (సి) టిమ్ టెక్టర్ (బి) హ్యారీ టెక్టర్ 21; అర్ష్ దీప్ (నాటౌట్) 4; ప్రిన్స్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 153. వికెట్ల పతనం: 1–0, 2–1, 3–19, 4–35, 5–74, 6–109, 7–117, 8–121, 9–147. బౌలింగ్: జై ముంద్రా 4–0–32–2; హంఫ్రీస్ 4–0–28–1; హోలార్డ్ 4–0–26–3; మెక్‌కార్టీ 4–0–22–0; హ్యారీ టెక్టర్ 4–0–40–1. -
IND vs IRE: సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఐర్లాండ్
ఐర్లాండ్‌తో రెండో టీ20లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఫలితంగా బెల్ఫాస్ట్ వేదికగా ఐరిష్ జట్టు మరోసారి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 154 పరుగులు చేయగా... టీమిండియా లక్ష్య ఛేదనలో తేలిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కేవలం 153 పరుగులే చేసింది. ఫలితంగా ఒక్క పరుగు తేడాతో గెలుపొంది ఐర్లాండ్ సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది.***********************************************************************************ఎనిమిదో వికెట్ డౌన్17.5: హోలార్డ్ బౌలింగ్‌లో సూర్యాంశ్ (1) అవుట్.ఏడో వికెట్ కోల్పోయిన టీమిండియా17.2: హోలార్డ్ బౌలింగ్‌లో మెక్కార్తికి క్యాచ్ ఇచ్చి ఏడో వికెట్‌గా వెనుదిరిగిన తిలక్ వర్మ (55). విజయానికి 16 బంతుల్లో 38 పరుగులు కావాలి.ఆరో వికెట్ కోల్పోయిన టీమిండియా16.1: హంఫ్రేస్ బౌలింగ్‌లో శివం దూబే (20) అవుట్. స్కోరు: 109-6(16.1). తిలక్ 48 పరుగులతో ఉన్నాడు.15 ఓవర్లలో టీమిండియా స్కోరు: 104-5తిలక్ 46, శివం దూబే 17 పరుగులతో ఉన్నారు.ఐదో వికెట్ డౌన్11.3: మాథ్యూ హోలార్డ్ బౌలింగ్ టక్కర్‌కు క్యాచ్ ఇచ్చి ఐదో వికెట్‌గా వెనుదిరిగిన అక్షర్ పటేల్ (14). స్కోరు: 74-5(11.3)పది ఓవర్లలో టీమిండియా స్కోరుతిలక్ వర్మ 27 , అక్షర్ పటేల్ 12 పరుగులతో ఉన్నారు. విజయానికి 60 బంతుల్లో 89 పరుగులు కావాలి. వర్షం వల్ల ఆటకు అంతరాయంఎనిమిది ఓవర్ల తర్వాత ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. భారత్ విజయానికి 72 బంతుల్లో 101 పరుగులు కావాలి. చేతిలో ఆరు వికెట్లు ఉన్నాయి.ఎనిమిది ఓవర్లలో టీమిండియా స్కోరు: 54-4అక్షర్ పటేల్ ఏడు, తిలక్ వర్మ 21 పరుగులతో ఉన్నారు.పవర్ ప్లేలో టీమిండియా స్కోరు:41-4(6)తిలక్ 14, అక్షర్ పటేల్ 1 పరుగుతో ఉన్నారు. విజయానికి 84 బంతుల్లో 114 పరుగులు కావాలి.నాలుగో వికెట్ కోల్పోయిన భారత్4.5: జై ముంద్రా బౌలింగ్‌లో తిలక్ వర్మ బంతిని ఎదుర్కోగా.. ఇషాన్ (12) సింగిల్ కోసం వెళ్లి రనౌట్ అయ్యాడు. స్కోరు: 35-4(4.5). తిలక్ వర్మ 13 పరుగులతో ఉండగా.. అక్షర్ పటేల్ క్రీజులోకి వచ్చాడు.మూడో వికెట్ డౌన్2.4: జై ముంద్రా బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ (7 బంతుల్లో 10) బౌల్డ్. స్కోరు: 19-3(2.4). విజయానికి 136 పరుగులు కావాలి. తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (9*) క్రీజులో ఉన్నారు.సంజూ, అభిషేక్ శర్మ డకౌట్తొలి ఓవర్లోనే ఐర్లాండ్ లెఫ్టార్మ్ పేసర్, భారత సంతతి ఆటగాడు జై ముంద్రా సంచలనం సృష్టించాడు. తొలి బంతికే సంజూను గోల్డెన్ డకౌట్‌గా వెనక్కి పంపిన జై.. నాలుగో బంతికి అభిషేక్ శర్మను డకౌట్ చేశాడు. భారత్ స్కోరు: 1-2(0.5). ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ క్రీజులో ఉన్నారు.టీమిండియా టార్గెట్ ఎంతంటే?ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో రెండు వికెట్లు19.6: ఆఖరి బంతికి ఇషాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటైన మెక్కార్తి (2)19.4: ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన హ్యారీ టెక్టార్ (53).ఆరో వికెట్ డౌన్18.3: అర్ష్‌దీప్ బౌలింగ్‌లో అక్షర్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి ఆరో వికెట్‌గా వెనుదిరిగిన జార్జ్ డాక్రెల్ (14 బంతుల్లో 19). స్కోరు 144-6(18.4)👉 వర్షం అంతరాయం.. నాలుగు నిమిషాల్లో మళ్లీ మొదలైన మ్యాచ్ (7.28 PM)ఐదో వికెట్ డౌన్14.5: వరుసగా రెండో వికెట్ తీసిన శివం దూబే. డెలానీని బౌల్డ్ చేసి డకౌట్‌గా వెనక్కి పంపిన దూబే. స్కోరు: 113-5(14.5). జార్జ్ డాక్రెల్ క్రీజులోకి వచ్చాడు. పదిహేను ఓవర్లలో ఐర్లాండ్ స్కోరు: 114-5(15).నాలుగో వికెట్ కోల్పోయిన ఐర్లాండ్14.4: శివం దూబే బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్‌గా వెనుదిరిగిన బెంజమిన్ (23 బంతుల్లో 37). క్రీజులోకి డెలానీ. స్కోరు: 113-4(14.4). హ్యారీ టెక్టార్ 37 పరుగులతో ఉన్నాడు.సెంచరీ కొట్టిన ఐర్లాండ్13.2: హర్షిత్ రాణా బౌలింగ్ ఫోర్ బాదిన బెంజమిన్. సెంచరీ పూర్తి చేసుకున్న ఐర్లాండ్. 102-3(13.3).12 ఓవర్లలో ఐర్లాండ్ స్కోరు: 88-3బెంజమిన్ 18, హ్యారీ టెక్టార్ 32 పరుగులతో క్రీజులో ఉన్నారు.మూడో వికెట్ డౌన్7.3: ప్రిన్స్ యాదవ్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్‌కు క్యాచ్ ఇచ్చి మూడో వికెట్‌గా వెనుదిరిగిన లోర్కాన్ టక్కర్ (18 బంతుల్లో 15). ఐర్లాండ్ స్కోరు: 50-3 (8). బెంజమిన్, హ్యారీ టెక్టార్ క్రీజులో ఉన్నారు.రెండో వికెట్ కోల్పోయిన ఐర్లాండ్2.2: అర్ష్‌దీప్ బౌలింగ్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరిన రాస్ అడైర్ (7 బంతుల్లో 16). కెప్టెన్ లోర్కాన్ టక్కర్ క్రీజులోకి వచ్చాడు. ఐర్లాండ్ స్కోరు: 26-2(3). టక్కర్ 1, హ్యారీ టెక్టార్ 4 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన ఐర్లాండ్1.5: హర్షిత్ రాణా బౌలింగ్‌లో అభిషేక్ శర్మకు క్యాచ్ఇచ్చి పెవిలియన్ చేరిన టిమ్ టెక్టార్ (6 బంతుల్లో 5). హ్యారీ టెక్టార్ క్రీజులోకి వచ్చాడు. ఇద్దరి అరంగేట్రంఈ మ్యాచ్ సందర్భంగా తమ జట్టు తరఫున సూర్యాంశ్ షెడ్గే, ప్రిన్స్ యాదవ్ (టీ20) అరంగేట్రం చేస్తున్నట్లు టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. సూర్యాంశ్ ఐపీఎల్లో సత్తా చాటాడని.. అతడి ఆట తీరుపై తమకు నమ్మకం ఉందని పేర్కొన్నాడు. అయితే, చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీకి మాత్రం మరోసారి మొండిచేయి ఎదురైంది.తొలి టీ20లో విఫలమైన వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ కృష్ణపై వేటు పడింది. వారిద్దరి స్థానాల్లో సూర్యాంశ్, ప్రిన్స్ యాదవ్ తుదిజట్టులోకి వచ్చారు. అయితే, ఐర్లాండ్ మాత్రం తొలి టీ20లో టీమిండియాపై గెలుపొందిన జట్టునే కొనసాగించింది. కాగా బెల్ఫాస్ట్ వేదికగా తొలి టీ20లో ఆతిథ్య ఐర్లాండ్ టీమిండియాను 34 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా తొలిసారి భారత జట్టుపై గెలుపు నమోదు చేసింది.తుదిజట్లుటీమిండియాఅభిషేక్ శర్మ, సంజు శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్.ఐర్లాండ్టిమ్ టెక్టర్, రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్(కెప్టెన్, వికెట్ కీపర్), బెంజమిన్ కాలిట్జ్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, లియామ్ మెక్‌కార్తీ, మాథ్యూ హంఫ్రీస్, జై ముంద్రా, మాథ్యూ హోలార్డ్. -
ఐర్లాండ్ చేతిలో ఓటమి.. కెప్టెన్‌గా నాకు గొప్ప ఆరంభం
టీమిండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. పసికూనలా భావించే ఐర్లాండ్ చేతిలో భారత జట్టు అనూహ్య రీతిలో ఓడిపోయింది. బెల్ఫాస్ట్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ సేన 34 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు చేతిలో పరాజయం పాలైంది.టక్కర్ అర్ధ శతకం ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది. టాపార్డర్‌ను కుదేలు చేసి శుభారంభం అందుకున్నా.. తర్వాత దానిని కొనసాగించలేకపోయింది. ఐరిష్ జట్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టిన లోర్కాన్ టక్కర్ మెరుపు అర్ధ శతకం (38 బంతుల్లో 50)తో ఇన్నింగ్స్ చక్కదిద్దగా.. గెరాత్ డెలనీ (50) కూడా రాణించాడు.ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఐర్లాండ్ తొమ్మిది వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. భారత బౌలర్లలో హర్షిత్ రాణా మూడు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ తలా రెండు.. శివం దూబే ఒక వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన టీమింఇయా 18.5 ఓవర్లలో కేవలం 148 పరుగులు చేసి ఆలౌట్ అయింది.అభిషేక్ ఒక్కడే..ఓపెనర్ అభిషేక్ శర్మ (49) చెలరేగినా మిగతా వారి నుంచి అతడికి సహకారం అందలేదు. లోయర్ ఆర్డర్లో శివం దూబే (14 బంతుల్లో 25) కాసేపు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. ఈ క్రమంలో ఐర్లాండ్ చేతిలో టీమిండియా తొలిసారి టీ20 మ్యాచ్‌లో పరాజయం నమోదు చేసింది.ఈ నేపథ్యంలో ఓటమి అనంతరం కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. ఇదొక గొప్ప ఆరంభం అని పేర్కొనడం గమనార్హం. ‘‘ఏదీ సులువుగా దొరకదు. కఠినంగా శ్రమిస్తేనే విజయం వరిస్తుంది. గతంలో ఏం జరిగిందన్న విషయంతో సంబంధం లేకుండా.. వర్తమానంలో జీవించడం ముఖ్యం.The perfect start for the Men in Blue.💙Harshit Rana strikes early, and Sanju Samson does the rest behind the stumps.👏Watch #IREvIND LIVE NOW on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV pic.twitter.com/esK99zoUwA— Sony Sports Network (@SonySportsNetwk) June 26, 2026కెప్టెన్‌గా గొప్ప ఆరంభంప్రత్యర్థిని కట్టడి చేసే అవకాశం లభిస్తే.. ఆ క్షణాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ చేజారనీయకూడదు. నిజానికి ఆరంభంలో మా బౌలర్లు అత్యద్భుతంగా బౌలింగ్ చేశారు. వరుసగా వికెట్లు పడగొట్టి సత్తా చాటారు. కానీ ఆ తర్వాత మేము మొమెంటమ్ కోల్పోయాము.ఇక్కడ వాళ్లు 140 పరుగులు చేయడం గొప్పే అనిపించింది. కానీ వారిని మేము కట్టడి చేయలేకపోయాము. ఏదేమైనా ఇక్కడ గొప్ప అనుభవం లభించింది. ఇలాంటి పిచ్‌లపై మరిన్ని మ్యాచ్‌లు ఆడాలి. అప్పుడే వికెట్‌పై మాకు ఓ అవగాహన వస్తుంది. ఏదేమైనా కెప్టెన్‌గా నాకిది గొప్ప ఆరంభమే’’ అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.చదవండి: అందుకే వైభవ్‌ను ఆడించలేదు: శ్రేయస్The moment history was made! 💚#BackingGreen | #IREvIND | #FáilteSolar pic.twitter.com/irDjNkEbK9— Cricket Ireland (@cricketireland) June 26, 2026 -
ఐర్లాండ్ దెబ్బ కొట్టింది
బెల్ఫాస్ట్: టి20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన తర్వాత ఆడిన తొలి పోరులో భారత్‌కు గట్టి షాక్ తగిలింది. గతంలో ఎనిమిది సార్లు భారత్‌తో తలపడి అన్నింట్లో ఓడిన ఐర్లాండ్ ఈసారి పదునైన ఆటతో దెబ్బ కొట్టింది. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లో విఫలమైన టీమిండియా అనూహ్యంగా తలవంచింది. శుక్రవారం జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. కెప్టెన్ లోర్కాన్ టకర్ (36 బంతుల్లో 50; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), గారెత్ డెలానీ (32 బంతుల్లో 49; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 44 బంతుల్లో 64 పరుగులు జోడించారు. అనంతరం భారత్ 18.5 ఓవర్లలో 148 పరుగులకే ఆలౌటైంది. అభిషేక్ శర్మ (20 బంతుల్లో 49; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), శివమ్ దూబే (14 బంతుల్లో 25; 1 ఫోర్, 2 సిక్స్‌లు) మాత్రమే దూకుడుగా ఆడగా, మిగతా వారంతా విఫలమయ్యారు. ఇరు జట్ల మధ్య రెండో టి20 రేపు ఇదే మైదానంలో జరుగుతుంది. కీలక భాగస్వామ్యం... హర్షిత్, అర్ష్ దీప్ పదునైన బౌలింగ్‌తో ఐర్లాండ్ 6 ఓవర్లలోపే మూడు వికెట్లు కోల్పోయింది. డెయిర్ (0), హ్యారీ టెక్టర్ (0), టిమ్ టెక్టర్ (17) వెనుదిరగ్గా, పవర్‌ప్లేలో జట్టు 36 పరుగులే చేసింది. దూబే తొలి బంతికే బెన్ కాలిట్జ్ (15)ను అవుట్ చేయడంతో జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో టకర్, డెలానీ కలిసి ఐర్లాండ్‌ను ఆదుకున్నారు. 9 పరుగుల వద్ద డెలానీ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను అభిషేక్ వదిలేశాడు. అక్షర్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాదిన టకర్ 35 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ప్రసిధ్ ఓవర్లో డెలానీ వరుసగా 4, 6, 6, 6 బాదగా మొత్తం 27 పరుగులు వచ్చాయి. చివరి 4 ఓవర్లలో ఐర్లాండ్ 45 పరుగులు చేసింది. అభిషేక్ మినహా... ఛేదనలో ఒకవైపు అభిషేక్ చెలరేగినా... మరోవైపు సామ్సన్ (5), ఇషాన్ కిషన్ (1) విఫలమయ్యారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత తొలి టి20 మ్యాచ్ ఆడిన శ్రేయస్ అయ్యర్ (3) ప్రభావం చూపకపోగా, తిలక్ వర్మ (19) కూడా నిలవలేదు. కొద్దిగా పోరాడిన దూబే అవుటయ్యే సమయానికి భారత్ 4 ఓవర్లలో 48 పరుగులు చేయాల్సి ఉంది. అయితే తర్వాతి 17 బంతుల్లో జట్టు మరో 13 పరుగులు మాత్రమే చేసిన జట్టు చివరి 3 వికెట్లు కోల్పోయింది.వైభవ్‌కు చోటు లేదు! భారత అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూసిన క్షణం శుక్రవారం రాలేదు. తుది జట్టులో వైభవ్ సూర్యవంశీని టీమ్ మేనేజ్మెంట్ ఎంపిక చేయలేదు. వరల్డ్ కప్ విజయంలో కీలకపాత్ర పోషించిన టాప్–3నే కొనసాగించడంతో వైభవ్‌కు అరంగేట్రం చేసే అవకాశం లేకుండా పోయింది.తొలి బంతికే ‘జై’... అంతర్జాతీయ క్రికెట్లో తాను వేసిన తొలి బంతికే సామ్సన్ను బౌల్డ్ చేసి ఐర్లాండ్ లెఫ్టార్మ్ పేసర్ జై ముంద్రా సంచలనం సృష్టించాడు. 29 ఏళ్ల ముంద్రా భారత్‌కు చెందినవాడే. రాజస్తాన్‌లోని టోంక్‌లో పుట్టిన అతను ఐదేళ్ల క్రితం ఎల్రక్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు ఐర్లాండ్‌కు వెళ్లాడు. భారత్‌లో క్రికెట్‌తో గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత మరో దేశంలో కొనసాగించిన ఆటగాడు కాదు అతను. డబ్లిన్‌లో అడుగు పెట్టిన తర్వాతే ఆటపై ఆసక్తితో ప్రతిష్టాత్మక లీన్స్టర్ క్లబ్ లెఫ్టార్మ్ స్పిన్నర్‌గా ముంద్రా చేరాడు. ఆ తర్వాత అతను పేస్ బౌలింగ్ వైపు మళ్లాడు. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేయక ముందు ముంద్రా దేశవాళీ క్రికెట్లో 1 ఫస్ట్ క్లాస్ మ్యాచ్, 6 వన్డేలు, 5 టి20లు ఆడాడు. బాబ్జీ నరసింహారావు, రమణ్ లాంబా, సిమి సింగ్, రాబిన్ వాటర్స్ తరహాలో భారత్‌లో పుట్టి ఐర్లాండ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్ల జాబితాలో అతను చేరాడు. స్కోరు వివరాలు ఐర్లాండ్ ఇన్నింగ్స్: టిమ్ టెక్టర్ (సి) అయ్యర్ (బి) రాణా 17; అడెయిర్ (సి) సామ్సన్ (బి) రాణా 12; హ్యారీ టెక్టర్ (సి) సామ్సన్ (బి) అర్ష్ దీప్ 0; టకర్ (సి) తిలక్ (బి) రాణా 50; కాలిట్జ్ (సి) ప్రసిధ్ (బి) రాణా 15; డెలానీ (సి) అక్షర్ (బి) అర్ష్ దీప్ 49; డాక్రెల్ (సి) అర్ష్ దీప్ (బి) అక్షర్ 19; మెక్‌కార్తీ (సి) తిలక్ (బి) అక్షర్ 7; హంఫ్రీస్ (రనౌట్) 2; ముంద్రా (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 182. వికెట్ల పతనం: 1–20, 2–25, 3–30, 4–51, 5–115, 6–164, 7–178, 8–178, 9–182. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–28–2, హర్షిత్ రాణా 4–0–24–3, ప్రసిధ్ 4–0–57–0, శివమ్ దూబే 3–0–18–1, అక్షర్ 4–0–33–2, సుందర్ 1–0–19–0. భారత్ ఇన్నింగ్స్: అభిషేక్ (సి) కాలిట్జ్ (బి) మెక్‌కార్తీ 50; సామ్సన్ (బి) ముంద్రా 5; ఇషాన్ కిషన్ (సి) టకర్ (బి) హోలార్డ్ 1; అయ్యర్ (సి) డాక్రెల్ (బి) హోలార్డ్ 3; తిలక్ (సి) అడెయిర్ (బి) హంఫ్రీస్ 19; సుందర్ (సి) కాలిట్జ్ (బి) హోలార్డ్ 9; దూబే (సి అండ్ బి) ముంద్రా 25; అక్షర్ (సి) టిమ్ టెక్టర్ (బి) డెలానీ 15; రాణా (సి) కాలిట్జ్ (బి) హంఫ్రీస్ 8; అర్ష్ దీప్ (సి) టిమ్ టెక్టర్ (బి) హంఫ్రీస్ 2; ప్రసిధ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (18.5 ఓవర్లలో ఆలౌట్) 148. వికెట్ల పతనం: 1–16, 2–45, 3–60, 4–80, 5–90, 6–100, 7–135, 8–137, 9–147, 10–148. బౌలింగ్: హంఫ్రీస్ 3.5–0–38–3, జై ముంద్రా 4–0–25–2, మెక్‌కార్తీ 3–0–29–1, హోలార్డ్ 4–0–28–3, హ్యారీ టెక్టర్ 3–0–22–0, డెలానీ 1–0–3–1. -
‘ఆ సంతోషాన్ని చెడగొట్టేందుకు సిద్ధంగానే ఉన్నాము’
టీమిండియా- ఐర్లాండ్ మధ్య టీ20 సిరీస్ నేపథ్యంలో కళ్లన్నీ భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపైనే ఉన్నాయి. బెల్ఫాస్ట్ వేదికగా శుక్రవారం ఈ చిచ్చర పిడుగు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే, వైభవ్ కోసం ఎవరిని తప్పించాలో తెలియడం లేదంటూ టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ బాంబు పేల్చాడు. దీంతో మ్యాచ్ మొదలైనపుడే వైభవ్ అరంగేట్రంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. ఐర్లాండ్ కెప్టెన్ లోర్కాన్ టక్కర్ వైభవ్ సూర్యవంశీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.నిజంగా నమ్మలేని విషయంమ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పదిహేనేళ్ల పిల్లాడు టీమిండియాలో ఉండటం నిజంగా నమ్మలేని విషయం. ఇక ముందు కూడా ఇది సాధ్యమవుతుందని నేను అనుకోవడం లేదు. నిజానికి వైభవ్ సూర్యవంశీకి క్రెడిట్ ఇవ్వాల్సిందే.ఇదొక గొప్ప రోజుఅతడొక ప్రత్యేకమైన ఆటగాడు. ఈ వారంలోనే అతడు మాపై అరంగేట్రం చేయవచ్చు. అతడి కెరీర్లోనే ఇదొక గొప్ప రోజు అవుతుంది’’ అని టక్కర్ వైభవ్‌ను కొనియాడాడు. అయితే, అదే సమయంలో.. ‘‘వైభవ్‌ను త్వరగా పెవిలియన్‌కు పంపి అతడి సంతోషాన్ని చెడగొట్టేందుకు కూడా మేము ప్రయత్నాలు చేస్తాము. ఐర్లాండ్‌లో కూడా వైభవ్ సూర్యవంశీ ఎంట్రీపై భారీ అంచనాలు, హైప్ ఉన్నాయి. నిజంగానే అతడు అద్భుతమైన నైపుణ్యాలున్న బ్యాటర్. ఐపీఎల్లో సంచలనం సృష్టించాడు. పరిశోధనలు చేశాముఅయితే, అతడిని ఎలా త్వరగా అవుట్ చేయగలమన్న అంశం గురించి మేము చేయాల్సినన్ని పరిశోధనలు చేశాము. సానుకూల ఫలితం రాబట్టేందుకు కృషి చేస్తాం’’ అని వైభవ్‌కు టక్కర్ హెచ్చరికలు జారీ చేశాడు. కాగా ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ పదహారు మ్యాచ్‌లలో కలిపి 776 పరుగులు సాధించాడు. తద్వారా ఈ సీజన్లో అత్యధిక పరుగుల వీరుడిగా పదిహేనేళ్లకే ఆరెంజ్ క్యాప్ అందుకుని చరిత్ర సృష్టించాడు.ఇక ఐర్లాండ్‌తో శుక్రవారం నాటి తొలి టీ20లో వైభవ్ గనుక అరంగ్రేటం చేస్తే.. టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన అతిపిన్న వయస్కుడిగా నిలుస్తాడు. ప్రస్తుతం వైభవ్ వయస్సు 15 ఏళ్ల 91 రోజులు. అంతకు ముందు దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ 16 ఏళ్ల 205 రోజుల వయసులో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. చదవండి: శ్రీలంకతో టెస్టు.. శతకానికి చేరువలో భారత కెప్టెన్


